పెండింగ్‌ కేసులపై సత్వర విచారణ: సీఎం జగన్‌ | State Level High Power SC ST Vigilance And Monitoring Committee Meeting | Sakshi
Sakshi News home page

బాధితుల పరిహారంపై దృష్టి పెట్టాలి..

Published Thu, Feb 4 2021 2:55 PM | Last Updated on Thu, Feb 4 2021 4:51 PM

State Level High Power SC ST Vigilance And Monitoring Committee Meeting - Sakshi

సాక్షి, తాడేపల్లి: పెండింగ్‌ కేసులపై సత్వరం విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్‌ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ , సీఎస్ ఆదిత్య నాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు గురించి మీడియా సమావేశంలో మంత్రులు వివరించారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..)

బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించాలని తమని సీఎం ఆదేశించారని  విశ్వరూప్‌ వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని.. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కల్పించాలని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ)

రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సమావేశమని, గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదని తెలిపారు. దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్‌ విమర్శించారు.

పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు..
గతంలో పోలిస్తే ఎస్సీ,ఎస్టీ కేసులు తగ్గాయని హోంమంత్రి సుచరిత అన్నారు. విచారణ సమయం గతంలో 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందన్నారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. గతంలో 3.6 శాతం విచారణలు పూర్తయితే ఇప్పుడు 7 శాతానికి పెరిగిందని సుచరిత పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ను మరింత బలోపేతం..
ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.‌ బాధితుల పరిహారంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు. బాధితులకు ఇవ్వాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని, భూమి లేనిచోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని సూచించారని మంత్రి సురేష్‌ వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement