హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది జ్యోతి ప్రసాద్ ...హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివాజీపై క్రిమనల్ కేసులు ఉన్నాయని, ఆయన ఎంపిక చట్టవిరుద్ధమంటూ జ్యోతిప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. అలాగే కారెం శివాజీ రికార్డులను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.