దళితజాతి ద్రోహి కారెం శివాజీ | Karem Shivaji Did Nothing For Dalits | Sakshi
Sakshi News home page

దళితజాతి ద్రోహి కారెం శివాజీ

Published Tue, Apr 9 2019 11:09 AM | Last Updated on Tue, Apr 9 2019 11:13 AM

Karem Shivaji Did Nothing For Dalits - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చెల్లెం ఆనందప్రకాష్, తదితరులు

పాలకొల్లు సెంట్రల్‌ : చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ దళిత జాతిని కించపరుస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎస్సీసెల్‌ కో ఆర్డినేటర్‌ చెల్లెం ఆనందప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందప్రకాష్‌ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుని శివాజీని వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కమిషన్‌ గౌరవాన్ని తగ్గిస్తూ దళితులంతా టీడీపీ వెంట ఉండాలంటూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడన్నారు. ఇలా ఎన్నికల ఉల్లంఘన ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

చంద్రబాబు మెప్పు కోసం ఎస్సీ మంత్రులు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు కలిసి దళిత జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్, రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబులు దళితజాతిని చంద్రబాబుకు తాకట్టుపెట్టారన్నారు. జిల్లాలోని గరగపర్రులో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తరఫున ఏజెంట్లుగా వచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కారెం, జూపూడి, నక్కా ఆనందబాబులు ఇంతవరకూ ఈ సంఘటనలో ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 90 శాతం దళితులు వైఎస్సార్‌ పార్టీకే అండగా ఉన్నారన్నారు. వైసీపీ పాలకొల్లు మండల అధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్‌రాజు, రాష్ట్ర లీగల్‌ సెల్‌ నాయకులు బండి సుందరరామ్మూర్తి, జిల్లా మహిళా జనరల్‌ సెక్రటరీ మద్దా చంద్రకళ, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పార్శి వెంకటరత్నం, జిల్లా ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరాస్వామి, మాజీ ఎంపీటీసీ పొనుకుమట్ల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement