ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా రాహుల్ గాంధీ నిలిచారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమి పుంజుకోవటంలో రాహుల్ గాంధీ శ్రమకు క్రెడిట్ ఇవ్వాలని అన్నారు. రాహుల్ గాంధి మాత్రమే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఉండేందుకు అర్హుడని వ్యాఖ్యానించారు.
‘‘ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచేలా కష్టపడి రాహుల్ గాంధీ.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే ఇద్దరూ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ఖర్గే రాజ్యసభలో పక్షనేతగా పార్టీని ముందుండి నడిపించారు. ఖర్గే లాగా లోక్‌సభలో పార్టీని ముందుండి నడిపించటంలో రాహుల్ గాంధీ సామర్థమైన వ్యక్తి. ఈ అభిప్రాయాన్ని నేను ఏ వేదికపైన అయినా చెప్పగలను.
.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమర్థంగా నడిపించటం కచ్చితంగా మోదీ, అమిత్ షాలకు ఒక సవాల్. వారి పాలన విధానాలు మార్చుకోవడానికి ఇది ఒక పరీక్ష లాంటింది. ప్రభుత్వానికి, పత్రిపక్షానికి రెండింటికి సామరస్యపూర్వకంగా ఉంటుందని ఆశిస్తున్నా. చాలా సమస్యలు ఉన్న భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వానికి మద్దతు నిలుపుకోవటం సాధ్యం కాదు. మోదీ మూడోసారి చేపట్టే ప్రభుత్వం నమ్మకం కోల్పోయేలా ఉండనుంది’’ అని శశిథరూర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment