SC ST Welfare
-
ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని మాల సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం ‘మాలల సింహగర్జన’ బహిరంగసభ నిర్వహించారు.చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సభకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షత వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మాల సామాజికవర్గం నేతలు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పొందుపరిచిన రిజర్వేషన్ల సూత్రాలకు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మనువాదుల అండతో ఎస్సీలను చీల్చే కుట్రకు దిగారని ఆరోపించారు. మాలలకు అండగా ఉంటా: వివేక్మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసినా వెనక్కి తగ్గలేదని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మాలలందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుల వివక్ష నుంచి దళితులకు స్వాతంత్య్రం కల్పించేందుకు బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తన తండ్రి వెంకటస్వామి దళితుల కోసమే పోరాడారని.. మాల, మాదిగ అనే తేడా చూడలేదని తెలిపారు. మాలలు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తాను మంత్రి పదవి కోసమే మాలల పోరాటాన్ని మొదలుపెట్టానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. తాను పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు జరుగుతున్న కుట్రలను దళిత సమాజం గుర్తించాలని కోరారు. మాల, మాదిగలు కలిసి పోరాడాలి: ఎంపీ మల్లు రవిరిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి పిలుపుని చ్చారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించి, రిజర్వే షన్లను ఎత్తేసేలా చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. మాల, మాదిగలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల ని సూచించారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ల అమ లుకు ఉద్యమించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు, వర్గాలు మాలలపై దోపిడీదారుల ముద్ర వేశాయని ఆరోపించారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను తాము అడ్డుకోవడం లేదని, అందరికీ సమ న్యాయం కావాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి శంకర్ రావు చెప్పారు. మాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. సభలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే శ్రీగణేష్, పాశ్వాన్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్‌కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్‌రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్‌కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్‌పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
వర్గీకరణ అమల్లో ముందుంటాం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశంలోనే అందరికన్నా ముందు భాగాన నిలబడి అమలు చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ‘వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్‌కుమార్‌నూ సభ నుంచి బహిష్కరించింది. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్ జనరల్‌ను ఢిల్లీకి పంపాం.న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదన విని్పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం..’అని సీఎం పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించాలని అన్ని పక్షాలను కోరారు. రాజ్యాంగ ధర్మాసనానికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రకటన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్ల కల నెలవేరింది: రాజనర్సింహఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యాభై ఏళ్ల కల నెరవేరిందని, ఇది చారిత్రక దినమని అన్నారు. వర్గీకరణ అంటే మరో వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు.వర్గీకరణకు వైఎస్సార్ మద్దతిచ్చారు కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మంద కృష్ణమాదిగను జైల్లో పెట్టించింది కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. మాదిగ బిడ్డ స్పీకర్ అవడంతో కేసీఆర్ సభకు రావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ తరపున అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మందుల సామ్యూల్ కూడా మాట్లాడారు. సుప్రీం తీర్పును బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ స్వాగతించారు. ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ కృషి చేశారని తెలిపారు.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా తీర్పును స్వాగతించారు. కంభంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎల్పీ నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కను నియమిస్తే, ఆయన నాయకత్వంలో పనిచేయలేక సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు సుప్రీంకోర్టు తీర్పు పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే చక్కటి అవకాశం లభించిందన్నారు. ‘తీర్పునకు అనుగుణంగా రాబోయే నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినందుకు దళిత జాతుల పక్షాన ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.బీఆర్ఎస్ మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తోంది: హరీశ్‌రావు అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, ఏది ఏమైనా అంతిమ విజయం పాండవులదేనని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని.. అయితే అధికార పక్షం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కడంపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్ పారీ్టకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామంటూ.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్ 2014 నవంబర్ 29న వర్గీకరణ వెంటనే చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి వెళ్లి కేసీఆర్ స్వయంగా తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారని గుర్తుచేశారు.అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని.. ప్రధాని కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైనదని, ఎన్నో త్యాగాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణాలు అరి్పంచిన సంగతి మన కు తెలుసని అన్నారు. అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకున్నదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్రోహం చేసిందని చెప్పా రు.గాంధీభవన్ దగ్గర పెట్రోల్ పోసుకుని కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఏదిఏమైనా ఇది చాలా సంతోషకరమైన సందర్భమని, దశాబ్దాల కల నెరవేరిన రోజని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. -
అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘మాదిగల 30 ఏళ్ల పోరాటానికి తెరపడింది. వర్గీకరణ పోరాటంలో అడుగడుగునా అరెస్టులు.. ఉద్యమాలను అడ్డుకున్నా, పట్టు వీడకుండా న్యాయమైన పోరాటానికి అడుగులు వేశాం. ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో ఎన్ని అడ్డంకులు వచి్చనా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించాం. మాదిగల్లో పోరాట స్ఫూర్తిని నింపాం. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు రిజర్వేషన్లపై చైతన్యం తెచ్చాం’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో మంద కృష్ణమాదిగను ‘సాక్షి’ పలకరించింది. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పోరాటం వల్లే..మాదిగల హక్కుల కోసం 1994 జూలై 7న ‘మాదిగ పోరాట సమితి’ని స్థాపించాను. గ్రామ, మండలస్థాయిలో ఎమ్మారీ్పఎస్ కార్యకర్తలు..రాజకీయపారీ్టల కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారు. ఎంతోమంది మాదిగలు వర్గీకరణ కోసం బలిదానాలు చేసుకున్న సంఘటనలు నన్ను ప్రతిరోజూ కలచివేస్తుండేవి. ‘అన్నా మేం చనిపోతున్నాం..అయినా సరే పోరాటం ఆపొద్దు.మీరు ముందుండి ఉద్యమాన్ని నడపండి...ఏదో ఒకరోజు రిజర్వేషన్లు కచి్చతంగా సాధిస్తాం’అంటూ చనిపోయే ముందు కొందరు కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు ప్రతిరోజూ నేను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు పిలుపునిచ్చేవాడిని. వారి కన్నీళ్ల ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బలంగా ఉంటూ, పోరాటాలు చేశారు. ఎంతో మంది నాయకులు మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేసినా, వేధించినా, కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మారీ్పఎస్ పోరాటస్ఫూర్తి వల్లనే ఈరోజు విజయం సాధించాం. ఎంతో మంది సహకరించారుమేం చేసిన ఈ పోరాటానికి ఎంతోమంది మద్దతు పలికారు. అనేక పర్యాయాలు ఆర్థికపరమైన సాయం, మాట సాయం, న్యాయపరమైన సాయాలు ఎందరో చేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ ఐదుగురు అలా..ఈ ఐదుగురు ఇలా2004లో జస్టిస్ సంతోష్‌హెగ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవు అంటూ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో అరుణ్‌మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల «ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది.ఇదే సందర్భంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై న్యాయం చెప్పాలని సూచనలు చేసింది. ఆ సూచనల కారణంగానే తాజాగా రిజర్వేషన్లపై తీర్పు రావడం ఆనందంగా ఉంది. ముందేమో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వ్యతిరేకించింది, ఆ తర్వాతేమరో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుదాం వర్గీకరణ కోసం మేం పోరాటాలు చేస్తుంటే మా మాల సోదరులు రోడ్డెక్కి అడ్డుచెప్పేవారు. కానీ, కొంతకాలంగా వారి మనసులు మారాయి, మా పోరాటాలకు ఎవరూ అడ్డు పడలేదు. ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరం కలిసి పోరాడాల్సిన అవసరముంది. 2004లో తెచి్చన చట్టాన్నే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంది. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.సీఎంకు మాదిగ ఎమ్మెల్యేల స్వీట్లుసాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి మిఠాయిలు తినిపించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో డప్పు చప్పుళ్లతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలె యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శామేలు, తోట లక్ష్మీకాంతరావు తదితరులున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు చారకొండ వెంకటేశ్, గజ్జెల కాంతం, దేవని సతీశ్, మాజీ మంత్రి పుష్పలీల కూడా సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’ – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్క్లాస్లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.తొలుత దీనిపై (పంజాబ్ వర్సెస్ దేవీందర్‌సింగ్ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్‌లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.నెహ్రూ వ్యాఖ్యలను కోట్ చేస్తూ..‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ‘‘షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రారిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలిఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్‌గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్ పంకజ్ మిత్తల్క్రీమీలేయర్ వర్తింపజేయాలివెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్ బీఆర్ గవాయిఉప వర్గీకరణకు అనుకూలంషెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది. – జస్టిస్ విక్రమ్నాథ్తగిన డేటా సేకరించి అమలు చేయాలిరిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి. – జస్టిస్ సతీశ్చంద్రరాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదుఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్ బేలా ఎం త్రివేది -
ప్రత్యేక అభివృద్ధికి భారీ నిధి..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా జరిగాయి. రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.50,180.13 కోట్లు కేటాయించింది. గతేడాది చేపట్టిన కేటాయింపులతో పోలిస్తే కాస్త తగ్గి నట్లు కనిపించినప్పటికీ... కార్యక్రమాల వారీగా పరిశీ లిస్తే భారీ కేటాయింపులే జరిగినట్లు కనిపిస్తోంది. ప్రత్యే క అభివృద్ధి నిధి కేటాయింపులు 2023–2024 బడ్జెట్ కంటే రూ.1803 కోట్లు తగ్గాయి.2024–25 బడ్జెట్లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్) కింద రూ.33124.04 కోట్లు కేటాయించగా... ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్డీఎఫ్) కింద రూ. 17056.09 కోట్లు కేటాయించారు. 2023–24లో ఎస్సీఎస్‌డీఎఫ్‌లో దళితబంధు కింద రూ.17700 కోట్లు కేటాయించగా... వాటిలో పైసా ఖర్చు చేయలేదు. తాజాగా దళితబంధు పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం... ఆ స్థానంలో అంబేడ్కర్ అభయ హస్తం పేరిట కొత్త పథకాన్ని తీసుకొ స్తోంది. ఈ పథకం కింద ప్రస్తుత వార్షిక సంవత్సరానికి రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి గరిష్టంగా రూ.12 లక్షలు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు ఖరారు కాలేదు.గత కేటాయింపుల్లో ఖర్చు 48 శాతమే...2023–24 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం రూ.51983.09 కోట్లు కేటాయించింది. కానీ ఇందులో ఖర్చు చేసింది రూ.25048కోట్లు మాత్రమే. గతబడ్జెట్‌లో ఎస్సీ నిధి కింద రూ.36750.48 కోట్లు కేటాయించగా... రూ.14649 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఎస్టీ నిధి కింద రూ.15232.61 కోట్లు కేటాయించగా.. రూ.10399 కోట్లు ఖర్చు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో కేవలం 48 శాతం మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. -
Rahul Gandhi: ఎస్సీ, ఎస్టీ మహిళల ఖాతాలో లక్ష
సివనీ/షాదోల్: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు. అయినా దేశంలోని టాప్ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్యాంకర్ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, ఉప ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖాను నియమించిందని, ఆయన సానుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో వివేక్ తన్ఖాను కలిసి పలు విషయాలు చర్చించామన్నారు. వర్గీకరణ విషయంలో చొరవ చూపిన సీఎం రేవంత్‌కు మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వర్గీకరణ చేయాలా వద్దా అనేది మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని, ఆ తర్వాత ఎంత శాతం ఇవ్వాలనేది జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి దామోదర రాజనర్సింహ విచారణకు హాజరయ్యారు. -
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కవాడిగూడ (హైదరాబాద్): ఎస్సీవర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ (టీఎస్) ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ రంగాలలో మాదిగలకు సమానవాటా కోసం డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద cను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామని, 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేసి, మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలోని శానిటేషన్, డైట్ విభాగాలలో దళితులకే కాంట్రాక్ట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్(టీఎస్) జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సువర్ణరాజు, మాదిగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్‌లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్‌లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. మూడో విజయం తెలంగాణలోనే.. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తొలి విజయం హిమాచల్‌ప్రదేశ్‌లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు. కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్రాత్మకం: భట్టి రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు. వాటిపై కాంగ్రెస్ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
త్వరలో ‘కేసీఆర్ విద్యా కానుక’: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు. బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు. -
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఎస్సీల సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు మేలు జరగడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిపై బహిరంగచర్చకు రావాలని సవాలు చేశారు. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను మంత్రి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. దేశంలో గతంలో పరిపాలించిన ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఏపీ సాయమే అత్యధికమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా 34.86 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయని, వాటిలో ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలున్నాయని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో చేసిన ఖర్చు రూ.33,625 కోట్లు కాగా, మూడున్నరేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49,710.17 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎస్సీల సంక్షేమానికి రూ.33,629 కోట్లు ఖర్చుచేస్తే, జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఎస్సీల కోసం రూ.58,353 కోట్లు ఖర్చుచేశారని వివరించారు. టీడీపీ నేతలు దళితపల్లెకు వెళ్లి పేదగుడిసె తలుపుతట్టి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా వారు చెబుతున్న మాటలను ప్రస్తావిస్తే చెప్పుతో కొడతారని ఆయన హెచ్చరించారు. చదవండి: AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. -
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్‌రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
AP: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్.. మరో పదేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయం ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్‌ప్లాన్ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు. సబ్‌ప్లాన్ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్‌ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీపీఎం, కేవీపీఎస్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ హర్షం ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (హైదరాబాద్) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. అలాగే, జాతీయ దళిత హక్కుల చైర్మన్ పెరికె ప్రసాదరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. -
Fact Check: అబద్ధాలు చెప్పటమే అసలు దగా! దిగజారిపోయిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: నాడు.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలంటే అత్యంత చులకన. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అనే ఈసడింపు.. దళితులకు శుద్ధీ శుభ్రం ఉండవంటూ ఏవగింపు. నేడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీలంటే ఎంతో గౌరవం. ఎక్కడైనా ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అంటూనే మాట్లాడటం మొదలెడతారు. వారి హక్కులను కాపాడటమే కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారికి సమున్నత స్థానమిస్తున్నారు. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. అయినా సరే... ‘ఎస్సీ, ఎస్టీలకు దగా’ అంటూ చంద్రబాబు కళ్లలో సంతోషం కోసమే కథనాలు వండే స్థాయికి దిగజారిపోయింది ‘ఈనాడు’. అసలు ఎస్సీ, ఎస్టీలకు ఎవరేం చేశారు? 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు సీఎంగా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేసింది రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది నవంబరు వరకూ... అంటే మూడున్నరేళ్లలో ఎస్సీల సంక్షేమానికి రూ.58,353.07 కోట్లు, ఎస్టీలకు 15,660.03 కోట్లు ఖర్చు చేసింది. ఇదీ ఇద్దరికీ తేడా!!. రుణాల మంజూరు కనిపించదా రామోజీ? – ఈ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి, జీవనోపాధి మెరుగుదల కోసమిచ్చే రుణాలు 53 శాతం పెరిగాయి. ఇది సాక్షాత్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తాజా నివేదిక చెప్పిందే. – ‘జగనన్న తోడు’ పథకం కింద చిన్న వ్యాపారాలు చేసుకునే 9.05 లక్షల మందికి రుణాలివ్వగా... ఈ ఏడాది మూడో దశలో ఏకంగా 9 లక్షల మందికి రుణాలివ్వాలని లకి‡్ష్యంచారు. వారిలో 5.10 లక్షల మందికి ఇప్పటికే రుణాలిచ్చారు. ఈ రుణాలపై వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 32.51 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లలో ఇచ్చిన రుణాలివీ... ఏడాది రుణ మొత్తం (రూ.కోట్లలో) 2019–20 15,791 2020–21 18,689 2021–22 28,577 పథకాల్లో సింహభాగం... ఎన్నికల మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంలా భావించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం... 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రకరకాల పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ ప్రయోజనాన్ని చేకూర్చింది. – ఎస్సీ, ఎస్టీల వివాహాలు, కులాంతర వివాహాలకు సంబంధించి ఎన్నికలకు మూడునెలల ముందు హడావుడిగా పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు... ఒక్కరికైనా ఇస్తే ఒట్టు. కానీ బాబు ప్రకటించిన మొత్తాలను రెట్టింపు చేసి మరీ దీనికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్. విద్యకు ఇంత ప్రాధాన్యం ఎన్నడైనా ఉందా? ఎస్సీ, ఎస్టీల విద్యను పట్టించుకోవడం లేదనేది రామోజీ విషప్రచారం. చంద్రబాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్య అద్యంతం అక్రమాల పుట్టే. నకిలీ విదేశీ వర్సిటీలను చూపించి తమ వారి ఖాతాల్లోకే డబ్బులు మళ్లించేశారు. ఇది విజిలెన్స్ విచారణలోనూ వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో విదేశాలకు వెళ్లేవారు రాష్ట్రానికి పేరు తెచ్చేలా... ఇక్కడి సంపదను పెంచేలా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి జగన్... ప్రపంచంలోని టాప్–100 వర్సిటీల్లో సీట్లు సాధించినవారికి పూర్తి ఫీజును రీఇంబర్స్ చేస్తామని ప్రకటించారు. టాప్–200 వర్సిటీల్లో చేరినవారికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు. అంతేకాదు. నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన వంటి అనేక పథకాల ద్వారా విద్యావకాశాలు, మౌలిక వసతులను మెరుగుపరిచింది. ► రాష్ట్రంలోని స్టడీ సర్కిల్స్ ద్వారా విశాలో సివిల్ సర్వీసెస్, విజయవాడలో గ్రూప్–1, తిరుపతిలో బ్యాంకు పోస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్టడీ సర్కిల్స్‌లో ఈ ఏడాది ఆగస్టు వరకు 10,976 ఎస్సీ విద్యార్థుల కోసం రూ.12.75 కోట్లు ఖర్చు చేశారు. ► ఎస్సీ గురుకులాలకు టీడీపీ హయాంలో 9 ఐఐటీ, 19ఎన్ఐటీ, 18 ఎంబీబీఎస్ సీట్లు వస్తే... ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 57ఐఐటీ, 101ఎన్ఐటీ, 40ఎంబీబీఎస్ సీట్లు సాధించారు ఎస్సీ విద్యార్థులు. దీన్నిబట్టే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. అదే తీరులో గిరిజన సంక్షేమ గురు కులాలనూ ప్రోత్పసహించటంతో గతేడాది 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారు. రాజకీయాల్లో సముచిత స్థానం... వాడుకుని వదిలేయడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అడుగడుగునా నిర్లక్ష్యమే ఎదురైంది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీల రాజకీయ సాధికారతలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నారనటానికి కేబినెట్లో వారికిచ్చిన స్థానమే నిదర్శనం. తొలి కేబినెట్లో 56 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలను రెండవ విడతలో 70 శాతానికి తీసుకెళ్ళారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. పెద్దల సభ శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (ఎస్సీ), వైస్ చైర్మన్‌గా జకియాఖానం (మైనారిటీ), అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం(బీసీ)ను ఉన్నతస్థానాల్లో కూర్చొబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. 32 మంది వైసీపీ ఎమ్మెల్సీల్లో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలేనంటే... ముఖ్యమంత్రి జగన్ వారికిచ్చిన ప్రాధాన్యమేంటో తెలియకమానదు. ప్రత్యేక కార్పొరేషన్లతో అభివృద్ధికి ఊతం... ఎస్సీ, ఎస్టీలకు వేరువేరు కార్పొరేషన్లతో పాటు ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ వంటి ప్రత్యేక కార్పొరేషన్‌తో వారి అభివృద్ధికి ఊతమిస్తున్నారు. మాదిగలకు లిడ్‌క్యాప్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులిచ్చారు. ► స్ధానిక సంస్ధల పదవుల విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాటా 67 శాతం పైనే. 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 9 ఈ వర్గాలకే. 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 వీరివే. పార్టీ గెలిచిన 84 మున్సిపాల్టీలలో 58 స్ధానాలు వీరివే. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 పదవులు ఈ వర్గాలకే కేటాయించారంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తెలియకమానదు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 280 ఈ వర్గాలకే కేటాయించారు. ► ఇవి మాత్రమే కాదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2.60 లక్షల వాలంటీర్లలో 84 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే!. ► విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... వేగంగా నిర్మాణ పనులు చేయిస్తున్నారు. 125 అడుగుల ఎతైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మృతి వనానికి ప్రభుత్వం రూ.268.48కోట్లు ఖర్చు చేస్తోంది. గిరి జనానికి అండాదండ వివిధ పథకాల్లో ఎస్టీలకు సముచిత వాటా ఇవ్వటంతో పాటు... వారికి భూమి హక్కు(ఆర్వోఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు) కల్పించడంలో ఈ ప్రభుత్వానికి ఎవ్వరూ సాటిరారనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత 12 ఏళ్లలో 2.34 లక్షల ఎకరాలను పట్టాలుగా ఇవ్వగా.. ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏకంగా 2.48,887లక్షల ఎకరాలను పంచి రికార్డు సృష్టించింది. ► ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలతో ఎస్టీలకు సాంకేతిక, వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు అరకు కాఫీ, నల్లమల నన్నారి వంటి గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ను కల్పించి ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటినీ మరుగున పరుస్తూ... చంద్రబాబు కాలమే స్వర్ణయుగమనే ‘ఈనాడు’ రాతలు ఇంకెన్నాళ్లు? -
అభివృద్ధి నిధులు ‘స్పెషల్’!
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఏటా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా.. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధులు పెంచింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.47,350.37 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ నిధులు పెంచామని తెలిపారు. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.33,937.75 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.13,412.62 కోట్లు చూపారు. గత బడ్జెట్లో ఈ నిధికి రూ.33,610.06 కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకన్నా రూ.13,740.31 కోట్లు పెరిగాయి. ఈ ఫండ్‌కు కేటాయించిన నిధులను సంబంధిత సంక్షేమ శాఖలతోపాటు 42 ప్రధాన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దళితబంధుకు భారీ నిధులు కరోనా ప్రభావం కారణంగా రెండేళ్లుగా సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెద్దగా చేయలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, రోజువారీ జనజీవనం సాధారణ స్థితికి రావడంతో సంక్షేమ కార్యక్రమాల అమల్లో వేగం పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఎస్సీ ఎస్డీఎఫ్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులు పెరగడంతో.. పెండింగ్‌లో ఉన్న పథకాలు, ఇతర సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రాయితీ పథకాలకు మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నాయి. -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్‌ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్‌ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన సబ్‌ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్‌ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్‌కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్‌లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
ఎస్సీ,ఎస్టీ నియోజక వర్గాలపై టీ-బీజేపీ ఫోకస్
-
జీవో 5ను యథావిధిగా అమలు చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పించాలని, అందుకోసం జీవో 5ను యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జాక్టో చైర్మన్ సదానంద్‌గౌడ్ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. దేశంలో నేటికీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రత్యక్షంగా చేసే పోరాటాల్లో కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు. -
కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు