
సాక్షి, తాడేపల్లి: త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 552 టీచర్ పోస్టులకు గాను 400 మంది అర్హత సాధించారని తెలిపారు. మిగిలిపోయిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం 665 హాస్టల్స్ మూసివేసిందని, సీఎం జగన్ వాటిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారని తెలిపారు. ఒకేసారి లక్ష 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ఉత్తీర్ణత సాధించడం కోసం కాపీయింగ్‌ను ప్రోత్సహించవద్దని కోరారు. కష్టపడి స్కూల్స్‌లో నాణ్యమైన విద్యను అందించడని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించండని మంత్రి పినిపె విశ్వరూప్ సూచించారు. (చదవండి: పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష)
Comments
Please login to add a commentAdd a comment