ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయింపు రూ.50,180.13 కోట్లు
ఎస్సీఎస్‌డీఎఫ్ కింద రూ.33,124.04 కోట్లు ఎస్టీఎస్‌డీఎఫ్ కింద రూ.17,056.09 కోట్లు
2023–24 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే.. తగ్గుదల రూ.1,803 కోట్లు
దళితబంధుకు చెక్... కొత్తగా అంబేడ్కర్ అభయహస్తం
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా జరిగాయి. రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.50,180.13 కోట్లు కేటాయించింది. గతేడాది చేపట్టిన కేటాయింపులతో పోలిస్తే కాస్త తగ్గి నట్లు కనిపించినప్పటికీ... కార్యక్రమాల వారీగా పరిశీ లిస్తే భారీ కేటాయింపులే జరిగినట్లు కనిపిస్తోంది. ప్రత్యే క అభివృద్ధి నిధి కేటాయింపులు 2023–2024 బడ్జెట్ కంటే రూ.1803 కోట్లు తగ్గాయి.
2024–25 బడ్జెట్‌లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్‌డీఎఫ్) కింద రూ.33124.04 కోట్లు కేటాయించగా... ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్‌డీఎఫ్) కింద రూ. 17056.09 కోట్లు కేటాయించారు. 2023–24లో ఎస్సీఎస్‌డీఎఫ్‌లో దళితబంధు కింద రూ.17700 కోట్లు కేటాయించగా... వాటిలో పైసా ఖర్చు చేయలేదు. తాజాగా దళితబంధు పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం... ఆ స్థానంలో అంబేడ్కర్ అభయ హస్తం పేరిట కొత్త పథకాన్ని తీసుకొ స్తోంది. ఈ పథకం కింద ప్రస్తుత వార్షిక సంవత్సరానికి రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి గరిష్టంగా రూ.12 లక్షలు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు ఖరారు కాలేదు.
గత కేటాయింపుల్లో ఖర్చు 48 శాతమే...
2023–24 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం రూ.51983.09 కోట్లు కేటాయించింది. కానీ ఇందులో ఖర్చు చేసింది రూ.25048కోట్లు మాత్రమే. గతబడ్జెట్‌లో ఎస్సీ నిధి కింద రూ.36750.48 కోట్లు కేటాయించగా... రూ.14649 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఎస్టీ నిధి కింద రూ.15232.61 కోట్లు కేటాయించగా.. రూ.10399 కోట్లు ఖర్చు చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో కేవలం 48 శాతం మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment