TS: DSC నోటిఫికేషన్‌ విడుదలపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు | TS Job Recruitments: Telangana DSC Recruitment Notification 2023 Released By Sabitha Indra Reddy - Sakshi
Sakshi News home page

TS DSC Notification 2023: రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌.. మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు

Published Thu, Aug 24 2023 1:30 PM | Last Updated on Thu, Aug 24 2023 4:37 PM

DSC Notification Released In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. 

మంత్రి సబిత బషీర్‌బాగ్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 5089 ఉపాధ్యాయ, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌, విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement