DSC Notification
-
ఇదేనా తొలిసంతకం విలువ? కూటమి సర్కార్‌పై ఆగ్రహ జ్వాలలు
కృష్ణా, సాక్షి: అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా మెగా డీఎస్సీ ఊసేత్తడం లేదు కూటమి ప్రభుత్వం. దీంతో.. అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. తాజాగా.. మంగళవారం అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్ధులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ‘‘కూటమి ప్రభుత్వం డీఎస్పీ అభ్యర్ధులను నయవంచన చేస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించాలి. పరీక్షల తేదీతో సహా ప్రకటన చేయాలి ... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న హెచ్చరించారు. మరోవైపు.. డీఎస్సీ అభ్యర్ధులు సైతం కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం తొలి సంతకానికి ఉన్న విలువ ఇదేనా?. ఆరునెలల్లో మెగా డీఎస్పీ పూర్తిచేస్తామన్నారు. కనీసం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చెప్పడం లేదు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అవనిగడ్డ గ్రంధాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ ప్లకార్డులతో నిరనన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. -
వివాదాలు.. వాయిదాలు!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. గతేడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ ‘‘త్వరలో’’ నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఇక గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను జనవరి 5న నిర్వహిస్తామని తొలుత ప్రకటించి పది రోజుల్లోనే ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాటవేతలో అందెవేసిన కూటమి‘గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాం..’ అని శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్‌లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటే అది ఎప్పటికి సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం..గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తై జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి పూర్తికాలం శిక్షణ పొందుతున్నారు. ఇక గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులు మెయిన్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష జరగాల్సి ఉండగా సర్వీస్ కమిషన్‌కు చైర్మన్ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. గత నెలలో చైర్మన్‌గా ఏఆర్ అనురాధ రాకతో అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో జనవరి 5న మెయిన్స్ జరుగుతుందని తేదీని సైతం ప్రకటించారు. తీరా పది రోజులు గడవకుండానే మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ‘త్వరలో’..అంటే ఎప్పుడు?గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డీఎస్సీని కూటమి సర్కారు మెగా డీఎస్సీ ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలివారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక ‘‘త్వరలో’’ నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో.. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని, మంత్రి చెబుతున్న ‘త్వరలో’ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. రెండు, మూడు రోజుల్లో మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 బుధవారం(నేడు) నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, అధికారులు వాయిదా వేస్తునట్లు వెల్లడించారు.గత వైఎస్సార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10247 పోస్టులు కలిపి.. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. -
Telangana: డీఎస్సీ’ మరింత ఆలస్యం?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తామని.. అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా? అనే సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడేనా? రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 2,79,957 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. సోమవారంతో ముగిసిన ఈ పరీక్ష ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. సెపె్టంబర్ మూడో వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్‌లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు, సీఎం ప్రకటన వెలువడటం డీఎస్సీ భవితవ్యంపై సందేహాలకు తావిస్తోంది. ఫలితాల వెల్లడిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉప వర్గీకరణ డేటా సేకరణ, అమలు, దాని ప్రకారం డీఎస్సీలో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితిలో అధికారులున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖకు లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. ఎవరి వాదన వారిదే.. ఇప్పుడు జరిపే నియామకాల్లో వర్గీకరణ చేపట్టాలన్నది మాదిగ వర్గీయుల వాదన. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. అవసరమైతే నిబంధనలు మార్చాలంటున్నారు. ఇదే వాదనతో అధికారులు, ప్రభుత్వ నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మాల సామాజికవర్గం భిన్న స్వరం వినిపిస్తోంది. తీర్పు రాకముందే ఇచ్చిన డీఎస్సీని వర్గీకరణ పేరుతో ఆపడం సరికాదని అభిప్రాయపడుతోంది. అలా చేస్తే న్యాయపోరాటంతోపాటు వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇంకోవైపు పరీక్ష రాసిన విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. రూ. లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నామని ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ ఆపితే ఆందోళన చేస్తాం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పునకు ముందే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడెలా నియామకాలు ఆపుతారు? సీఎం ఒక కులాన్ని భుజానికెత్తుకోవడం మంచిదికాదు. ఇది మా మనోభావాలు దెబ్బతీసే అంశం. డీఎస్సీ నియామక ప్రక్రియ ఆపితే ఆందోళనలు చేస్తాం. ఇప్పటికే కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నాం. – జి. చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అమలు చేయాల్సిందే ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణను అమలు చేస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. డీఎస్సీ నియామకాల్లోనూ ఇది అమలు కావాల్సిందే. అవసరమైతే నిబంధనలు సవరించాలి. గతంలో కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లోనూ కటాఫ్ రిజర్వేషన్ల విధానంలో సవరణలు తెచ్చారు. ఇప్పుడు దీన్ని అనుసరించడంలో తప్పేం లేదు. దీని అమలు కోసం మేం ఎంత దూరమైనా వెళ్తాం. – గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్‌పీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ నేపథ్యంలో డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ విషయంలో లక్షల మంది విద్యార్థుల మానసిక ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి. టీచర్ల బదిలీలు, పదోన్నతుల తర్వాత మరిన్ని టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుత డీఎస్సీపైనే సందేహాలుంటే కొత్త ఉద్యోగాల పరిస్థితి ఏంటనే ఆందోళన నిరుద్యోగుల్లో ఉంది. – రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
AP: హామీ గాలికి.. ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే!
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్‌ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది. టెట్, డీఎస్సీ మధ్య కనీసం 90 రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్ షెడ్యూల్‌ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి కూడా అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది. అయితే నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం టెట్‌ను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించనుంది. టెట్ ఫలితాలను నవంబర్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మరో 8 నెలలపాటు డీఎస్సీ శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు. దీంతో అన్నాళ్లపాటు ఉపాధి లేకుండా ఉండటం ఎలా అనే బెంగ వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలుచుకుని తల్లడిల్లుతున్నారు. ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని.. చివరకు తూచ్తొలుత చంద్రబాబు డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టులో టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సెప్టెంబర్‌లోనే డీఎస్సీ కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు టెట్ (జూలై) పరీక్షలను అక్టోబర్‌కు మార్చారు. ఈ ఫలితాలను నవంబర్‌లో విడుదల చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన మేరకు టెట్‌కు, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఇచ్చినట్టయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్, జూలైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది.సంఘాల పేరుతో కాలయాపనగత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటే టెట్‌ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించగా 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను జూన్ 25న ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ లేకుంటే ఏప్రిల్‌లోనే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డీఎస్సీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల 2న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, టెట్‌కు, డీఎస్సీకి మధ్య కనీసం 90 రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్‌ను మళ్లీ మార్చారు. వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డీఎస్సీ నిర్వహించి, ఈ ఏడాది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి మరో డీఎస్సీలో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను 2025 ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే డీఎస్సీని ప్రకటిస్తే పోస్టులను భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్‌ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎవరూ అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం, ఇచ్చిన తొలి నోటిఫికేషన్‌నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.ఇది ముమ్మాటికీ మోసమే..అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10 వేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే. మెగా డీఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండిచేయి చూపించారు. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉంది. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఆ ఉద్యోగాలు వదులుకుని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే లక్షలాదిమందికి ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో నం.117ను తక్షణమే రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. – రామచంద్ర ఎంబేటి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
మెగా డీఎస్సీపై ఇచ్చిన మాట ఏమైంది?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబద్: తొలి కేబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ప్రశ్నించారు. మేగా డీఎస్సీతో పాటు పలు హామీలు, పాలన తీరుపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు. ‘‘ ముఖ్యమంత్రి గారు... తొలి క్యాబినెట్ లోనే 25 వేలతోమెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?మీరు కొలువుదీరితే సరిపోతుందా ?యువతకు కొలువులు అక్కర్లేదా ??గతంలో మీరు.. ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు.తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు.అధికారంలోకి వచ్చాక... నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు.డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు.వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు.గుర్తుపెట్టుకోండి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధంమళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరుకాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా ?ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా ?ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారా..??ఇప్పటికే మెగా డీఎస్సీ అని.. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారుఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైమ్ ఇవ్వకుండా..వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం ?పరీక్షలు వాయిదా వేయాలని..డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండివైఖరి ??న్యాయమైన డిమాండ్లనుఆడబిడ్డలు అడినంత మాత్రానఅర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా ?ఇదేనా మహిళలంటే..ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం ??అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు..అపాయింట్మెంట్ ఆర్దర్లు ఇస్తామన్నారు..ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడంలేదు ??ప్రచారంలో యువతను మభ్యపెట్టారు.. పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా ??నిరాహారదీక్షలు చేసినా స్పందన లేదుపేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదుపార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి..పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడంకాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటుఇన్నాళ్లూ అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు ? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి ?ఇప్పటికైనా.. డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి..పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలిడీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకుBRS జెండా వారికి అండగా ఉంటుంది..లేకపోతేఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు..నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం..జై తెలంగాణ’’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో నిలదీశారు. ముఖ్యమంత్రి గారు... తొలి క్యాబినెట్ లోనే 25 వేలతోమెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ? తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?మీరు కొలువుదీరితే సరిపోతుందా ?యువతకు కొలువులు అక్కర్లేదా ??గతంలో…— KTR (@KTRBRS) July 9, 2024 -
మళ్లీ టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ – టెట్)కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ మంగళవారం ప్రకటించనునున్నట్టు కమిషనర్ సురే‹Ùకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహిస్తునట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు కావాల్సిన పూర్తి సమాచారం, పరీక్షలు జరిగే తేదీలను త్వరలో https://cse.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటుచేశామన్నారు. ఫిబ్రవరిలో ఒకసారి నిర్వహణ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటు అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరిలో టెట్–2024 నోటిఫికేషన్ ఇచి్చంది. దీంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు మొత్తం 2,67,789 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు సీబీటీ (ఆన్లైన్) విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించగా 2,35,907 మంది (88.90 శాతం) హాజరయ్యారు.అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించలేదు. జూన్ 25న ప్రకటించిన టెట్ ఫలితాల్లో 1,37,903 మంది (58.4 శాతం) మంది అర్హత సాధించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–1ఏ (రెగ్యులర్)లో 75,142 మంది, పేపర్–1బీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో 790 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష అయిన పేపర్–2ఏ(రెగ్యులర్)లో 60,846 మంది, పేపర్–2బీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో 1,125 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో.. మరోసారి టెట్ (జూలై) నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ రద్దు ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచి్చన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. ఒకట్రెండు రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ జారీచేయనున్నారు. అయితే, ఈ కొత్త డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయని, కావాలనే ఈ పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పలు జిల్లాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. -
నేడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్న చంద్రాబాబు
-
డీఎడ్ అర్హులకే ఎస్జీటీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్–2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు. పరీక్షాకేంద్రాలు ఇవీ.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి. వయో పరిమితి మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామక విధానం రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్ వెయిటేజ్ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్ (రిజర్వేషన్ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్–1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్ చేయాలి. -
రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రకటించిన డీఎస్సీ విధివిధానా లకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఈ నెల 4వ తేదీన పూర్తి సమాచారం వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే జరిగింది. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉండనుంది. కానీ పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రీకృత వ్యవస్థతోనే డీఎస్సీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది. వారికి జిల్లా అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని విధివిధానాల్లో పేర్కొననున్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా.. డీఎస్సీ సిలబస్‌పై అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరుగుతుంది. ప్రశ్నపత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్ట పరుస్తున్నారు. అవసరమైన కీలక పాస్వర్డ్స్ అన్నీ రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. దీంతో ఎలాంటి ఫిర్యాదులు లేని వ్యక్తులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. టెట్‌కు 20 శాతం వెయిటేజ్ సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన టెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు తెలిసింది. పరీక్షా సమయం మూడు గంటల పాటు ఉండబోతోంది. మొత్తం 160 ప్రశ్నలతో, 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మే 23 నుంచి పది రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్‌గానే పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ డీఎస్సీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనపు జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా పరిషత్ సీఈవోలు సభ్యులుగా ఉంటారు. వీరు పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాధ్యతలు నిర్వహిస్తారు. దరఖాస్తు స్వీకరణ మొత్తం ఆన్లైన్లో పద్ధతిలోనే ఉంటుంది. -
డీఎస్సీపై దగాకోరు రాతలు
సాక్షి, అమరావతి: ఐదేళ్లు సీఎంగా పనిచేసి కేవలం 300 టీచర్ ఉద్యోగాలిచ్చిన చంద్రబాబును ఇదేమిటని ఎన్నడూ ప్రశ్నించరు ఈనాడు రామోజీరావు. గత ఐదేళ్లలో ఇప్పటికే 15 వేల టీచర్ ఉద్యోగాలిచ్చి పేదల పిల్లలకు చక్కటి చదువులు అందిస్తూ మరో 6,100 మంది ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మాత్రం విషం చిమ్ముతారు అదే రామోజీ. ఎందుకంటే.. రామోజీ, చంద్రబాబు అంటేనే పెత్తందార్ల పెద్దలు. పేదల పిల్లల ఎదుగుదల, అభివృద్ధిని సహించలేరు. అందుకే పేదల చదువులపై ఎప్పుడూ విషం చిమ్ముతుంటారు. అదే క్రమంలో రాష్ట్రంలో తాజా డీఎస్సీపై పక్క రాష్ట్రంతో పోలిక పెట్టి.. మెగా.. దగా.. అంటూ ఓ కుటిల కథనం అచ్చేశారు. అసలు ఈ పోలికే ఓ దగా. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్ పోస్టుల భర్తీ జరగనే లేదు. అలాంటి పోస్టులన్నీ మురగపెట్టి ఇప్పుడు 11వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనినే రామోజీ మెగా డీఎస్సీ అంటున్నారు. కానీ, మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 1998 డీఎస్సీ నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ, మరో 12,00 కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు కలిపి 15 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసింది. తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇవన్నీ కలిపితే సీఎం జగన్ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలు 21,108. అంటే తెలంగాణలో భర్తీ చేస్తున్న పోస్టులకంటే ఏపీలో పోస్టులే అధికం. ఈ విషయం చెప్పకుండా రామోజీ పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ కథనం ఇవ్వడం దగా కాక మరేమిటి? తాజా డీఎస్సీతో అన్ని ఖాళీల భర్తీ తాజాగా 2024 డీఎస్సీలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఆశ్రం), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ విద్యా సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్స్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. ఇకపై ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి కొత్త విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి బోధన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బాబు డీఎస్సీ పెద్ద నాటకం చంద్రబాబు హయాంలో డీఎస్సీ ఓ పెద్ద నాటకం. చంద్రబాబు నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇందులో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు భర్తీ చేసిన పోస్టులు 300 మాత్రమే. కానీ, డీఎస్సీకి చంద్రబాబు పేటెంట్ అన్నట్టు ఈనాడు కలరింగ్ ఇస్తోంది. ఇది సీఎం జగన్ చేసిన మేలు 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఒక్క పాఠశాల కూడా మూత పడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాలలో నూరు శాతం టీచర్లను నియమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాత, కొత్త డీఎస్సీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో దగాపడ్డ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి సుమారు 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారు. అంతకు ముందు 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులు కూడా దశాబ్దాలుగా పోస్టింగ్స్ కోసం ఎదురు చూశారు. చంద్రబాబు వీరినీ పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఇలా చంద్రబాబు దొంగ నాటకానికి బలైపోయిన అభ్యర్థులను సీఎం జగన్ చొరవ తీసుకుని టైం స్కేల్ ప్రాతిపదికన నియమించారు. ఇలా 1998 డీఎస్సీలోని 4,059 మంది, 2008 డీఎస్సీలోని 2,193 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చారు. వీటితో పాటు కేజీబీవీల్లో సుమారు 1,200 మంది రెగ్యులర్ టీచర్లను నియమించారు. నిత్యం శుద్దపూస కబుర్లు చెప్పే రామోజీ.. చంద్రబాబు చేతిలో మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ చేసిన ఈ మేలు గురించి ఒక్క అక్షరం రాయరు. ఇది రామోజీ కుటిలత్వం రామోజీ బోడి గుండుకు.. మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఉపాధ్యాయ ఖాళీలను దాచేస్తున్నారంటూ పాతరాగానికి కొత్త ట్యూన్ కట్టారు. ఇక్కడ పాఠశాలల అభివృద్ధిని కాంక్షిస్తూ రుణం వస్తుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తేనే ఆ పాఠశాల బాగుపడుతుంది. విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు దక్కుతుంది. ఈనాడు చెప్పినట్టు కేవలం రుణం కోసం ఖాళీలను దాచేసి పాఠాలు చెప్పేవారు లేకుండా చేసి విద్యాభివృద్ధిని ఎలా సాధిస్తారు? కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికైనా రామోజీ రాతల్లోని కుటిలత్వం బోధపడుతుంది. తెలంగాణలో ఇవెందుకు లేవు రామోజీ? విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యా రంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏపీలో మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు కళ్లకు కడుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం, టొఫెల్, సీబీఎస్సీఈ సిలబస్, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి సాయం, ద్విభాషా పాఠ్య పుస్తకం, ఐఎఫ్‌పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ బోధనతో పాటు ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ మూరుమూల పల్లెలోని ప్రభుత్వ బడుల్లోకి వస్తున్నాయి. మన పిల్లలను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో లేవు. అక్కడి పేదల పిల్లలకు ఇలాంటి ఫలాలు దక్కట్లేదని ఈనాడు రాయదు. ఇక్కడ రామోజీ లక్ష్యం ఒక్కటే.. అది సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏదో రకంగా వ్యతిరేకత పెంచడం. -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
తెలంగాణ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల
-
TS: డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. గురువారం డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్లో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నోటిఫికేషన్ సందర్బంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరంలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. పోస్టుల వివరాలు.. స్కూల్ అసిస్టెంట్ 2629, లాంగ్వేజ్ పండిట్ 727, ఎస్జీటీ 6508, పీఈటీ 182. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య. pic.twitter.com/4jcijEsmpq — Telangana CMO (@TelanganaCMO) February 29, 2024 -
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. -
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. కొత్తది రేపే!
సాక్షి, హైదరాబాద్: గతంలో జారీ చేసిన తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. కొత్త నోటిపికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ పేర్కొంది. 11 వేల 62 కొత్త పోస్టులతో రేపు డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో రెండు రోజులు ఆలస్యమయ్యింది. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. -
11 వేల పోస్టులతో డీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీఎస్సీ ద్వారా మొత్తం 11 వేల టీచర్ పోస్టుల భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండ్రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు.. టీచర్ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డీఎస్సీలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్‌ను పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని, వెనువెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్... గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డీఎస్సీని రద్దు చేయాల్సి వచ్చింది. అదీగాక.. డీఎస్సీలో ప్రకటించిన 5,089 పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీల్లేని పరిస్థితి తలెత్తింది. నాన్–లోకల్ జిల్లా కోటాలో డీఎస్సీకి వెళ్లేందుకూ పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది. లోపాల్లేకుండా చూడాలి.. నిరుద్యోగుల్లో డీఎస్సీ నిర్వహణ ఆనందం నింపు తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాల్లే కుండా చూడాలి. వీలైనంత త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి.. ఖాళీలను భర్తీ చేయాలి. – రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఖాళీలు ఎన్ని?.. భర్తీ చేసేవి ఎన్ని? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కలి్పంచడం ద్వారా 1,974 హెచ్ఎం పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2,043 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకూ ఖాళీలు ఉండగా వాటిలో 70 శాతం ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి. కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డీఎస్సీ పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయుల పోస్టుల్లో 6,775 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. పండిట్, పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తంగా 11 వేలకుపైగా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. -
డీఎస్సీ వచ్చేసింది
సాక్షి, అమరావతి: బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ అర్హతలు, భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు 11,12లతో పాటు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తూ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వెనువెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. 2022 తర్వాత బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పని చేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంతో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు. 2018 నిబంధనలే అమలు డీఎస్సీ 2024లో ఎలాంటి కొత్త నిబంధనలు లేవని, 2018 డీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న విధివిధానాలు, అర్హతలనే ఖరారు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 44 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయోపరిమితి విధించారు. డీఎస్సీ ఎంపికలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌కు 80 శాతం, ఏపీ టెట్/సీటెట్కు 20 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుందన్నారు. ఆన్లైన్లో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కు రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చని, ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు. మార్చి 15 నుంచి 30వతేదీ వరకు రెండు సెషన్స్‌లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే తేదీలను మినహాయించి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. డీఎస్సీ 2024కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ, సందేహాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. అర్హతలు, నియామకాలపై జీవోలు డీఎస్సీ 2024 విద్యార్హతలు, నియామకాలకు సంబంధించి వేర్వేరుగా జీఓలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జీవో నం.11లో ఉపాధ్యాయ నియామక వివరాలు, జీవో నం.12లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరిచామన్నారు. మార్చి 5వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 వేల మంది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్షలు రాసేందుకు వీలుగా సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందిన దరఖాస్తుల ఆధారంగా మిగతా కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామని వెల్లడించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ (9505619127, 9705655349) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని, అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాలల మౌలిక సదుపాయాల విభాగం కమిషనర్ కె.భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిత, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
AP: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
AP: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే!
