దళిత సమస్యలపై పోరాటం | fight on dalit problems | Sakshi
Sakshi News home page

దళిత సమస్యలపై పోరాటం

Published Fri, Sep 30 2016 11:29 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

fight on dalit problems

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ 
గణపవరం (నిడమర్రు) : దళిత సమస్యలపై పోరాడేందుకు తన ప్రాణాలు పణంగా పెడతానని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. శుక్రవారం పిప్పరలోని సందా సత్రంలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కారెం శివాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ దళిత నాయకుడైనా ప్రజల్లో తిరిగితేనే వారి కష్టాలు తెలుస్తాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి కృషి చేస్తానన్నారు. ఉప ప్రణాళిక నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని దళిత గ్రామాల అభివృద్ధికి పారదర్శకంగా వినియోగించాలన్నారు, జాతి వివక్షతతో దళితులకు అన్యాయం జరిగే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు.ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, బుత్తల శ్రీను, తెనాలి విలియం, గోసాల పండుబాబు, వరిఘేటి కిషోర్, చుక్కా మెంటయ్య పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement