
రాహుల్ గాంధీ హామీ
సివనీ/షాదోల్: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు.
అయినా దేశంలోని టాప్ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్‌యాంకర్ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment