pinipe vishwaroop
-
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
నా కొడుకుని అన్యాయంగా ఇరికించారు..
-
నా కుమారుడి అరెస్ట్ అక్రమం: మాజీ మంత్రి విశ్వరూప్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి పినేపి విశ్వరూప్. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షతో తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి విశ్వరూప్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే నా కుమారుడిని హత్య కేసులో ఇరికించారు. హత్య కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఎఫ్ఐఆర్లో నా కొడుకు పేరు ఎక్కడా లేదు. అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. కోనసీమలో కక్ష రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో నా కుమారుడిని అరెస్టు చేశారు అని చెప్పారు. -
రావాలి జగన్..మళ్లీ కావాలి జగన్..
-
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అత్యధిక పెన్షన్ విధానం
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అత్యధిక పెన్షన్ విధానం (హైయ్యెస్ట్ పెన్షన్ సిస్టమ్) అమలు కానుందని, అందుకు ఆర్టీసీ కార్మికులు అర్హులయ్యారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక పెన్షన్ కోసం పీఎఫ్ ఫండ్ ట్రస్ట్‌కు తెలంగాణతో సహా వేరే రాష్ట్రాల సంస్థలు దరఖాస్తు చేసినా, కేవలం మన ఆర్టీసీకే ఆ అవకాశం వచ్చిందని.. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్మోహన్రెడ్డి చొరవ చూపడమేనని తెలిపారు. 50 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కాగా, వారితో పాటు.. 2014 తర్వాత రిటైర్ అయిన దాదాపు 10,200 మంది ఉద్యోగులు, కార్మికులు అత్యధిక పెన్షన్ విధానంలో ప్రయోజనం పొందుతారని చెప్పారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ‘ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు పెన్షన్ రానుంది. గతంలో వారికి కేవలం రూ. 3 వేల నుంచి రూ. 4 వేల పెన్షన్ మాత్రమే వచ్చేది. అదే ఇవాళ వారికి గౌరవప్రదమైన పెన్షన్ వస్తుందని.. దీంతో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని’ మంత్రి అన్నారు. ప్రభుత్వ వేతనాలు: ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు దాదాపు రూ. 10,570 కోట్ల జీతాలు చెల్లించిందన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ మూలధనాన్ని ముట్టుకోక పోవడం వల్ల.. సంస్థ మనుగడ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వీటితో పాటు రుణాలు కూడా తీరుస్తోందన్నారు. సీఎంజగన్ నిర్ణయం, ఆయన చూపిన చొరవ వల్ల, సంస్థ అప్పుల నుంచి బయట పడడమే కాకుండా, ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. నాలుగేళ్లలో సంస్థ పురోగతి: ‘నాలుగేళ్లలో ఆర్టీసీ ఎంతో పురోగతి సాధించింది. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ అమలు చేస్తున్నాం. ఇంకా జనవరి 1, 2016 నుంచి డిసెంబరు 31, 2019 వరకు దాదాపు 858 మందికి కారుణ్య నియామకాల కింద వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్ఎస్ కార్డు వారికీ ఇచ్చాం. కొత్తగా 1500 డీజిల్ బస్సులు, 1000 విద్యుత్ బస్సులు కొంటున్నాం. ప్రతి ఉద్యోగికి రూ. 40 లక్షల ప్రమాద బీమా, రూ. 5 లక్షల సహజ మరణ బీమా సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటికే 390 కుటుంబాలకు ఆ బీమా ద్వారా లబ్ధి చేకూరిందని’ చెప్పారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మంత్రి విశ్వరూప్
సాక్షి, అమలాపురం టౌన్: ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రిలో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ను ఐసీయూ నుంచి సాధారణ వైద్యానికి స్పెషల్ రూమ్‌కు గురువారం సాయంత్రం మార్చారు. ఈ విషయాన్ని ముంబై నుంచి మంత్రి కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. చదవండి: (AP Govt: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
మంత్రి విశ్వరూప్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, కోనసీమ జిల్లా(అమలాపురం టౌన్): గుండె శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో చేరిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఫోన్‌చేసి పరామర్శించారు. మంత్రి విశ్వరూప్‌కు సోమవారం గుండె శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స విజయవంతం అవుతుందని ఆయనకు సీఎం జగన్ ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీమీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డిలతో కూడా సీఎం మాట్లాడారు. తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, విశ్వరూప్ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుందని అన్నారు. సీఎం జగన్ తమతో మాట్లాడారని మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి అమలాపురం ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. చదవండి: (Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం) -
గుండె శస్త్రచికిత్స కోసం ముంబైకి మంత్రి విశ్వరూప్
అమలాపురం టౌన్: కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురై, హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది, అక్కడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గుండె శస్త్రచికిత్సకు శుక్రవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు సోమవారం గుండె శస్త్రచికిత్స చేస్తారని మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంత్రి విశ్వరూప్ తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ముంబై వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయినట్లు కృష్ణారెడ్డి చెప్పారు. -
నిరసనకారులు తగలబెట్టిన ఇంటిని పరిశీలించిన మంత్రి విశ్వరూప్
సాక్షి, అమలాపురం: నిరసనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారన్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమయ్యింది. నిరసనకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు వచ్చారు. రౌడీషీటర్లే విధ్వంసం సృష్టించారని మంత్రి విశ్వరూప్ అన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర' కాగా, జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి. ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు
సాక్షి అమరావతి: రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు.. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా.. బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు. మంత్రి విశ్వరూప్ రాజకీయ నేపథ్యం.. 1987లో కాంగ్రెస్ నాయకుడిగా పినిపే విశ్వరూప్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్పీసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. -
పినిపె విశ్వరూప్ అనే నేను..
-
నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా? వైఎస్సార్ చేయూత ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. 5 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూతతో లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1070 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దాదాపు లక్ష మంది ఎస్సీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. -
విశ్వరూప్ దంపతులపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను మోసపూరితంగా మార్పు చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఆయన సతీమణి పినిపే బేబీ తదితరులపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చినంత మాత్రాన ఆ ఆస్తిపై యాజమాన్యపు హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మం డలం భట్నవిల్లి గ్రామంలోని 7.75 ఎకరాల భూమిని పినిపే బేబీ పేరిట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఎంతమాత్రం తప్పుకాదని, సబ్ రిజిస్ట్రార్ తన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించారని హైకోర్టు తెలిపింది. అలా రిజిస్టర్ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమంది. ఆ భూమికి సంబంధించిన వివాదం అమలాపురం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యం లో.. సంబంధిత సివిల్ కోర్టు ముందు పిటిషనర్ మౌఖిక, లిఖితపూర్వక ఆధారాలను ఉంచి, ఆ భూమి యాజమాన్య హక్కులను తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమ్మకపు ఒప్పందం మేరకే పినిపే బేబీ పేరిట డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారని, దీనిని ఎంతమాత్రం మోసపూరితమని చెప్పజాలమంది. ఏపీ భూ హక్కులు, పాసు పుస్తకాల చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు తప్పని నిరూపితమయ్యేంత వరకు ఆ పేర్లు సరైనవేనని భావించాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ.. సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ఎస్సీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయించిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక 27వ నోడల్ ఏజెన్సీ సమావేశం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లో మంగళవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు నూరు శాతం వినియోగంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2020–21లో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో 44 శాఖలకు రూ.19,430 కోట్లు కేటాయించగా రూ.13,672 కోట్లు ఖర్చు చేశారన్నారు. కేటాయించిన నిధుల్లో 12 శాఖలు 76 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయగా, 23 శాఖలు 25 నుంచి 51 శాతం ఖర్చు చేశాయని, 9 శాఖలు ఏ విధమైన నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. 2021–22లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 42 శాఖలకు రూ.17,403 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే మూడు నెలల (త్రైమాసిక) సమీక్ష సీఎం అధ్యక్షతన జరుగుతుందని, ఈలోగా నూరు శాతం నిధులు సద్వినియోగం చేయాలని మంత్రి సూచించారు. -
పెండింగ్ కేసులపై సత్వర విచారణ: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పెండింగ్ కేసులపై సత్వరం విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ , సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు గురించి మీడియా సమావేశంలో మంత్రులు వివరించారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించాలని తమని సీఎం ఆదేశించారని విశ్వరూప్ వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని.. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కల్పించాలని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ) రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సమావేశమని, గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదని తెలిపారు. దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్ విమర్శించారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు.. గతంలో పోలిస్తే ఎస్సీ,ఎస్టీ కేసులు తగ్గాయని హోంమంత్రి సుచరిత అన్నారు. విచారణ సమయం గతంలో 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందన్నారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. గతంలో 3.6 శాతం విచారణలు పూర్తయితే ఇప్పుడు 7 శాతానికి పెరిగిందని సుచరిత పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్‌ను మరింత బలోపేతం.. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్‌ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బాధితుల పరిహారంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. బాధితులకు ఇవ్వాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని, భూమి లేనిచోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని సూచించారని మంత్రి సురేష్ వెల్లడించారు. -
'దొడ్డి దారిన పదవి పొందిన దద్దమ్మవి నువ్వు'
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా పాలన చేస్తున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో జిల్లా నుంచి ఎన్నికైన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు మంగళవారం డిప్యూటీ సీఎం ధర్మాన చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, వేణుగోపాల కృష్ణ.. ఎంపీలు వంగా గీతా, గొట్టేటి మాధవి.. ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ కుమార్, ధనలక్ష్మి పాల్గొన్నారు. (దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు) ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏడాదిన్నర పరిపాలనలోనే దేశంలోని సమర్ధవంతమైన ముఖ్యమంత్రుల్లో సీఎం వైఎస్ జగన్ మూడో స్థానాన్ని సంపాదించారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ మొదటి స్థానంలోకి వెళ్తారని ఆశిస్తున్నాము' అని అన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి రూ.10కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దొడ్డి దారిన పదవి అనుభవించిన దద్దమ్మవి నువ్వు జగన్‌ని విమర్శించే నైతిక విలువలు నీకు లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
బహిరంగ వేదికపై ఆయన కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?
-
‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’
-
‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్ విలువ దిగజారిదంటూ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘దళితుల పుట్టుక గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. నాలుక జాగ్రత్త పెట్టుకో’ అని నిప్పులు చెరిగారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) ‘దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు పెద్దపీట వేశారు. దళితుడు వరప్రసాద్ కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ మంత్రి విశ్వరూప్ హితవు పలికారు. (ఆ కేసు దర్యాప్తులో వేగం పెంచండి: డీజీపీ) -
విద్యుత్ చార్జీలు పెంచలేదు: బాలినేని
సాక్షి, ప్రకాశం : .ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. శ్లాబుల ధరలు ఎక్కడ పెంచలేదని, గతంలో ఏదైతే విద్యుత్ చార్జీలు ఉన్నాయే వాటినే ప్రస్తుతం అమలు పరుస్తున్నామని మంత్రి స్పస్టం చేశారు. శుక్రవారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు ఎక్కవ రావడంతో ప్రస్తుతం ప్రజల్లో అపోహలు నెలకొన్నాయన్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగడం వల్ల బిల్లులు పెరిగాయని, దీనిపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు (విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం: బుగ్గన) మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ...మాచవరం మృతుల సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పరమార్శించేందుకు మంత్రులను పంపించి 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచారని తెలిపారు. భాదిత కుటుంబాల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాలు కోరాయని, .దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తిమ్మసముద్రంలో చెరువులో పడ్డ బాలున్ని కాపాడబోయి మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలను కూడా ఆదుకుంటాని మంత్రి పేర్కొన్నారు. (‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’) -
‘ప్రపంచాన్ని జయించే ఒకే ఆయుధం విద్య’
సాక్షి, విజయనగరం: అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు వస్తున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందని విశ్వరూప్పేర్కొన్నారు. (నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..) ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు, పరిపాలనా తీరు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఆయుధం విద్య అని ఆమె అన్నారు. అటవంటి విద్యను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించే విధంగా, విద్యపై ఆసక్తి కలిగేలా విద్య వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్ మార్పులు తీసుకు వస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో విన్నారని.. ఈరోజు ప్రజలకు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అనేక అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తుందన్నారు. (జగనన్న వసతి దీవెన: ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు!) జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లినవారు, అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితులు అధిగమించేలా విశాఖ పరిపాలన రాజధాని రాబోతుందని పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు. గిరిజన మహిళగా నేల మీద కూర్చుని విద్యను అభ్యసించి, ఉపాధ్యాయునిగా ఉన్న తనకు గొప్ప గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అభిమానాన్ని మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. గతంలో చంద్రబబాబును ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన మంది మార్భాలన్ని కాపాపడుకునేందుకు కులం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని శంకర్ నారాయణ అన్నారు. -
‘నందిగం సురేష్‌పై దాడి దుర్మార్గపు చర్య’
సాక్షి, విశాఖపట్నం : ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ట ఎంపీ నందిగం సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. దళిత పార్లమెంట్ సభ్యునికే ఇలా అవమనం జరిగితే, 29 గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనను బాబు ఎలా నడిపిస్తున్నారో అర్ధమవుతుందని తెలిపారు. కాగా గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేశారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది దుర్మార్గపు చర్యగా వ్యాఖ్యానించారు. వివిధ స్కాంలపై ప్రభుత్వం సిట్ వేసినప్పటి నుంచి చంద్రబాబులో అసహనం మరింత పెరిగిపోయిందన్నారు. అరెస్ట్ తప్పదన్న భావనలో చంద్రబాబు అండ్ కో టీం వ్యహరిస్తోందని మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో జరిగిన భాగోతాలన్ని బట్ట బయలు అవుతాయన్న ఆలచోనతో నలుగురు, అయిదుగురు మహిళలను ఉసిగొల్పి నందిగామ సురేష్‌పై దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలపడంతో తీవ్ర అసహనానికి లోనైన చంద్రబాబు దాడులకు పురిగొల్పుతున్నారని అన్నారు. దోషులెవరైన కఠినంగా శిక్షిస్తామని, ఎ వరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటు మంత్రులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి రాష్ట్రమంతా సమగ్ర అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచనతో ఉంటే, చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారయణ మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఘటన పై ఎస్సీ. ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన చెత్త రాజకీయాలతో పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు, అబద్ధపు కథనాలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. నవరత్నాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. -
టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్ సీపీలో చేరిక
సాక్షి, అమలాపురం రూరల్ : అమలాపురం పట్టణంలోని టీడీపీకి చెందిన 25 వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన బండారు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజులు వెఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు కామన కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ మోగిలి పోతురాజు, బండారు ప్రశాంత్ కుమార్ కోసూరి వీరన్న తదితరులు పార్టీలో చేరారు. వీరికి మంత్రి విశ్వరూప్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు దొమ్మేటి రాము, వంటెద్దు వెంకన్న నాయుడు, గొవ్వాల రాజేష్ నాగవరపు వెంకటేశ్వరరావు, మద్దింశెట్టి ప్రసాద్, భరకానిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్తూపం ఆవిష్కరించిన మంత్రి విశ్వరూప్ పట్టణంలో 27 వార్డులో ఏఎంజీ కాలనీలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ స్తూపాన్ని, పార్టీ జెండాను మంత్రి పినిపే విశ్వరూప్ ఆవిష్కరించారు. 27 వార్డు బూత్ కమిటీ కన్వీనర్ బండారు గోవిందు, రంపవలస శ్రీనివాస్‌రావు, పాలెపు చినగంగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ కాలనీలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు అర్థాని నాగయ్య, అర్ధాని ముత్యాలు, బండారు ఏడుకొండలు, హక్కుల సంఘం అధ్యక్షుడు యండమూరి శ్రీను, పి.గణపతి, చప్పిడి సతీష్, ఓలేటి శ్రీను, తాళ్లరాజు, భావిశెట్టి సురేష్, పి.గణపతి తదితరులు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేదు
-
త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, తాడేపల్లి: త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 552 టీచర్ పోస్టులకు గాను 400 మంది అర్హత సాధించారని తెలిపారు. మిగిలిపోయిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 665 హాస్టల్స్ మూసివేసిందని, సీఎం జగన్ వాటిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారని తెలిపారు. ఒకేసారి లక్ష 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ఉత్తీర్ణత సాధించడం కోసం కాపీయింగ్‌ను ప్రోత్సహించవద్దని కోరారు. కష్టపడి స్కూల్స్‌లో నాణ్యమైన విద్యను అందించడని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించండని మంత్రి పినిపె విశ్వరూప్ సూచించారు. (చదవండి: పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష)