karem sivaji
-
జనరంజక పాలనపై కత్తిగట్టిన టీడీపీ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ప్రజారంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కుట్రలకు తెరలేపారని ఏపీ ఎస్సీ,ఎస్టీ, కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ విమర్శించారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఓ సామాజిక వర్గానికి చెందిన వారు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలను సేకరించి వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. బాబు కుట్రలపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలోని కమలనాథులు విశాఖపట్నం నగర విశిష్టతను దెబ్బతీసే విధంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన రహస్య ఒప్పందంతో పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ బరిలోనూ వైఎస్సార్సీపీ సత్తా చాటు తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన నేతృత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు సి.ఎం.మంగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు తిరగటి శివ, నగర అ«ధ్యక్షుడు దేబరుకుల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్‌కు పవన్ క్షమాపణలు చెప్పాలి
-
‘చంద్రబాబు, పవన్‌కు వారి త్యాగాలు తెలియవా’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ బీసీజీ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నామని ఎస్సీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విధంగా బీసీజీ నివేదిక ఉందని, విశాఖలో రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, రోడ్డు, వైమానిక, సముద్ర మార్గాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు మోసం చేయడం వల్లే అమరావతి రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు. అభివృద్ది 23 గ్రామాలకే పరిమితం కావాలా... రాష్ట్రమంతా అభివృద్ది చెందకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసింది పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులే కానీ.. అమరావతి రైతులు కాదని అన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి అమరావతి రైతులు మోసపోవద్దని హితవు పలికారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళన కృత్రిమమైనదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , కమ్యూనిస్టులకు పోలవరం రైతుల త్యాగాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కారెం శివాజీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన శుక్రవారం ఆయన పార్టీలో చేరారు. కారెం శివాజీకి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా గత సార్వత్రిక ఎన్నకల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి భవిష్యత్తు లేదని భావించిన.. శివాజీ గురువారమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశాను. పదవీ కాలం ఉన్నా సీఎం జగన్ ఆశయాలకు ఆకర్షితుడిని రాజీనామా చేశాను. బేషరతుగా వైస్సార్సీపీలో చేరుతున్నాను. ఎస్సీ ఎస్టీల కోసం సీఎం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయి. 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వారి కళ్ళలో కాంతి కనిపిస్తోంది. నవరత్నాలు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ ఆంద్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి మేలు చేశారు. ఆంగ్ల మాధ్యమం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం.. లేదంటే మా పిల్లలు వెనుకబడతారు. అందుకే మేము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నాం. మేమంతా సీఎం జగన్‌కు అండగా ఉంటాం.’ అని తెలిపారు. -
దళితజాతి ద్రోహి కారెం శివాజీ
పాలకొల్లు సెంట్రల్ : చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ దళిత జాతిని కించపరుస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎస్సీసెల్ కో ఆర్డినేటర్ చెల్లెం ఆనందప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని శివాజీని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ గౌరవాన్ని తగ్గిస్తూ దళితులంతా టీడీపీ వెంట ఉండాలంటూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడన్నారు. ఇలా ఎన్నికల ఉల్లంఘన ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చంద్రబాబు మెప్పు కోసం ఎస్సీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కలిసి దళిత జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్, రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబులు దళితజాతిని చంద్రబాబుకు తాకట్టుపెట్టారన్నారు. జిల్లాలోని గరగపర్రులో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తరఫున ఏజెంట్లుగా వచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కారెం, జూపూడి, నక్కా ఆనందబాబులు ఇంతవరకూ ఈ సంఘటనలో ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 90 శాతం దళితులు వైఎస్సార్ పార్టీకే అండగా ఉన్నారన్నారు. వైసీపీ పాలకొల్లు మండల అధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్‌రాజు, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు బండి సుందరరామ్మూర్తి, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ మద్దా చంద్రకళ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పార్శి వెంకటరత్నం, జిల్లా ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరాస్వామి, మాజీ ఎంపీటీసీ పొనుకుమట్ల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘నక్కా ఆనంద్, కారెం శివాజిలు.. చంద్రబాబు చప్రాసీలు’
సాక్షి, విజయవాడ : దళితుల పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కారుకూతులు కూస్తే సహించేది లేదంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. బుధవారం వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున వైఎస్ జగన్‌పై దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనైతికంగా మాట్లాడుతూ పశువుల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నక్కా ఆనంద్ బాబు, కారెం శివాజి, జవహర్‌లు దళితులైనంతా మాత్రాన వైఎస్ జగన్ గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరన్న చంద్రబాబు వద్ద పని చేస్తూ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.. మీకు అంత సత్తా ఉంటే అరెస్ట్ చేయించండంటూ సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌ను చంపడానికి విజయమ్మ, షర్మిల ప్లాన్ చేశారని ఏకలవ్యుడు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు.. మీ నోట్లో ఏమన్నా అశుద్దం పోసుకున్నారా అంటూ మేరుగు తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్కా ఆనంద్, కారెం శివాజి, జవహర్‌లు దళితులని వారి చేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారు. దళితుల పేరుతో మా నాయకుడి గురించి కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు దగ్గర చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగబలిసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి పట్ల టీడీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే సత్తా టీడీపీ నేతలకు లేదని వెల్లడించారు. వైఎస్ జగన్ చమట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ రాజీనామాలను చంద్రబాబు ముఖాన విసిరేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అంతేకానీ దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టొద్దని కోరారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన ఒక్క దళితుడు కూడా వైఎస్ జగన్ నుంచి పక్కకు వెళ్లరని మేరుగు ధీమా వ్యక్తం చేశారు. -
కారెం శివాజీ ఖాతాకు రూ.12 లక్షలు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి పాత్ర ఉన్నట్టు తాజాగా వెల్లడైన ఆడియో టేపులు తేటతెల్లం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న కోవూరు ఎజ్రా శాస్త్రి ఆర్టీసీ బ్యాక్లాగ్ పోస్టుల వ్యవహారంలో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడం తెలిసిందే. కాగా, ఎజ్రా శాస్త్రికి, కారెం శివాజీకి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. దాదాపు గంటన్నరపాటు వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణల్లో కారెం శివాజీ ఖాతాకు నేరుగా రూ.12 లక్షలు పంపించినట్టు ఎజ్రా శాస్త్రి వెల్లడించారు. నా పేరు చెప్పి భారీగా వసూలు చేశావుగానీ, నాకు అంత ఇవ్వలేదు కదా అని కారెం శివాజీ.. శాస్త్రితో అనడం ఈ టేపుల్లో ఉంది. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఆశ కల్పించి శాస్త్రి చేసిన వసూళ్లు రూ.2 కోట్ల వరకు ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న కారెం శివాజీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారని, ఆ వెంటనే ఆర్టీసీలో నోటిఫికేషన్ జారీ అవుతుందని చెబుతూ ఎజ్రా శాస్త్రి యూనియన్‌లో ప్రచార కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ నుంచి రూ.12.5 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పడంతో ఆజాద్ మరికొందరి నుంచి కూడా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. నెల్లూరు ప్రధాన బస్టాండ్‌లో క్యాంటీన్ నిర్వహిస్తున్న కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లికి చెందిన తిరుమలయ్య మోసపోయి రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితులు ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యను కలసి ఫిర్యాదు చేయగా.. కేసు పెట్టాలని సూచించడం, బాధితులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, దీనిపై బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేయడం తెలిసిందే. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం: కారెం ఆర్టీసీలో బ్యాక్లాగ్ పోస్టులిప్పిస్తానని ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, అలాంటి అలవాటు తన చరిత్రలో లేదని కారెం శివాజీ చెప్పారు. ఆరోపణలపై ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. ఆర్టీసీ యూనియన్‌లో రెండు గ్రూపులున్నాయని, వాటిమధ్య తలెత్తిన వివాదాల వల్లే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదని, బ్యాక్లాగ్ పోస్టుల వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. -
‘శివాజీ యుద్ధం చేయాల్సింది చంద్రబాబుతో’
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కారెం శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. కారం శివాజీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. మేరుగ నాగార్జున శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ అనర్హుడని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, అదే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి శివాజీ అనర్హుడని తెలిసినా నియాకం చేశారని, అందుకే కారెం శివాజీ ప్రమాణా స్వీకారానికి అప్పట్లో చంద్రబాబు గైర్హాజరు అయిన విషయాన్ని గుర్తు చేశారు. కారెం శివాజీ యుద్ధం చేయాల్సింది చంద్రబాబుతో అని, ఈ కేసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. మనసులో ఏవో దురుద్దేశాలు పెట్టుకుని కారెం శివాజీ ఆరోపణలు చేయడం సరికాదని మేరుగ నాగార్జున అన్నారు. -
రికార్డుల నిర్వహణపై అసంతృప్తి
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురంలో భర్తీ చేసిన బోధన, బోధనేతర ఉద్యోగాలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల రికార్డుల నిర్వహణపై ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అసంతప్తి వ్యక్తం చేశారు. ఎస్కేయూలో సమీక్ష సమావేశం అనంతరం జేఎన్టీయూ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. పొరుగుసేవలు, బోధన, బోధనేతర ఉద్యోగాల రోస్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. పొరుగు సేవలకు సంబంధించి 89 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మాత్రమే ఎస్సీలకు కేటాయించారని, డేటా ఆపరేటర్లలో ఎస్టీకి ఒక పోస్టు మాత్రమే ఇచ్చారని, సామాజిక న్యాయం ఎక్కడ పాటించారని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ, గిరిజన, వికలాంగ సంక్షేమ అధికారులతో సామాజిక తనిఖీ చేయించలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ పాల్గొన్నారు. -
వివక్షత చూపితే కఠిన చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి నెల్లూరు(సెంట్రల్): సమాజంలో దళితులపై ఎవరైనా వివక్షత చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమైఖ్య సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు పనిచేయాలన్నారు. బాబాసాహెబ్ సిద్ధాంతాలను పాటిస్తూ తోటి దళితులకు సాయంచేయాలని సూచించారు. ఉద్యోగులు కూడా కలసికట్టుగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా దళితులు ఆత్మగౌరవం కోసం పోరాడాలని సూచించారు. వ్యవస్థలో మార్పులు వచ్చి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోవాలన్నారు. నెల్లూరులో అధునాతన వసతులతో రూ.5 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణం త్వరలోనే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బహుజన మెడికల్ అండ్ ఎంప్లాయీస్ జిల్లా అ«ధ్యక్షుడు విడవలూరు శ్రీకాంత్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఉద్యోగులును సమాయత్తం చేసి సంఘం అందరినీ ఏక తాటిపై నిలిపుతామన్నారు. సదస్సులో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఎజ్రా శాస్త్రి, శివ శీనయ్య, బొడ్డు ప్రసాద్, పల్లి నరసింహులు, అమారిహనోక్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎటెళ్దాం!
నేడు విజయవాడలో మంత్రి రావెల సమావేశం నెల్లూరులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ పర్యటన మంత్రి, చైర్మన్ మధ్య నలిగపోతున్న అధికారులు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మధ్య ఆధిపత్య పోరు ఆయా శాఖల అధికారులకు ఉద్యోగ సంకటంగా మారింది. ఇరువురు నేతలు అధికారులను తమ ప్రాబల్యానికి వాడుకుంటున్నారు. గురువారం మంత్రి రావెల విజయవాడలో నిర్వహించే సమావేశానికి రావాంటూ సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు అందాయి. అక్కడికి వెళ్దామనుకున్న సమయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం నెల్లూరుకు వస్తున్నట్లు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు రావడంతో ఎటెళ్లాలని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. నెల్లూరు (సెంట్రల్) : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్లో జరిగే ప్రతి పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారికంగా జరిగే సమావేశాలకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, అటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను పిలిపించుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మంత్రి రావెలపై అసంతృప్తిగా ఉండటతో ఆయనకు వ్యతిరేక వర్గంగా ఉన్న కారెం శివాజీని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పదవిని కట్టబెట్టించారు. మంత్రి చేస్తున్న ప్రతి పనిలో కారెం వేలు పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి కూడా కారెంకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. దీంతో దళితుల్లో రెండు వర్గాలుగా విడిపోవాల్సి వచ్చినట్లు ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రి రావెల మాటను కూడా చైర్మన్ లెక్క చేయకపోవడం ఏమిటని పలువురు దళితులు ప్రశ్నిస్తున్నారు. ఇబ్బందుల్లో అధికారులు మంత్రి రావెల కిషోర్‌బాబు గురువారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రతి జిల్లా నుంచి సంబంధిత శాఖ అ«ధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశాలు ఉన్నాయి. కాని అదే సమయంలో జిల్లాలో కారెం శివాజీ పర్యటన ఉండటంతో ఆయన పర్యటనలో తప్పకుండా ఉండాలంటూ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాని అధికారులు ఏ పర్యటనకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సెలవుపై వెళ్లేందుకు అధికారులు? ఇరువురి నేతల మధ్య విభేదాల కారణంగా తమ జీవితాలతో ఆటలాడుకుంటున్న తీరును చూసిన పలువురు అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఽఇటీవల నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో కారెం శివాజీ సమావేశం అనంతరం పలువురు అధికారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. నేడు జరుగుతున్న సమావేశానికి పలువురు అధికారులు డుమ్మాకొట్టి సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
దళిత సమస్యలపై పోరాటం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గణపవరం (నిడమర్రు) : దళిత సమస్యలపై పోరాడేందుకు తన ప్రాణాలు పణంగా పెడతానని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. శుక్రవారం పిప్పరలోని సందా సత్రంలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కారెం శివాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ దళిత నాయకుడైనా ప్రజల్లో తిరిగితేనే వారి కష్టాలు తెలుస్తాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి చేస్తానన్నారు. ఉప ప్రణాళిక నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని దళిత గ్రామాల అభివృద్ధికి పారదర్శకంగా వినియోగించాలన్నారు, జాతి వివక్షతతో దళితులకు అన్యాయం జరిగే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు.ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, బుత్తల శ్రీను, తెనాలి విలియం, గోసాల పండుబాబు, వరిఘేటి కిషోర్, చుక్కా మెంటయ్య పాల్గొన్నారు. -
దళిత సమస్యలపై పోరాటం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గణపవరం (నిడమర్రు) : దళిత సమస్యలపై పోరాడేందుకు తన ప్రాణాలు పణంగా పెడతానని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. శుక్రవారం పిప్పరలోని సందా సత్రంలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కారెం శివాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ దళిత నాయకుడైనా ప్రజల్లో తిరిగితేనే వారి కష్టాలు తెలుస్తాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి చేస్తానన్నారు. ఉప ప్రణాళిక నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని దళిత గ్రామాల అభివృద్ధికి పారదర్శకంగా వినియోగించాలన్నారు, జాతి వివక్షతతో దళితులకు అన్యాయం జరిగే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు.ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, బుత్తల శ్రీను, తెనాలి విలియం, గోసాల పండుబాబు, వరిఘేటి కిషోర్, చుక్కా మెంటయ్య పాల్గొన్నారు. -
హోదా కోసం పోరాడితే కచ్చితంగా వచ్చేది