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నేటి(ఫిబ్రవరి 12) నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు, ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ.. ఏప్రిల్ ఏడున డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. cse.apgov.in వెబ్సైట్లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. రిజర్వ్ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు. చదవండి: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు -
ఏపీలో నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
కొలువుల జాతర.. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
-
మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు
-
AP DSC Notification: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
ఏపీలో కొలువుల జాతర..నిరుద్యోగులు సంబరాలు
-
నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. పండుగ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఎయిర్‌పోర్టులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలిచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలుచేశారని ఆయన గుర్తుచేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలుచేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఏపీ అభివృద్ధి బాటపడితే.. ఇప్పుడాయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం ఏపీలో జరిగిందన్నారు. మూడు నెలల క్రితమే వివరాల సేకరణ మరోవైపు.. అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. డీఎస్సీ ప్రకటన హర్షణీయం.. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందన్నారు. -
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
విశాఖపట్నం, సాక్షి: పండుగ పూట నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్తో మెగా డీఎస్సీ పోస్టుల గురించి చర్చించడం జరిగిందని.. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారాయన. -
తెలంగాణ డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల
-
తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5089 టీచర్ల పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టో బర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం ఈ నెల 20 నుంచి అధికారిక వెబ్సైట్ (https://schooledu.telangana.gov.in/ISMS/)లో అందుబాటులో ఉంచనున్నారు. -
మెగా డీఎస్సీని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సరికాదన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఈడీ, టీఆర్టీ అభ్యర్థులు భారీగా ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులు... మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విద్యా శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ నుంచి కొంతమంది, అబిడ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏకకాలంలో దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నా రు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో వాగ్వాదం, తోపు లాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
TS: DSC నోటిఫికేషన్ విడుదలపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. మంత్రి సబిత బషీర్‌బాగ్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్యకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 5089 ఉపాధ్యాయ, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో నోటిఫికేషన్, విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే.. -
AP: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’
సాక్షి, అమరావతి: ఆగస్ట్‌లో మెగా డీఎస్సీ విడుదలతో పాటు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మంత్రి బొత్సను కలిసి నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రమిచ్చారు. ఈ సందర్బంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇటీవల జరిగిన ప్రాథమిక పరీక్షలో తప్పుదొర్లిన ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కేటాయించాలని కోరారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీసు విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జనరల్ కేటగిరీల్లో వయోపరిమితిని ఏపీపీఎస్సీ, డీఎస్సీ అభ్యర్థులకు 47 ఏళ్లకు, కానిస్టేబుల్‌కు 27 ఏళ్లకు, ఎస్ఐ అభ్యర్థులకు 30 ఏళ్లకు, ఫైర్, జైలు వార్డెన్స్ అభ్యర్థులకు 32 ఏళ్లకు పెంచాలని కోరారు. హోంగార్డులకు జనరల్ అభ్యర్థులతో కాకుండా ప్రత్యేకంగా రాత పరీక్ష పెట్టాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది కూడా చదవండి: వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం -
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ పొలిటికల్ వార్‌కు దిగుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. 2020లో అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటన చేసినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని మండిప డ్డారు. రూ.లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల్లేక వయోపరి మితి దాటిపోతూ లక్షలాదిమంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయో చెప్పాలని నిలదీశారు. అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ఆరు నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఓసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథాచేశారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు -
ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించాం. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ‘‘విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసీ. అమరావతి రాజధాని అయితే, చంద్రబాబు కాపురం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు. కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?’’ అని మంత్రి ప్రశ్నించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. విద్యార్థులకు రాగి జావ నిలిపేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పరీక్షలు, ఒంటిపూట బడుల వల్లే చిక్కీలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
డీఎస్సీపై త్వరలో ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటనపై త్వరలో స్పష్టత వస్తుందని, ఇందుకు సంబంధించి జూలై–ఆగస్ట్‌లో కార్యాచరణ చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆయన తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
టీచర్ కొలువుకు సిద్ధమా.. ఇదిగో ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రంగం సిద్ధమవుతోందా..? 16,000కుపైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుందా...?! ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా డీఎస్సీకి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్... తొలుత టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్ రెండుసార్లు నిర్వహించిన తర్వాత మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వీరంతా డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే.. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. చివరిసారి నిర్వహించిన టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా.. 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు మించే అవకాశం ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యాలకు పరీక్ష టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో.. ఆంగ్లంలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీకి ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) సిలబస్ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లోని అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరిగే ఆస్కారముంది. టెట్ కమ్ టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్, ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) నిర్వహిస్తారు. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుల భర్తీకి టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది. చదవండి: (మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్) మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్ విద్యార్హతలు ► ఎస్జీటీ: ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) /డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) (లేదా) కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉండాలి. ►స్కూల్ అసిస్టెంట్: ఆయా సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ఎస్ఏ–లాంగ్వేజెస్, ఎల్పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి అకడమిక్, టీచింగ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి. ►వయసు: 18–44 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ►గమనిక: సిలబస్, పరీక్షా విధానాలు, అర్హతలు, వయసుకు సంబంధించిన సమాచారం గత నోటిఫికేషన్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. మార్కుల వెయిటేజీ ►స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ–80 మార్కులు; ఏపీ టెట్–20 మార్కులు). ►స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ–50 మార్కులు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్–30 మార్కులు, ఏపీ టెట్–20 మార్కులు). ►మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ–70 మార్కులు, స్కిల్ టెస్ట్–30 మార్కులు). ► ప్రిన్సిపల్,పీజీటీ,క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ). ►ఎస్జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్ కమ్ టీఆర్టీ). స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ తదితర) (టీఆర్టీ) సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు 1. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 10 2. విద్యా దృక్పథాలు 10 5 3. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర తరగతి గది అన్వయం 10 5 4. సంబంధిత సబ్జెక్టు కంటెంట్ 80 40 మెథడాలజీ 40 20 మొత్తం 160 80 ► పరీక్షకు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ప్రిపరేషన్–గైడెన్స్ ఎస్జీటీ జీకే, కరెంట్ అఫైర్స్ ఎస్జీటీ అభ్యర్థులు తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్టుల వారీ ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి. స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక పేర్లు, నదీతీర నగరాలు, దేశాలు–రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన కరెంట్ అఫైర్స్‌ను చదవాలి. ప్రిపరేషన్‌కు వార్తా పత్రికలను ఉపయోగించుకోవాలి. కొవిడ్–19 వివరాలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిల్లో దాని ప్రభావం గురించి తెలుసుకోవాలి. విద్యా దృక్పథాలు దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు–హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం(ఎన్సీఎఫ్–2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం ► శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన –స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ► ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచు కోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. కంటెంట్ ► తెలుగు (ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతో పాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి. ► గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది. ► సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ► ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి. ► సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు. మెథడాలజీ ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధ నోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. సొంత నోట్స్ రాసుకుంటే.. పరీక్ష సమయంలో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ ► స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు.. ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమె టిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి. ► బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం–ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ► సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్రోద్యమం, ప్రపంచ యుద్ధాలు–అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలను చదవాలి. మెథడాలజీ ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోప కరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్‌స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించింది. కాని బయాలజీలో మాత్రం అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చాయి. మాక్‌టెస్ట్‌లు కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు –స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. మ్యాథమె టిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది. -
