
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించాం. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
‘‘విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసీ. అమరావతి రాజధాని అయితే, చంద్రబాబు కాపురం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు. కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?’’ అని మంత్రి ప్రశ్నించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. విద్యార్థులకు రాగి జావ నిలిపేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పరీక్షలు, ఒంటిపూట బడుల వల్లే చిక్కీలు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
చదవండి: చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment