
పథకాలను సద్వినియోగం చేసుకోండి
కడప కల్చరల్ :
రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఆర్థికాభివృద్ధికి వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ వెంకట సుబ్బయ్య తెలిపారు. కడప నగర అర్చక పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మున్సిపల్ మైదానంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ధ్యాన మండపంలో జిల్లాకు చెందిన అర్చక పురోహితుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ రూపుదిద్దినా సంక్షేమ పథకాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్రాహ్మణ చైతన్య సమితి అధ్యక్షుడు ప్రసాద్‌రావు మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సంక్షేమ పథకాల ద్వారా బ్రాహ్మణులు ఆర్థికాభివృద్ది సా«ధించాలన్నారు. కార్పొరేషన్ కో ఆర్డినేటర్ జనార్దన్‌రావు మాట్లాడుతూ బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి ఏమేమి పథకాలు ఉన్నాయో వివరించారు. బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పిడతల గోపాలకృష్ణశర్మ, మురళీకృష్ణశర్మ, బ్రాహ్మణ ప్రముఖులు డాక్టర్ గోపీనాథ్, జి.శివరావు, బ్రాహ్మణపల్లె చంద్రమౌళిశర్మ, ఈఓ శ్రీధర్, రిటైర్డ్ ఈఓ గురుప్రసాద్ మాట్లాడుతూ పథకాలపై అవగాహన పెంచుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.