2018 డీఎస్సీ నియామకాలు తరువాతే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల నియామకానికి సంబంధించి 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... ► 2018 డీఎస్సీ విషయంలో న్యాయ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త టెట్, డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేదు. కరోనా, లాక్డౌన్ వంటి ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ► 2018 డీఎస్సీ వివాదాలు పూర్తిగా సమసిపోయి, నియామకాలు పూర్తయ్యాకే కొత్త టెట్, డీఎస్సీలపై నిర్ణయం. ► న్యాయ వివాదాలపై ప్రభుత్వ వాదనలను సమర్థంగా వినిపించి, అర్హత సాధించిన అభ్యర్ధులకు న్యాయం చేస్తాం. ఎస్జీటీ, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీఈటీల పోస్టులపై కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. ► హిందీ, తెలుగు పండిట్ పోస్టుల వ్యాజ్యాలు క్లియర్ అయ్యాయి. వీటికి ఈ నెలాఖరుకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నాం. ► టెన్త్ పరీక్షల షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం అవాస్తవం. వాటిని ఎవరూ నమ్మొద్దు. ► లాక్డౌన్ పూర్తిగా ముగిసిన రెండు వారాల తర్వాత టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేస్తుంది. -
త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, తాడేపల్లి: త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 552 టీచర్ పోస్టులకు గాను 400 మంది అర్హత సాధించారని తెలిపారు. మిగిలిపోయిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 665 హాస్టల్స్ మూసివేసిందని, సీఎం జగన్ వాటిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారని తెలిపారు. ఒకేసారి లక్ష 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ఉత్తీర్ణత సాధించడం కోసం కాపీయింగ్‌ను ప్రోత్సహించవద్దని కోరారు. కష్టపడి స్కూల్స్‌లో నాణ్యమైన విద్యను అందించడని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించండని మంత్రి పినిపె విశ్వరూప్ సూచించారు. (చదవండి: పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష) -
ఎట్టకేలకు ఆ డీఎస్సీకి మోక్షం!
విజయనగరం అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి డీఎస్సీ–2018కు ఎట్టకేలకు మోక్షం లభిం చింది. ఏటా డీఎస్సీ చేపడతామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క నియామకం చేపట్టకుండా గతేడాది కంటితుడుపుగా కేవలం 377 పోస్టులను జిల్లాకు కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల ముందే వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నా దానిని పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెలరోజుల్లోనే వీటి నియామకాలపై దృష్టి పెట్టి హామీ నిలబెట్టుకుంటున్నారు. జిల్లాలో వచ్చే 17 నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభం ఎన్నికల ముందు నిర్వహించి విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల మెరిట్ జాబితాను ప్రామాణికంగా తీసుకొని పోస్టుల భర్తీకి నూతన ప్రభుత్వం అనుమతించింది. దీనిపై విద్యాశాఖ డీఎస్సీ ఎంపిక ప్రాథమిక షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ క్రమంలో తొలుత జోన్ పరిధిలో ఉన్న మోడల్ స్కూల్, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలల్లో వివిధ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా పరిధిలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 623కు పైగా ఉపాధ్యాయ పోస్టులుండగా నాలుగేళ్లలో పలుమార్లు కుదించిన తరువాత చివరికి 377 పోస్టులకు ఖాయం చేశారు. జిల్లా పరిధిలోని ఈ పోస్టులకు జూలై 17 నుంచి నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలిరోజున అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను 20, 21 తేదీల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అగస్టు 1న తుది జాబితా ప్రకటన వెలువడుతుంది. అదే నెల 2, 3న వెబ్ ఆప్షన్లు, 5న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. ఆ తరువాత సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఆగస్టు 2 నుంచి నిర్వహించి సెప్టెంబర్ 4న పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. జిల్లాలో భర్తీ కానున్న పోస్టులు 377 జిల్లాలోని వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో వివిధ కేటగిరీకి చెందిన 377 పోస్టులున్నాయి. వాటిలో సెకెండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు–186, స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు–98, భాషా పండిత టీచర్ పోస్టులు–58, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు–23, క్రాఫ్ట్–5, సంగీతం–5, ఆర్ట్–1 ఉన్నాయి. వివిధ కేటగిరీకి చెందిన 81 పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా వేశారు. కోర్టులో కేసులున్న నేపథ్యంలో తెలుగు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీకి చెందిన 58 పోస్టులు, పీఈటీ పోస్టులు 23 నియామకాలు ప్రస్తుతం చేపట్టడంలేదు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది హవాకు చెక్ ఆన్లైన్ విధానం వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ సిబ్బంది హవాకు చెక్ పడినట్టయింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో నూతన ఒరవడిని తీసుకొచ్చారు. ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. అయితే అభ్యర్థులు దరఖాస్తులతో పెట్టుకున్న విద్యార్హత, తదితర ధ్రువపత్రాలకు సరిపోవాలి. గతంలోనూ ఇదే ప్రక్రియ ఉండేది. ఎలాంటి తేడా వచ్చినా సరిచేయడానికిగాని, తిరిగి జతచేయడానికిగాని అవకాశం ఇచ్చే అధికారం జిల్లా స్థాయి విద్యాధికారులకు ఉండేది. ప్రస్తుతం ఆ విధానానికి చెక్ చెప్పారు. తొలి దరఖాస్తుతో జత చేసిన ధ్రువపత్రాలకు ప్రస్తుత ఒరిజినల్ పత్రాల్లో ఎలాంటి తేడా ఉన్నా రిజక్ట్ చేస్తారు. వాటిని సవరించాలంటే రాష్ట్రస్థాయి అధికారిని వేడుకోవడంగాని, కోర్టులను ఆశ్రయించడంగాని చేయాల్సిందే. ఇలాంటి సవరణ అంశాలలోనే జిల్లా విద్యాశాఖలో కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. కొన్ని సందర్భాల్లో రోస్టర్ విధానాన్ని తప్పుతోవ పట్టించి ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం జరిగిన సంఘటనలు గతంలో కొన్ని ఉన్నాయి. వారిలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రంచిన వారు ఉన్నారు. ప్రస్తుత విధానంలో అవకాశం లేకపోవడంతో స్థానికంగా జిల్లా విద్యాశాఖ పరిధిలోని పరిశీలన సిబ్బంది హవాకు చెక్ పెట్టినట్లయింది. మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల పోస్టులు: ఈ సారి ఉపాధ్యాయుల నియామక పరీక్ష(టీఆర్టీ)లో డీఎస్సీతో పాటు జోన్ పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల బోధన సిబ్బందికి పోటీ పరీక్ష కూడా తొలిసారిగా విద్యాశాఖ నిర్వహిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పరిధిలోని జోన్–1లో ఏపీమోడల్ స్కూళ్లలోని ఖాళీగా ఉన్న 214 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో టీజీటీలు 108, పీజీటీలు 106 ఉండగా రాష్ట్ర పరిధిలోని ప్రిన్సిపాల్ పోస్టులు 77 ఉన్నాయి. ఏపీగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 175 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో టీజీటీలు 93, పీజీటీలు 60, పీటీటీలు 22 ఉన్నాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 91 పోస్టులను భర్తీ చేస్తుండగా వాటిలో టీజీటీలు 38, పీజీటీలు 34, పీఈటీలు 9, క్రాఫ్ట్ 3, ఆర్ట్ 4, మ్యూజిక్ 3 పోస్టులు ఉన్నాయని డీఈఓ జి.నాగమణి తెలిపారు. -
డీఎస్సీకి కొత్త చిక్కులు
తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన ఈయన పేరు గొట్టాపు సతీష్. ఈయన సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్ పోస్టులు రెండింటికీ అర్హత కలిగి ఉంటంతోరెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికి జిల్లా కేంద్రాన్ని వెబ్ ఆప్షన్స్గాపెట్టారు. అయితే ఉదయం పూట జరిగే సోషల్ పోస్టుకు శ్రీకాకుళం, అదే రోజు మధ్యాహ్నం పూట జరిగే ఇంగ్లిష్ పోస్టుకు విజయనగరం పరీక్ష కేంద్రాన్ని ఎలాట్ చేశారు. ఇప్పుడు రెండు పరీక్షలు ఎలా రాయాలో తెలీయక ఒక పరీక్ష మాత్రమే రాయగలుగుతాననీ, రెండో అవకాశం కోల్పోతున్నాననీ, రెండూ ఒకే పట్టణంలో రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నిరుద్యోగులకు డీఎస్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్న సమయంలో వచ్చిన సమస్యలు ఇప్పుడిప్పుడే ముగిశాయి. తాజాగా పరీక్ష కేంద్రాలకు ఎంపిక ఆప్షన్ కష్టాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఎస్జీటీ అభ్యర్థుల ఈ–ఎంపిక వెబ్ సైట్ ఆప్షన్ ద్వారా సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల పోర్టల్ సోమవారం ప్రారంభం అవ్వాలి. అయి తే సోమవారం సాయంత్రం వరకు ఎస్జీటీల ఆప్షన్ కాలమ్ తెరచుకోలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల పరీక్ష కేంద్రాల వెబ్ ఆప్షన్ ప్రక్రియలో విభిన్న సమస్యలను అభ్యర్థులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆప్షన్ పరిధి రాష్ట్రస్థాయిలో ఉండడం వల్ల కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని దక్కించుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న శిక్షణా కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇక్కడి పరీక్ష కేంద్రాలనే ఎంచుకోవడంతో ఆలస్యంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారికి పక్క జిల్లాల కేంద్రాలనుకేటాయిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పరీక్ష కేంద్రాలకు ఎదురైన ఈ సమస్య తెలుసుకున్న ఎస్జీటీ అభ్యర్థులు తొలిరోజే ఆప్షన్స్ పెట్టుకోవాలని తొందరపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. వెబ్ ఆప్షన్ పోర్టల్‌లో కనిపించకపోవడం చూసి ప్రభుత్వ కాల్ సెంటర్ 1100కి కాల్ చేసారు. ఈ నెల 16 నుంచి వెబ్ ఆప్షన్ ఓపెన్ అవుతాయని ఓరల్‌గా సమాధానం వచ్చింది. కానీ ఇదే సమాచారాన్ని అధికారికంగా వెబ్సైట్లో పెట్టి తెలియజేయజేస్తారని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17నుంచి హాల్ టిక్కెట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే కాల్ సెంటర్ నుంచి వచ్చిన సమాధానం దీనికి విభిన్నంగా ఉండడంతె అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. పోర్టల్‌లో కనిపించని పరీక్షల పొడిగింపు తేదీలు డీఎస్సీ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను పొడిగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ తేదీలను డీఎస్సీ పోర్టల్‌లో ఇప్పటికీ పెట్టలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ గుర్తింపు కార్డులు పాత తేదీలతోనే విడుదలయ్యాయి. అసలు పరీక్షల తేదీలు పొడింగించారో లేదోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్ధులు కంగారు పడుతున్నారు. ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో రెండు పరీక్షలు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ వల్ల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ ఏ జిల్లానైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ కేటగిరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వేర్వేరుగా పరీక్ష రాయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పోస్టులకు పరీక్ష ఉంటుంది. అయితే ఆ రెండు పరీక్షలు రాసే అభ్యర్థికి పరీక్ష కేంద్రాలు అందుబాటులో కేటాయించకపోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పరీక్షకు పక్కజిల్లాలో, మధ్యాహ్నం పూట జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను కేటాయించడంవల్ల అనేక మంది ఒక్క పరీక్షకే పరిమితం కావాల్సి ఉంటుంది. -
ఉద్యోగాలిస్తానని మోసం చేస్తావా?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘జాబు కావాలంటే బాబు రావాల’ని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే భిక్షమేసినట్లు ఏడు వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మోసం చేశారని, వారికి వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం వారు వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతకుముందు నగరంలోని శకుంతల కల్యాణ మండపం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. డీఎస్సీ పోస్టులను పెంచాలని, సిలబస్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, గంటాకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మద్దతు ప్రకటించి.. వారితో పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఏడు వేల పోస్టులను నోటిఫికేషన్లో చూపించి అందులోనూ వెయ్యి పోస్టులను కుదించడం అన్యాయమన్నారు. ఏటా డీఎస్సీని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం..నాలుగున్నరేళ్లుగా మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. ప్రస్తుత డీఎస్సీలో కొన్ని విభాగాల్లో పోస్టులే లేవని, అలాంటప్పుడు ఏళ్లుగా వాటి కోసమే చదువుతున్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక అభ్యర్థితో రెండు పరీక్షలకు డబ్బు కట్టించుకున్న ప్రభుత్వం..పరీక్ష మాత్రం ఒక్కదానినే రాయాలని పేర్కొనడం దారుణమన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మోసం చేసిన ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థులు బుద్ధి చెప్పాలని బీవై రామయ్య పిలుపునిచ్చారు. 22 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యి.. ప్రతి పోస్టు భర్తీకి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ కోసం ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే ఏడు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. ఇది కూడా ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. నిరుద్యోగ భృతి కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి డీఎస్సీ పోస్టులను పెంచాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఆసిఫ్, కృష్ణకాంత్‌రెడ్డి, రవిబాబు, జగన్నాథరెడ్డి, వై.రాజశేఖరరెడ్డి, ధనుంజయాచారి, భాస్కరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అయోమయంలో డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్సీ అభ్యర్థుల్లో అలజడి..రోజురోజుకు మారుతున్న షెడ్యూల్‌తో అనుమానాలు...మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు వాయిదాల పర్వం సాగిస్తున్న నేపథ్యంలో అసలు డీఎస్సీ నిర్వహిస్తారా...లేక ఏదైనా సాకు చూపి ఎత్తేస్తారా అనేసందేహాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సాక్షి కడప: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి నేటి వరకు పరీక్ష విధానంపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పరీక్ష విధానం ఆన్లైన్లో ఉంటుందా...ఆఫ్‌లైన్‌లో ఉంటుందా...అనేది ప్రభుత్వం నిర్ధారించలేదు. ఆన్లైన్లోనే ఉంటుందని ముందు ప్రకటించారు. ఈ విధానం వల్ల అభ్యర్థులకు సంబంధించి పేపర్ కొందరికి సులువుగా వస్తే, మరికొందరికి కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో అయితే అందరికీ ఒకే విధానంలో పరీక్ష ఉంటుంది. కష్టమైనా, సులువైనా ఒకేలా పేపర్ ఉండడం సబబని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ విధానం ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు దీనివల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని...అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.దీంతో ప్రభుత్వం సందిగ్దంలో పడింది. అయితే పరీక్షల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షా విధానాన్ని కూడా వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. పరీక్ష షెడ్యూల్లో మార్పులు: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి భారీగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 198 పోస్టులకుగాను 30,246 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ప్రకటన విడుదల అనంతరం పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. డిసెంబరు 6వ తేదీ నుంచి 2019 జనవరి 2వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. సమయం చాలదని....గడువు పెంచాలని అభ్యర్థల నుంచి వచ్చిన నేపథ్యంలో షెడ్యూల్‌ను వాయిదా వేసి బుధవారం మళ్లీ ప్రకటించారు. అయితే షెడ్యూల్లో మార్పులు, చేర్పుల నేపథ్యంలో డిసెంబరు 19వ తేదీ నుంచి పరీక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 6వ తేదీలోగా పరీక్షల ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల్లో అలజడి వెంటాడుతోంది. మొదట్లో దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపడంలో సర్వర్ సమస్యలు వెంటాడాయి. తర్వాత పరీక్షల ప్రిపరేషన్‌కు గడువు తక్కువ ఉండడంతో ఆందోళనకు గురయ్యారు.. భారీగా దరఖాస్తులు: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రాలేదని పలువురు పేర్కొంటున్నారు. కేవలం 198 పోస్టులకుగాను 30 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయంటే ఉపాధ్యాయ పోస్టులకు ఏ మేరకు పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం రోజుకో ప్రకటన జారీ చేస్తుండడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. -
నిరుద్యోగులతో బాబు తొండాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న 6 లక్షల మంది నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువునా వంచించారు. 23,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, తీరా ఎన్నికల ముందు కేవలం 7,902 పోస్టుల భర్తీకి డీఎస్సీ–2018 నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ ఒప్పుకోవడం లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తూ రూ.లక్షలు ఖర్చు చేసి, ఇన్నాళ్లూ కోచింగ్ తీసుకున్నామని, ఇప్పుడు కేవలం 7,902 పోస్టులనే భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి తమ నోట్లో మట్టి కొట్టారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 88,914 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని వారు గుర్తుచేస్తున్నారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా నిరుద్యోగులకు భవిష్యత్తును దృష్టి పెట్టుకుని దృఢమైన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిరుద్యోగులకు వైఎస్సార్ అభయం 2004 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులను మభ్యపెడుతూ 2003 నవంబరు 13న 16,449 పోస్టులతో డీఎస్సీని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీ–2003 ప్రక్రియను సకాలంలో పూర్తి చేశారు. ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇప్పించారు. అనంతరం 2006లో మరో డీఎస్సీని ప్రకటించారు. 20,193 పోస్టులతో 2006 మే 30న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక ప్రక్రియను దిగ్విజయంగా పూర్తిచేశారు. అది ముగిసిన వెంటనే 2008లో మెగా డీఎస్సీకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక శాఖ 30,000 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అప్పటికే సక్సెస్ స్కూళ్లను, ప్రత్యేక స్కూళ్లను ప్రారంభించినందున, అదనంగా టీచర్ పోస్టులు అవసరమని, మరిన్ని పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులకు సూచించారు. అయితే, బడ్జెట్ పరిమితుల దృష్ట్యా 30,000 పోస్టులనే భర్తీ చేయగలమని, అదనపు పోస్టులకు అనుమతులు కష్టమని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. నిధుల సంగతి తాను చూసుకుంటానని, నిరుద్యోగులకు మేలు కలిగేలా 50,000కు తగ్గకుండా టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి తేల్చిచెప్పారు. 2008 డిసెంబర్ 6న 52,272 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. డీఎస్సీలో ఎంపికై, పోస్టులు ఖాళీ లేక నియామకం కాని వారికి హామీ పత్రాలు జారీ చేశారు. అనంతరం రిటైరైన వారి పోస్టులతోపాటు కొత్త పోస్టులను మంజూరు చేయించి మరీ వారిని టీచర్ కొలువుల్లో నియమించారు. ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులు లబ్ధి పొందారు. గరిష్ట వయో పరిమితి అంతకు ముందు వరకు 33 ఏళ్లు మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రిగా వైఎస్సార్ దాన్ని ఓసీలకు 39 ఏళ్లకు, బీసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీలకు 44 ఏళ్లకు, దివ్యాంగులకు 49 ఏళ్లకు పెంచారు. పైగా వయోపరిమితి దాటిపోతున్న వారు ఈ డీఎస్సీలో హామీ పత్రాలు పొందడం ద్వారా తరువాతి కాలంలో నిర్ణీత వయసుతో సంబంధం లేకుండానే ఉపాధ్యాయ పోస్టుల్లో నియమితులయ్యారు. ఆర్థిక శాఖపై చంద్రబాబు ఒత్తిడి తాము అధికారంలోకి వస్తే ప్రతిఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక నాలుగున్నరేళ్లుగా ఆ మాటే మర్చిపోయారు. చివరకు ఎన్నికల ముందు కేవలం 7,902 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో 22,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతేడాది స్వయంగా ప్రకటించారు. కానీ, కేవలం 12,370 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. తరువాత 14,300 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కానీ, భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టుల సంఖ్యను టీడీపీ ప్రభుత్వం అనూహ్యంగా 10,351కి కుదించింది. ఆ మేరకే ఆర్థిక శాఖ అనుమతులున్నాయని మంత్రి గంటా చెప్పారు. రెండోసారి డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్థిక శాఖ కొత్త కొర్రీలు వేసింది. పోస్టుల సంఖ్యను 7,729కి కుదించింది. గతంలో ప్రత్యేక డీఎస్సీలో మిగిలిపోయిన 173 ఉర్దూ పోస్టులను కూడా కలిపి మొత్తం 7,902 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. బాబు పాలనలో అంతేమరి ఆర్థిక శాఖ కాదన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి మెగా డీఎస్సీ సహా తన హయాంలో 88,914కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు అందులో మూడోవంతు పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 2014లో ప్రకటించిన డీఎస్సీకి అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అప్పట్లో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో నోటిఫికేషన్ నిలిచిపోగా 2014లో వెలువరించారు. ఆ డీఎస్సీని వేయడం ఇష్టంలేని చంద్రబాబు మూడేళ్లపాటు నాన్చి 2016 చివర్లో గానీ పూర్తి చేయించలేదని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. విద్యావాలంటీర్ల సృష్టికర్త చంద్రబాబే విద్యారంగంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించకుండా విద్యా వాలంటీర్లను నియమించి ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుదే. అప్పటివరకు లేని ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి నిరుద్యోగులను దగా చేశారు. 2002లో 8,954 మంది విద్యావాలంటీర్లను నియమించారు. వారికి అత్యల్పంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు మాత్రమే వేతనం ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. నేడు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి అవనిగడ్డ: డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సోమవారం ముట్టడించనున్నట్లు డీఎస్సీ జేఏసీ నేతలు సీహెచ్ రాంబాబు, గోవింద్, గౌరినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 7,902 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. పోస్టుల సంఖ్య పెంచాలని ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తే కనీసం సమాధానం చెప్పకుండా పోలీసులతో బలవంతంగా పలు పోలీసుస్టేషన్లకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్ పెంచి, తక్కువ సమయం ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని, మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
పోస్టులు పెంచమంటే కొట్టిస్తారా?
గుంటూరు, అవనిగడ్డ : ‘గతంలో 23 వేలు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం.. అయినా పాలకుల్లో స్పందన లేదు. పోస్టులు పెంచమని బుధవారం సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి స్పందించకపోగా, పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారా..’ అని డీఎస్సీ అభ్యర్థులు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. 2016లో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2017లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో 23 వేల పోస్టులు చూపించారు. అదే ఏడాది డిసెంబర్లో 17 వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పుడు 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఈ ఏడాదిలో రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఇప్పుడేమో టెట్ అవసరం లేదంటున్నారని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే స్పందించకపోతే ఎవరికి చెప్పుకోవాలి.. గతంలో ప్రకటించిన విధంగా 23 వేల డీఎస్సీ పోస్టులు ఇవ్వాలని చల్లపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో శాంతియుతంగా ప్లకార్డుల ప్రదర్శన చేసినా సీఎం స్పందింకపోవడం దారుణమన్నారు. పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రే ఇలా వ్యవహరిస్తే మేమెవరికి చెప్పుకోవాలని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సీఎం స్పందించకపోగా రౌడీలు, గూండాల వలె తమను పలు పోలీస్ స్టేషన్లకు తరలించి ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్నామని, పోస్టులు తగ్గించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి 23వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రయివేట్ ఉద్యోగాలు మానుకుని వచ్చాం.. 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెబితే ప్రయివేటు ఉద్యోగాలు, పనులు అన్నీ మానుకుని డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం. రెండుసార్లు టెట్ పెట్టారు. ఇప్పుడేమో అవసరం లేదంటున్నారు. అప్పులు తెచ్చి డీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే ఏడు వేల పోస్టులు వేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. గతంలో ప్రకటించిన విధంగా డీఎస్సీ పోస్టులు పెంచాలి. – సీహెచ్ కిశోర్, రెడ్డిగూడెం, కృష్ణా జిల్లా -
డీఎస్సీలో పర్సంటేజీల పితలాటకం!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: డీఎస్సీ–2018లో ప్రభుత్వం పేర్కొన్న పర్సంటేజీ పితలాటకం లాంగ్వేజి టీచర్ అభ్యర్థులకు శాపంగా మారింది. బీఈడీలో ప్రవేశాలకు డిగ్రీ/పీజీల్లో ఓసీలు 50 శాతం, బీసీలు 40 శాతం మార్కులు సాధించాలి. డిగ్రీలో ఈ పర్సంటేజి లేనిపక్షంలో పోస్టు గ్రాడ్యుయేషన్లోనైనా ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లోనూ ఈ పర్సంటేజి ఉంటే చాలని పేర్కొన్నారు. అయితే, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీల)కు డిగ్రీలో 50 శాతం ఉండాలని తాజా డీఎస్సీలో నిబంధన విధించారు. కానీ, డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత శాతం లేని వారిని పీజీలో 50 శాతం ఉన్నా ఆన్లైన్లో ‘రిజెక్టెడ్’ అని వస్తోంది. దీంతో అర్హత ఉన్నా అన్యాయానికి గురవుతున్నామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, దరఖాస్తుల దాఖలుకు ఈనెల 16 వరకు మాత్రమే గడువుంది. 2018 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీలు వెరసి 7,907 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ పర్సంటేజి 50 శాతం ఉండాలన్న నిబంధన వీరికి శరాఘాతంలా మారింది. ఈ నిబంధనతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకి దూరమయ్యే ప్రమాదంలో పడ్డారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. అందులో పీజీలో 50 శాతం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులను డీఎస్సీకి అనుమతించారు. అదే మాదిరిగా రాష్ట్రంలోనూ పీజీలో 50 శాతం ఉన్న అభ్యర్థులను డీఎస్సీకి అనుమతించేలా మార్పులు చేయాలని వీరు కోరుతున్నారు. భారీ సిలబస్ కూడా భారమే.. ఇదిలా ఉంటే.. వచ్చే నెల 11న జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఖరారు చేసిన సిలబస్ ఎంతో కఠినంగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉదా.. పీజీటీలకు 50 పాఠాలు.. విద్యా ధృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ గ్రామర్, కవులు, రచయితల గురించి రాయాల్సి ఉంటుంది. ఇంతటి భారీ సిలబస్‌ను అక్టోబరు 31న ప్రకటించారు. గతంలో తేలికగా ఉండే సిలబస్‌ను ప్రకటించిన తేదీకి, పరీక్షకు 60 రోజుల వ్యవధి ఉండేది. కానీ, ఇప్పుడు 40 రోజులే సమయం ఇచ్చి కఠిన సిలబస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కాగా, దరఖాస్తు చేసుకున్న జిల్లాలో పోస్టులు ఖాళీ లేకపోతే పొరుగు జిల్లాల్లో రాసుకునే వెసులుబాటు కల్పించాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. పీఈటీ అభ్యర్థులకూ గందరగోళ పరిస్థితి మరోవైపు.. పీఈటీ అభ్యర్థుల పరీక్షల విధానంలోనూ ప్రభుత్వం మార్పుచేసింది. కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టి వారిని గందరగోళంలోకి నెట్టింది. కోర్టు తీర్పుల ద్వారా తొలగించిన శారీరక సామర్థ్య పరీక్షలను తెరపైకి తెచ్చింది. ఈ నిర్ణయం కొంతమందికి మేలు చేయాలన్న తలంపుతో తెచ్చిందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అలాగే, రాత పరీక్షకు మార్కులు తగ్గించి ఫిజికల్ టెస్ట్‌కు అధిక మార్కులు కేటాయించడంవల్ల కూడా అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. టీడీపీ నేతల బేరసారాలు ఈ నేపథ్యంలో కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నాయకులు అప్పుడే బేరాలకు తెరతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 30 మార్కులు ఫిజికల్ టెస్ట్‌లో సాధిస్తే ఉద్యోగం దాదాపు ఖాయమైనట్టేనన్న భావనతో కొందరు అభ్యర్థులు లక్షల్లో ముట్టచెప్పటానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తనకు రూ.10 లక్షలు ఇస్తే 30కి 28–29 మార్కులు వేయించగలనంటూ హామీలు ఇస్తున్న విషయం ఇప్పుడు కృష్ణాజిల్లా అవనిగడ్డ కోచింగ్ సెంటర్లలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, వయో పరిమితిని జనరల్ కేటగిరి అభ్యర్థులకు 44 ఏళ్లు, ఇతరులకు 49 ఏళ్లుగా నిర్ణయించారు. ఆ వయసులో 800 మీటర్ల పురుగు పందెం, లాంగ్ జంప్, హైజంప్‌లను ఎలా పూర్తి చేయగలమంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఫిజికల్ టెస్ట్ రాత పరీక్షకు ముందు ఉంటుందా? తరువాత ఉంటుందా? అన్నదీ అంతుపట్టకుండా ఉంది. సిలబస్ మార్పుతో సమస్యలు ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుని టెట్ పాసైన తరువాత డీఎస్సీ రాత పరీక్షకు సిలబస్ మార్చడం ఇబ్బందికరంగా ఉంది. తక్కువ సమయం ఉందనగా ప్రకటించడం, అందుకు తగ్గ పుస్తకాలు లభించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. – వాల్మీకి నరసింహ, పీఈటీ అభ్యర్థి, అనంతపురం మేం ఎలా పరిగెత్తగలం.. అన్ని ఫిజికల్ టెస్టులు పాసై బీపీఎడ్ పట్టా పొందాను. నేను ఇప్పుడు గర్భిణిని. ఈ సమయంలో నేను ఎలా పరిగెత్తగలను. మహిళలకు పెళ్లి తర్వాత ఫిట్‌గా ఉండలేం. వీరిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. – జీవన, పీఈటీ అభ్యర్థి, నెల్లూరు -
ముంచిన డీఎస్సీ రోస్టర్
-
బతుకుబాటతో ఆట
రాయవరం (మండపేట): ప్రభుత్వం డీఎస్సీపై దోబూచులాడుతోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. పూటకో మాట..రోజుకో నిర్ణయంతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని శిక్షణ పొందిన నిరుద్యోగ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కచ్చితమైన షెడ్యూల్ ప్రకటించక పోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. వాయిదాలు పడుతూ వస్తున్న ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న శిక్షణ పొందిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే డీఎస్సీ అభ్యర్థులకు పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ వద్దు.. డీఎస్సీ–2018 నియామకం కోసం ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్లో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఎస్జీటీ పరీక్షను ఆన్లైన్లో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. వారం రోజుల్లో ఒకరోజు సులభంగా, మరొక రోజు కఠినంగా పరీక్ష పేపర్ వస్తుందని గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు పేర్కొంటున్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగినా కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా విన్పిస్తోంది. డీఎస్సీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. స్పష్టం చేయాలి డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష విధానం ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అనేది ప్రభుత్వం ప్రకటించాలని నిరుద్యోగ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చాలామందికి ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన లేదు. దీంతో కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. జిల్లాలో సుమారు 50వేల మందికి పైబడి శిక్షణ పొందిన డీఎడ్, బీఎడ్, పండిట్, వ్యాయామ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలే తగ్గిన పోస్టులతో తీవ్ర ఆందోళన పడుతున్న అభ్యర్థులు పరీక్షా విధానంపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో మరింత గందరగోళ పడుతున్నారు. -
‘నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదన్నా’
సాక్షి, గజపతినగరం: ఓ వైపు టిట్లీ పెను తుఫాన్... మరో వైపు ఉదయం నుంచి వీస్తున్న భారీ ఈదురుగాలులు... ఇంకో వైపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు ప్రజాభిమానం ముందు చిన్నబోయాయి. తమ కష్టాలు తీర్చే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఇవేమీ ఖాతరు చేయని జనసందోహం నడుమ 284వ రోజు పాదయాత్ర విజయవంతంగా సాగింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో అరాచక టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలను జననేతకు విన్నవించుకున్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ జగన్‌ను కలిసిన దివ్యాంగుడు అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరద్యోగిగా మిగిలిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని న్యాయవాదులు జననేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ను న్యాయవాదులు కలిశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జననేతకు వినతి పత్రం అందించారు. రాజన్న తనయుడు వారందరికీ భరోసానిస్తూ ముందకు సాగారు. -
నడిసంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు
కర్నూలు శారదానగర్‌కు చెందిన వివాహిత విజయలక్ష్మి(26) గత మూడేళ్ల నుంచి డీఎస్సీ కోసం ఎదురుచూస్తోంది.టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆమె ఈసారి డీఎస్సీలో కచ్చితంగా జాబ్ సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే డీఎస్సీ వాయిదా పడిందని తెలియడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్సీని నమ్ముకొన్నవారి పరిస్థితికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఇలా రాష్ట్రంలో ఎంతో మంది అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు గత మూడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ ప్రకటనల్లో అంతో ఇంతో ఎక్కువ ఉండేవి.. ఉపాధ్యాయ పోస్టులే. అందులోనూ పోస్టుల భర్తీ ఏటా ఉంటుందన్న ఆశతో ఏటా వేలాది మంది డీఈడీ, బీఈడీ కోర్సుల్లో చేరుతున్నారు. ఫీజులు భారమైనా అప్పోసప్పో చేసి కాలేజీల్లో చేరుతున్నారు. ఇందుకోసం దూరప్రాంతాలకు వెళ్లి హాస్టళ్లలో, రూముల్లో ఉంటూ భారీ అద్దెలు చెల్లిస్తున్నారు. ఇంత కష్టపడి కోర్సులు పూర్తిచేస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం ఒక్క పోస్టూ భర్తీచేయకపోవడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. 30 వేల ఖాళీలున్నా.. రాష్ట్రంలో దాదాపు 30 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా గత నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీచేయలేదు. 2014 టెట్ కమ్ టీఆర్టీకి 4.20 లక్షల మంది హాజరయ్యారు. అప్పట్లో ప్రకటించిన పోస్టులు 10,313 మాత్రమే. అంటే.. ఆ పోస్టులు పొందిన వారు కాకుండా ఇంకా 4.10 లక్షల మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఈ నాలుగేళ్లలో డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారి సంఖ్య ఏటా 70 వేల వరకు ఉంటోంది. ఈ లెక్కన దాదాపు ఏడు లక్షల మంది డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. టెట్, డీఎస్సీల కోసం లక్షల్లో ఖర్చు 2014లో టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాక మళ్లీ ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. ఈలోగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన లక్షలాదిమంది అభ్యర్థులు, అంతకుముందు టెట్‌లో అర్హత సాధించినవారు డీఎస్సీ నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వెలువడవచ్చని చేస్తున్న చిన్నచిన్న ఉద్యోగాలను, ఉపాధి పనులను పక్కనపెట్టి పరీక్షల కోసం కోచింగ్ కేంద్రాల్లోనే గడుపుతున్నారు. కొంతమంది తమ కుటుంబాలకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే వేతనమే ఆధారమైనా ప్రభుత్వ టీచర్ పోస్టు సాధిస్తే బతుకు సాఫీగా ఉంటుందని భావించి కోచింగ్ కోసం వాటిని వదిలేశారు. కుటుంబ పోషణకు, శిక్షణకు డబ్బులేకపోయినా అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకున్నారు. అయినా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో రెండుసార్లు టెట్‌ను నిర్వహించింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండడంతో మెరిట్ జాబితాలో ముందుండవచ్చన్న ఆశతో మళ్లీ అందరూ వీటికి సన్నద్ధమవ్వాల్సి వచ్చింది. మళ్లీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులు, పుస్తకాలు, కోచింగ్‌కు ఖర్చు తడిసిమోపిడైంది. డీఎస్సీ వేస్తామంటూ ప్రతిసారీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటనలు చేస్తుండటంతో ఏ క్షణంలో అది వస్తుందో అని అభ్యర్థులు మళ్లీ శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లలో చేరారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కొన్ని నెలలు శిక్షణ పొంది మళ్లీ ఇళ్లకు చేరారు. మళ్లీ మంత్రి నుంచి ప్రకటనలు రావడంతో మళ్లీ కోచింగ్ సెంటర్లవైపు పరుగులు తీశారు. ఒక్కో దఫాకు రూ.50 వేల వరకు ఆయా కోచింగ్ సెంటర్లకు ఫీజుల కింద చెల్లించారు. డీఎస్సీ శిక్షణ కేంద్రాలు కృష్ణా జిల్లా అవనిగడ్డతోపాటు హైదరాబాద్, తదితర నగరాల్లో ఉన్నాయి. మూడు నెలల శిక్షణకు ఆయా కోచింగ్ సెంటర్లు ఒకొక్కరి నుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకు వరకు వసూలు చేస్తున్నాయి. ఇది కాకుండా అదనంగా మెటీరియల్ కోసం మరో రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. హాస్టల్లోనో, లేదంటే స్థానికంగా రూములు తీసుకొనో ఉండడానికి నెలకు కనీసంగా రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. మహిళలు అయితే మరిన్ని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వివాహితలు పిల్లలను ఇళ్ల దగ్గర వదిలి రాలేక తమతో పాటే వారిని కోచింగ్ సెంటర్లున్న ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. తమకు తోడుగా ఇంట్లోని వారిని కూడా తీసుకొని వెళ్తూ అద్దె రూముల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. అవివాహితల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంటోంది. తోడుగా తోటి అభ్యర్థినులు లేకుంటే ఇంటిదగ్గర నుంచి కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు. ఇలా అన్నిటికి కలిపి మూడు లేదా నాలుగు నెలలకు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. పరీక్షల విధానం తెలీక అయోమయం మరోపక్క ఈసారి డీఎస్సీని ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఆన్లైన్లో ఉంటుందని ప్రచారం జరిగినా ఆన్లైన్లో అభ్యర్థులకు అనుభవం లేకపోవడంతో తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మరీ సంకటంగా మారుతుంది. ఇప్పటివరకు వీరంతా పుస్తకాల ఆధారంగా కోచింగ్‌లు తీసుకున్నారే తప్ప ఎవరూ కంప్యూటర్‌పై పరీక్షలకు శిక్షణ తీసుకోలేదు. మరోవైపు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా నేషనల్ కౌనిŠస్ల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) అర్హత కల్పించింది. దీంతో వీరికి టెట్ పేపర్–1ను పెట్టాల్సి ఉంది. ఎన్సీటీఈ ఉత్తర్వులు వచ్చి రెండునెలలైనా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టలేదు. ఎన్సీటీఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టెట్‌ను వీరికి వేరేగా నిర్వహిస్తారా? లేక ఎస్జీటీ పోస్టుల వరకు టెట్‌ను, టీచర్ రిక్రూట్మెంట్ టెస్టును కలిపి నిర్వహిస్తారా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇలా డీఎస్సీ పోస్టుల ప్రక్రియ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు మాది శ్రీకాకుళం జిల్లా జిజివలస. నాకు పెళ్లైయి ఇద్దరు పిల్లలు. నా భార్య కూడా బీఈడీ పూర్తి చేసింది. మేమిద్దరం టెట్ పాసయ్యాం. రూ.10 వేలు చెల్లించి డీఎస్సీ కోచింగ్ తీసుకున్నా. తర్వాత మళ్లీ నోటిఫికేషన్ అని ప్రభుత్వం ప్రకటించడంతో విజయనగరంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లో రూ.13 వేలు వెచ్చించి శిక్షణ పొందాను. తాజాగా ఈ నెల 10న నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి గంటా ప్రకటించడంతో మళ్లీ విశాఖలో డీఎస్సీ కోచింగ్‌కు నాలుగు రోజుల క్రితమే రూ.20 వేలు చెల్లించి శిక్షణకు చేరాను. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిసారి వేలకు వేలు చెల్లించి కోచింగ్‌లు తీసుకోవడంతో మా ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తోంది. ఏమి చేయాలో పాలుపోవడంలేదు. –సాదె కృష్ణారావు, ఎంఏ, బీఈడీ (10విఎస్‌సీ292బి–320046–సాదె కృష్ణారావు) ఎన్నికల స్టంట్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తుందని ఆశపడి మా భార్యాభర్తలం అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నాం. ఇప్పటి వరకూ ఇద్దరికీ కలిపి కోచింగ్‌కి రూ.2 లక్షలు, ఇంటి అద్దెలు, మెస్ ఛార్జీలు కలిపి సుమారు రూ.4 లక్షల వరకూ ఖర్చు అయింది. ఈ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ చూస్తామన్న నమ్మకం కలుగడం లేదు. ఎన్నికల స్టంట్‌గా కనిపిస్తోంది. –నేకూరి సతీష్, డీఎస్సీ అభ్యర్థి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది డీఎస్సీ ప్రకటిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ అదిగో, ఇదిగో అంటూ తాత్సారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈరోజు, రేపు అంటూ చెబుతున్నారు తప్ప ప్రకటన మాత్రం వెలువడడం లేదు. ఒక వేళ డీఎస్సీ ప్రకటించినా ఎన్నికలలోపు పరీక్ష రాసినా ఉద్యోగాలు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. –మేరుగు కిరణ్, డీఎస్సీ అభ్యర్థి ఖర్చు భరించలేకున్నాం.. అవనిగడ్డలో గతేడాది కాలంగా కోచింగ్ తీసుకుంటున్నా. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో కోచింగ్ ఖర్చులు పెరిగిపోయాయి.. ఇంటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ పోటీలో ఎక్కడ వెనకపడిపోతామేమోనన్న భయంతో ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాను. -ఎస్కే నాగూల్ మీరా, ఎస్జీటీ, గంపల గూడెం,కృష్ణా జిల్లా. కోచింగ్‌కు వేల రూపాయల ఖర్చు ఉద్యోగం సాధించాలనే ఆశతో సొంత ఊరుకు దూరంగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం, గుళ్ళపల్లి వెళ్లి అక్కడ శిక్షణ పొందుతున్నా. ఎనిమిది నెలలుగా కోచింగ్ ఫీజు, హాస్టల్ వసతికి రూ.70 వేలు ఖర్చయింది. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పదపదే వాయిదా వేస్తుండటంతో చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబానికి ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగం వస్తుందనే ఆశతో అమ్మానాన్న ఫీజులు చెల్లించారు. – పోతుల భ్రమరాంబ, గురజాల ఎదురుచూసి అలసిపోయి.. డీఎస్సీ కోసం ఎదురు చూసి అలసిపోయా. ఎంతకూ డీఎస్సీ ప్రకటన రాకపోవడంతో ఎమ్మెస్సీ కూడా పూర్తి చేశా. అయినప్పటికీ ఆశ చావక నాలుగేళ్లున్నరేళ్లుగా ప్రిపరేషన్లోనే ఉన్నా. డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు తలెత్తడంతో ట్యూషన్లు చెప్పుకుంటున్నా. –దగ్గుమాటి శ్రీలత, కావలి ఇప్పటికే లక్ష దాకా ఖర్చయింది టెట్, డీఎస్సీ శిక్షణకు ఇప్పటికే ఒక లక్ష రూపాయిల దాకా ఖర్చయింది. మేము నలుగురు పిల్లలం. అయినా నాన్న డీఎస్సీ శిక్షణ ఇప్పించడానికి ఎంత ఖర్చైనా వెనకాడలేదు. వ్యవసాయ నేపథ్యం కలిగిన మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ శిక్షణకు పంపించారు. – మమత, కొండపల్లి, కనగానిపల్లి మండలం, అనంతపురం జిల్లా నెలకు రూ.3 వేల ఖర్చవుతోంది డీఎస్సీ కోసం ఆరు నెలలుగా కర్నూలులో అద్దె గదిలో ఉంటూ చదువుతున్నా. కోచింగ్ ఖర్చులు కాకుండా అద్దె, మెస్ చార్జీలతో కలిపి నెలకు రూ.3 వేలకు పైగా అవుతోంది. నోటిఫికేషన్ ఇస్తామని వాయిదా మీద వాయిదాలు వేస్తున్నారు. ఇలా వాయిదాలు వేస్తే ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది. – నారాయణ, ఎస్జీటీ అభ్యర్థి, కర్నూలు జిల్లా కాంట్రాక్టు ఉద్యోగాన్ని కూడా వదులుకుని.... నా పేరు శ్రీనివాసులు. మాది కడప. మా నాన్న 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ భారం నామీదే ఉంది. నాకు వివాహమైంది. అమె కూడా ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నేను రాయచోటి మున్సిపాలిటిలో కాంట్రాక్టు పద్ధతిన బిల్ కలెక్టర్‌గా పనిచేస్తూ ఉండేవాడిని. నెలకు రూ. 15 వేలు జీతం వచ్చేది. డీఎస్సీ కోసమని సెలవుపెట్టాను. దీంతో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒకటినర్న లక్ష జీతం పోవడంతోపాటు.. డీఎస్సీ కోసం 10 వేలకు పైగా ఖర్చు అయింది. ప్రస్తుతం నా భార్యకు వచ్చే జీతంతో కుటుంబం నడిస్తోంది. – శ్రీనివాసులు, కడప. డీఎస్సీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. పోస్టులు పెంచకుంటే అన్యాయానికి గురవుతాం. ఉద్యోగాలు కూడా వదులుకుని కోచింగ్‌లు పెట్టుకున్న ఈ తరుణంలో పోస్టులు కుదిస్తే మా పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. – కేతా సత్యనారాయణ (కొండ), డీఎడ్ అభ్యర్ధి, రాయవరం, తూర్పుగోదావరి జిల్లా. ఏమి చేయాలో పాలు పోవడం లేదు డీఎడ్ శిక్షణ పొంది రెండేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నాను. అప్పు చేసి ఆర్నెళ్ల పాటు కోచింగ్ తీసుకున్నాను. నోటిఫికేషన్ పడకపోవడంతో తిరిగి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నాను. – అల్లాడ సాయికుమార్, డీఎడ్ అభ్యర్థి, సోమేశ్వరం, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా. పాఠాలు చెప్పాల్సింది పోయి.. పనులకు నేను 2017లో టీటీసీ పూర్తి చేశాను. డీఎస్సీ రాసేందుకు శిక్షణ కోసం జిల్లా కేంద్రం ఒంగోలు వచ్చాను. కోచింగ్ ఫీజు, పుస్తకాలు, రూమ్ అద్దె, భోజనం కలుపుకుంటే దాదాపు లక్ష రూపాయల ఖర్చు అయింది. పాఠాలు చెప్పాల్సిన నేను ఊళ్లో పనులకు వెళ్లాల్సివస్తోంది. – వడ్లమూడి అనిల్‌కుమార్, జె.పంగులూరు, ప్రకాశం జిల్లా అన్యాయం చేస్తే ఊరుకోం ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన మాటప్రకారం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే. ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే ఊరుకునేది లేదు. నిరుద్యోగులంతా ఏకమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం. అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్న మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తే టీడీపీకి తగిన శాస్తి చెబుతాం. – వైభవి, చిత్తూరు అప్పలు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్నాం డీఎస్సీ కోసం అప్పులు చేసి మరీ కోచింగ్‌లు తీసుకుంటున్నాం. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం ఆశలు రేపడంతో ఎంతో కష్టపడి చదివాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు సమాచారం రావడంతో మా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. వేలాది రూపాయలు అప్పులు చేసి తీసుకున్న కోచింగ్‌లు వృథా అయిపోయాయి. ఆర్థికంగా నష్టపోయాం. – పి.శివకుమార్, ఎన్ఎన్ కాలనీ, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా -
నో జాబ్స్
-
డీఎస్సీ.. ఐదో ‘సారీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బుధవారం విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదని, ఈ నెలాఖరుకు కానీ ప్రకటన విడుదల చేయలేమని విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు. ఇలా ముందుగా షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేయకుండా వాయిదా వేయడం ప్రభుత్వానికి ఇది కొత్తకాదు. గత రెండేళ్లలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ తాజా తీరుతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు. పదో తేదీన నోటిఫికేషన్ ఇస్తామని ఈనెల 5న మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం తెలిసిందే. నవంబర్ 30న డీఎస్సీ పరీక్ష, వచ్చే జనవరి 3న ఫలితాలు విడుదల చేస్తామని షెడ్యూల్ తేదీలనూ ఆయన ఆర్భాటంగా ప్రకటించారు. అయితే షరామామూలుగానే ఈసారి కూడా నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. పోస్టులకు కోతపెట్టినా.. భర్తీ చేయకుండా కాలయాపన ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తొలి నుంచి నిరుద్యోగులతో దోబూచులాడుతోంది. ఏటా డీఎస్సీ వేస్తామని, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా గత నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది. మంత్రి గంటాతోపాటు సీఎం చంద్రబాబు కూడా ఇటీవల కాలంలో డీఎస్సీ నిర్వహిస్తామని చెబుతూ వచ్చారు. మంత్రి గంటా గత రెండేళ్లలో ఐదుసార్లు షెడ్యూల్ ప్రకటించినా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. 2014 నాటికే దాదాపు 22 వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నా కేవలం 10,313 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ఆ తర్వాత రిటైర్మెంట్లతో కలుపుకుంటే మళ్లీ ఖాళీ పోస్టుల సంఖ్య 30 వేలకు పైగా చేరింది. అయినా గత మూడేళ్లలో ఒక్క పోస్టూ భర్తీచేయలేదు. 2014 డీఎస్సీని రెండేళ్లకు కానీ పూర్తిచేయలేదు. ఏడాదిన్నర క్రితం మంత్రి గంటా విశాఖలో మాట్లాడుతూ 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఇటీవల 14,300 పోస్టులు భర్తీ అని, తర్వాత 12,370 పోస్టులని, మరోసారి 10,351 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ తేదీలనూ వెల్లడించారు. అయినా నోటిఫికేషన్ జాడ మాత్రం లేదు. ఈ మధ్యన రెండుసార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)ను నిర్వహించారు. వీటికి దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ కోచింగ్ సెంటర్లలో అటు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరుగా వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందుతున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్న వీరికి తాజా పరిణామాలు తీరని నిరాశను మిగిల్చాయి. సీఎం అనుమతి లేక గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని ఆర్థిక శాఖ 14,300 పోస్టుల భర్తీకి అనుమతుల కోసం విద్యా శాఖ ఫైలును ఆర్థిక శాఖ అనుమతికి పంపినా చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో దానికి గతేడాది కాలంగా మోక్షం లభించలేదు. ఎట్టకేలకు ఇటీవల ఆర్థిక శాఖ విద్యాశాఖకు 6,100 (5వేల పోస్టులు జడ్పీ, 1100 పోస్టులు మున్సిపల్ స్కూళ్లు) పోస్టుల భర్తీకి అనుమతించింది. వీటితోపాటు 3,175 గురుకుల స్కూళ్ల పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఆర్థిక శాఖ జీవో సెప్టెంబర్ 19న విడుదలై 20 రోజులు దాటినా ఈ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దాదాపు 30 వేలకు పైగా ఖాళీలుండగా 6,100 పోస్టులను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలో అర్థంకాక తలపట్టుకున్న అధికారులు ఎట్టకేలకు రోస్టర్ పాయింట్లను తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈసారి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని ఎన్సీఈఆర్టీ పేర్కొనడంతో ఆ పోస్టుల వరకు టెట్ కమ్ టీఆర్టీని పెట్టాల్సి ఉంటుందని అధికారులు కసరత్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితులకు డీఎస్సీ నిర్వహించాలని భావించారు. ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. మరోవైపు మున్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో ఏ మార్గంలో ముందుకు వెళ్లాలో మంగళవారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ చేతులెత్తేసింది. సంక్షేమ శాఖల పోస్టులపైనా తేల్చని సర్కారు సంక్షేమ గురుకుల పాఠశాలల పోస్టులను కూడా డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలా? లేదా వాటిని ఆయా శాఖల ద్వారానే నియామకం చేయాలా? అనే దానిపైనా ప్రభుత్వం తేల్చలేదు. మరోవైపు వేలాది పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం కేవలం 47 పోస్టులను మాత్రమే విడుదల కానున్న డీఎస్సీకి కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. అదనపు పోస్టులను ఈ డీఎస్సీలో ప్రకటించాలంటే వాటికి మళ్లీ ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. పీఈటీ పోస్టుల సంఖ్య పెరిగితే ఎస్జీటీ పోస్టుల్లో కోతపడక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పోస్టుల సంఖ్య భారీగా కుదించుకుపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో వేలాది మంది నిరుద్యోగులు పోస్టుల కోసం ప్రిపేరవుతుండగా అక్కడ పది లోపు పోస్టులు కూడా లేకపోవడంతో నిరాశలో మునిగిపోతున్నారు. ఇన్నేళ్లు కష్టపడి కోచింగ్‌లు తీసుకొని సన్నద్ధమవుతుంటే ఒకటీ అరా పోస్టులు కేటాయించి ప్రభుత్వం తమను మోసగిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మంత్రి గంటా ప్రకటనల తీరు ఇదీ.. ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ అని ప్రకటించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచింది. అప్పటి నుంచి డీఎస్సీపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదిగో డీఎస్సీ, అదిగో డీఎస్సీ అని ప్రకటన చేయడమే తప్ప నోటిఫికేషన్ మాత్రం రాలేదు. - 2014, జూలై 3న టెట్ రద్దు చేస్తున్నామని, ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని తొలి ప్రకటన చేశారు. - 2014, జూలై 6న సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ప్రకటించారు. తీరా నోటిఫికేషన్ వెలువడలేదు. చివరకు 2015, సెప్టెంబర్‌లో టీఆర్టీ నోటిఫికేషన్ రాగా 2016 చివర్లో గానీ ఎంపికైనవారికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. - 2017, ఆగస్టులో 22 వేల పోస్టులకు త్వరలో డీఎస్సీ అని విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మంత్రి గంటా ప్రకటన చేశారు. - 2017, డిసెంబర్ 7న విజయవాడలో మీడియా సమావేశంలో 2018 డీఎస్సీ షెడ్యూలును మంత్రి గంటా విడుదల చేశారు. డిసెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. 12,370 పోస్టులను భర్తీ చేస్తామని, 2018 మార్చి 23, 24, 25 తేదీల్లో రాతపరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. - డిసెంబర్లో ప్రకటన రాకపోగా అదే నెలలో 2018, జనవరి సంక్రాంతి నాటికి పండగ కానుకగా డీఎస్సీని ప్రకటిస్తామని ప్రకటన చేశారు. అయితే జనవరి గడిచిపోయినా డీఎస్సీ ప్రకటన ఊసేలేదు. - వేసవి సెలవుల్లో డీఎస్సీని పూర్తిచేసి స్కూళ్లు తెరిచే నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామని పలుమార్లు పేర్కొన్నా జూన్ దాటిపోయినా షెడ్యూల్ రాలేదు. - తాజాగా 14,300 పోస్టులు భర్తీ చేస్తామని ఒకసారి, 10,351 పోస్టులని మరోసారి పేర్కొంటూ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు - చివరకు 6,100 పోస్టులకు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నామంటూ ఈ నెల 5న షెడ్యూల్ ప్రకటించారు. దీన్ని కూడా విడుదల చేయలేక వాయిదా వేశారు. -
6,100 పోస్టులకే డీఎస్సీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఈ నెల 10వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అధికారులతో కలిసి శుక్రవారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. టెట్ కమ్ టీఆర్టీ విధానంలో ఉపాధ్యాయుల ఎంపిక కొనసాగుతుందన్నారు. డీఎస్సీ పరీక్ష నవంబరు 30వ తేదీన నిర్వహించనున్నామని, 2019 జనవరి 3వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో 6,100 ఖాళీల భర్తీకి ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో మరో 3,175 ఖాళీలకు డీఎస్సీ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని.. అయితే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పాఠశాల విద్యా శాఖ అధికారులు 10,354 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. కేవలం 6100 పోస్టుల భర్తీకే అనుమతి వచ్చిందన్నారు. కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటుపై శ్వేతప్రతం విభజన చట్టంలో హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేశామని చెబుతున్న జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు అయి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా అవి తాత్కాలిక భవనాలలోనే నడుస్తున్నాయని మంత్రి గంటా వివరించారు. జాతీయ విద్యా సంస్థలు మంజూరు, వాటి నిర్వహణ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి గంటా ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఇటీవల రాష్ట్ర పర్యటనలో.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చెప్పిన దానికంటే ఎక్కువ చేసిందని మాట్లాడారని.. దీనిపై ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని జాతీయ విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ బోధన సిబ్బందే ఉన్నారని, పర్మినెంట్ ఫ్యాకల్టీ నియామకానికి కేంద్రం చొరవ చూపడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. 17 కేంద్ర విద్యా సంస్థలకు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 3,508 ఎకరాల భూమిని కేటాయించిందని గంటా వెల్లడించారు. కేంద్రీయ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు, పూర్తిస్థాయి బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు వాటిలో చేరడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇప్పటికయినా పూర్తిస్థాయిలో విద్యా సంస్థలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతాపార్టీ నేతలను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. లేకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. -
అధికారమిస్తే మెగా డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా మరో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర సాధన ఉద్యమంలో యువత కీలకంగా పాల్గొని ప్రాణ త్యాగాలు చేస్తే వారి ఆశలను సీఎం కేసీఆర్ నీరుగార్చారని విమర్శించారు. తన ఇంట్లో ఉద్యోగాలు నింపుకునే పనిలో మునిగిపోయిన కేసీఆర్.. రాష్ట్రంలోని నిరుద్యోగుల గురించి మర్చిపోయారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు సీఎం ద్రోహం చేశారని, కేసీఆర్‌పై యువత రగిలిపోతోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. జోనల్ వ్యవస్థపై కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, ఇందులో ఆయన కొత్తగా సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్ అని విమర్శించారు. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పనలో సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు తెలంగాణ వస్తే ఒక్క దెబ్బతో లక్ష ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని.. కానీ రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలుంటే 11 వేలే భర్తీ చేశారని ఉత్తమ్ విమర్శించారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులూ నింపలేదన్నారు. ఐటీఐఆర్ ద్వారా 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి దాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కేసీఆర్‌కు అధికారం నుంచి దిగిపోయే ముందు నిరుద్యోగ భృతి గుర్తుకొచ్చిందా అని ఉత్తమ్ ప్రశ్నించారు. తాము నిరుద్యోగ భృతి ఇస్తామంటే అవహేళన చేసి.. ఇప్పుడు తానిస్తానని ఎలా చెపుతున్నారని నిలదీశారు. తనపై విమర్శలు చేసే నైతికత దానం నాగేందర్‌కు లేదని, పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, దాసోజు శ్రావణ్, ఓయూ విద్యార్థి నేతలు మానవతారాయ్, విజయ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, దరువు ఎల్లయ్య, చరణ్‌కౌశిక్, దుర్గం భాస్కర్, కేతూరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్జెక్టు చెప్పేవారేరీ ?
ఒంగోలు టౌన్: గత ఏడాది సాధించిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు అనేక మంది తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సమయంలో సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే మోకాలొడ్డింది. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించింది. ఎంతో ఆశతో తమ పిల్లలను ప్రభుత్వ రెండు నెలలు దాటడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే అవకాశం లేక విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం సందిగ్ధంలో పడేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల షార్ట్, పాఠ్య పుస్తకాలు లేట్‌గా రావడంతో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకే అసలైన పరీక్షా కాలం వచ్చినట్లయింది. మరికొన్ని రోజుల్లో సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సగం సిలబస్‌తో ఆ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సమ్మెటివ్–1కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం విశేషం. డీఎస్సీ డ్రామా.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేస్తానంటూ నిరుద్యోగ అభ్యర్థులకు వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. డీఎస్సీకి సంబంధిత మంత్రితో ప్రకటన చేయించడం, నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఏదో ఒక కొర్రీ వేసి దానికి బ్రేక్‌లు వేయడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, ల్యాంగ్వేజి పండిట్, పీఈటీలకు సంబంధించి మొత్తం 12,655 పోస్టులు ఉన్నాయి. వీటిలో 810కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 291 పోస్టులు, హిందీ సబ్జెక్టులో 220 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీలకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 184 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సోషల్ స్టడీస్‌లో 37 పోస్టులు, బయోలాజికల్ సైన్స్‌లో 21 పోస్టులు, మ్యాథ్స్‌కు 14 పోస్టులు, ఇంగ్లిష్‌కు 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పదుల సంఖ్యలో ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయలు ఉద్యోగ విరమణ చేశారు. దాంతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు భారం పడింది. ప్రహసనంగా పాఠ్య పుస్తకాలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రహసనంగా మారింది. ఏటా వేసవి సెలవుల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించి జిల్లాలోని డిపోలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏనాడూ సకాలంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించిన దాఖలాలు లేవు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభించిన రెండున్నర నెలల తరువాతే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించగలిగారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 4 లక్షల 68 వేల మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 56,541 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 2 లక్షల 18 వేల 128 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 18 లక్షల 42 వేల 462 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని జిల్లా విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గత ఏడాదికి సంబంధించి లక్షా 39 వేల 596 పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రింటర్ల నుంచి జిల్లాకు 16 లక్షల 74 వేల 200 పాఠ్య పుస్తకాలను జిల్లాలోని డిపోకు తరలించారు. ప్రైవేట్, కాన్వెంట్ స్కూల్స్‌లోని విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభించిన వారంలోపు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలతో తరగతులకు హాజరై పాఠాలు నేర్చుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మాత్రం పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు వచ్చేసరికి రెండున్నర నెలలు పట్టింది. దీంతో కొన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు వెనుకబడిపోయారు. ఇది వచ్చే మార్జిన్లో జరిగే పరీక్షలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ‘యాప్’సోపాలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ‘యాప్’సోపాలు పడుతున్నారు. ప్రతి దానికి ఓ యాప్ పెట్టి దాని ద్వారానే కార్యకలాపాలు తెలియజేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అనేక మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం కంటే యాప్‌లకు సమాధానాలు చెప్పే సరికే పాఠశాల సమయం ముగిసిపోతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు ప్రతిదానికి ఒక యాప్ పెట్టడంతో ఉపాధ్యాయులు ఎక్కువ సమయం యాప్‌ల ద్వారా వివరాలు పంపించడానికే సరిపోతోంది. ప్రతిరోజూ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య, ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారో ఆ వివరాలను యాప్ ద్వారా అధికారులకు పంపించాలి. స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ విద్యాలయ యాప్‌లకు వివరాలు అందించాలి. యూనిఫారాలు అందించే ప్రతిసారీ విద్యార్థి బయోమెట్రిక్ తీసుకొని ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల ఫలితాలు యాప్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల స్కాలర్షిప్, గ్రీన్ కోర్ కమిటీల వివరాలు, మొక్కలకు జియోట్యాగింగ్ యాప్ ద్వారా పంపాలి. సిగ్నల్ సమస్య తలెత్తితే అది కలిసే వరకు ఉపాధ్యాయులు సిగ్నల్ కోసం చూస్తుండటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం తగ్గిపోతోంది. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల కంటే సెల్ఫోన్లు చూసుకునేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు యాప్‌ల గోలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కుంటుపడుతోంది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు కూడా అంగీకరిస్తుండటం గమనార్హం.