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ప్రత్యేక హోదా కోసం పోరాడి ఉంటే రాష్ట్రానికి కచ్చితంగా హోదా వచ్చేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. ఏలూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని స్వాగతిస్తూనే విభజన హామీలైన ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు, రైల్వే జోన్, చెన్నై– విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్, పెట్రోలియం యూనివర్సిటీ వంటి హామీలను సాధించేందుకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అందుకోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ప్రకటన దురదృష్టకరమని, మన నాయకులను కించపరుచుకోవడం మనకే నష్టమన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టులో ఉన్నందున దానిపై మాట్లాడే అధికారం తనకు లేదని, ఆయా సామాజిక వర్గాలు అందించే అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని శివాజీ చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ తనపై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని, ఆయన నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్లినా ముందుగా ఆయనకు చెప్పే వెళతానని, కానీ ఆయన అబద్ధపు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
దళిత భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
రాజమహేంద్రవరం: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో మాదిగలు వినతిపత్రం ఇస్తే ప్రభుత్వానికి సమర్పిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులతో సమీక్ష, రాజ మహేంద్రవరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం డివిజన్లో దళితుల భూములు అన్యాక్రాంతమైనట్టు తమ దృష్టికి వచ్చిందని, రెవెన్యూ అధికారులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. దళిత భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రుణాలను రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. వెంకటాయపాలెం శిరోముండన కేసు పురోగతి కోసం కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లను కుల వివక్షతో వేధింపులకు గురిచేసినా, అనవసరంగా చెక్‌పవర్ రద్దు చేసినా సహించేది లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు గ్రామసభ తీర్మానాలు చేయడంలో అడ్డుపడవద్దని కారెం శివాజీ కోరారు. -
ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది జ్యోతి ప్రసాద్ ...హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివాజీపై క్రిమనల్ కేసులు ఉన్నాయని, ఆయన ఎంపిక చట్టవిరుద్ధమంటూ జ్యోతిప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. అలాగే కారెం శివాజీ రికార్డులను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
సీబీఐతో విచారణ జరిపించాలి : కారెం శివాజీ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ మోసాలకు 38 మంది లక్షలు డిపాజిటర్లు మోసపోయారని అన్నారు. మొత్తం 28 వేల కోట్ల కుంభకోణం జరిగిందని శివాజీ గురువారమిక్కడ ఆరోపించారు. ఖాతాదారుల జాబితాను హైకోర్టుకు ఎందుకు సమర్పించడం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని కారెం శివాజీ డిమాండ్ చేశారు. వరుస మీడియా కథనాలతో అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇవాళ కోర్టుకు తెలిపింది. హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగనుంది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. -
'ఉద్యమాలతోనే ప్రత్యేక హోదా'
గూడూరు: ఉద్యమాలతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని.. బలిదానాలు చేసుకోవద్దని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా రాదనే కలతతో నెల్లూరు జిల్లా గూడూరులో గుండెపోటుతో మృతి చెందిన లోకేశ్వరరావు మృతదేహాన్ని శుక్రవారం సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారని, అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో యువత ఆందోళనకు గురవుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుండడం దారుణమన్నారు. -
'హోదా' విషయంలో ఎన్డీఏ మోసం చేసింది
విశాఖపట్నం (అల్లీపురం): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాప్రజలను మోసం చేసిందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు. విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హుద్-హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్యాకేజీ అమలు చేయకుండా, ఏపీ లోటు బడ్జెట్ పూరించకుండా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆయన దుయ్యబట్టారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకుని ప్రత్యేక హోదా విషయంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని కారెం శివాజీ ఈ సందర్భంగా కేంద్రాన్నిహెచ్చరించారు. -
'అశోక్‌బాబు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు'
హైదరాబాద్ : కేవలం రాజ్యసభ సీటు కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్ బాబు తాకట్టు పెట్టారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ మండిపడ్డారు. జనవరి 3వ తేదీలోపు ప్రజా సంఘాలు, కుల సంఘాలతో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరోవైపు ఏపీ ఎన్జీవో నేతలు....అశోక్ బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్ బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారని బషీర్, సత్యనారాయణ, శ్రీనివాస్ మండిపడ్డారు. విభజనకు పూనుకున్న పార్టీలతో అఖిలపక్షం నిర్వహించి....సమైక్యవాణిని వినిపించేవారిని పక్కన పెట్టారని వారు అన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తాం, దిగ్విజయ్‌ని అడ్డుకుంటామని అశోక్ బాబు చెప్పిన మాటలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. అశోక్ బాబు అసమర్థతను అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. 66 రోజుల సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని కోరారు.