సీబీఐతో విచారణ జరిపించాలి : కారెం శివాజీ | agri gold case should Trial with CBI demands by karem sivaji | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారణ జరిపించాలి : కారెం శివాజీ

Published Thu, Nov 26 2015 1:41 PM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM

సీబీఐతో విచారణ జరిపించాలి : కారెం శివాజీ - Sakshi

సీబీఐతో విచారణ జరిపించాలి : కారెం శివాజీ

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ మోసాలకు 38 మంది లక్షలు డిపాజిటర్లు మోసపోయారని అన్నారు. మొత్తం 28 వేల కోట్ల కుంభకోణం జరిగిందని శివాజీ గురువారమిక్కడ ఆరోపించారు.

ఖాతాదారుల జాబితాను హైకోర్టుకు ఎందుకు సమర్పించడం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని కారెం శివాజీ డిమాండ్ చేశారు. వరుస మీడియా కథనాలతో అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇవాళ కోర్టుకు తెలిపింది. హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగనుంది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement