‘రాష్ట్రానికి పెద్ద కొడుకులా జగన్‌ పాలన’ | Nandigam Suresh Speech In Amaravati Over YS Jagan Welfare For SC And ST | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రానికి పెద్ద కొడుకులా జగన్‌ పాలన’

Published Thu, Dec 12 2019 12:51 PM | Last Updated on Thu, Dec 12 2019 1:05 PM

Nandigam Suresh Speech In Amaravati Over YS Jagan Welfare For SC And ST - Sakshi

సాక్షి, అమరావతి: అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీ నందిగాం సురేష్‌ అన్నారు. తాడేపల్లిలోని మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర కార్యాలయంలో కె. కనకారావు చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ సురేష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న రోజు ఇదని ఆయన గుర్తు చేశారు. మాల,మాదిగ, రెల్లి మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు.  దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా దిక్సూచి లాంటి పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా బలపడాలని సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకుల వలే కాకుండా..  ఇచ్చిన మాట నిలుపుకునే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని సురేష్‌ గుర్తు చేశారు. అన్ని కులాల వారికి సంక్షేమ ఫలాలు అందించేలా పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

సురేష్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసేలా 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని సీఎం జగన్‌ను ప్రశంసించారు. రాష్ట్రంలో పేదవాడు వుండకూడదనేది సీఎం జగన్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేకూరేలా పాలన అందిస్తున్నామని ఆయన తెలిపారు. సీఎంగా కన్నా రాష్ట్రానికి పెద్ద కొడుకులా జగన్‌ పనిచేస్తున్నారని రమేష్‌ పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ నామినేటెడ్ పోస్టుల్లో, మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పిచారని ఆయన చెప్పారు. దేశంమంతా ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నా రాష్ట్రంలో మాత్రం కేజీ ఉల్లి రూ. 25 లకు అందిస్తున్నారని తెలిపారు. సీఎంగా వైఎస్‌జగన్‌ 25 సంవత్సరాలు రాష్ట్రాకి ముఖ్యమంత్రిగా ఉంటారని ఎంపీ నందిగాం సురేష్‌ జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో  మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన కె. కనకారావు మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఆదర్శవంతమైన, జనరంజకమైన పాలన సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నడుస్తోందని తెలిపారు. నవరత్నాలతో బడుగు బలహీన వర్గాల దశ దిశ మారుతోందని కనకరావు పేర్కొన్నారు. గాంధీ, పూలే,అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. బడుగులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నారని కనకరావు సీఎంను కొనియాడారు. పాదయాత్ర చేసి సీఎం జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కళల్లో ఆనందం నింపారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలా మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని నిరూపించారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ తనపై ఉంచిన బలమైన బాధ్యతను నీరవేరుస్తానని తెలిపారు. ప్రజల గుండెల్లో చీరస్థాయిగా ఉండేలా పనిచేస్తానని కనకరావు చెప్పారు. రాష్ట్రంలోని 40 లక్షల మాదిగల ఆశలు నిరవేర్చేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్‌  ఇచ్చిన భరోసాని కాపాడుకుంటామని కనకరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement