sabitha indrareddy
-
నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అధికారిక కసరత్తు ఊపందుకుంది. విద్యాశాఖ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకూ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే వీలుంది. వెంట వెంటనే ఎడిట్ ఆప్షన్లు, జాబితాల తయారీ చేపట్టి, సెప్టెంబర్ నెలాఖరుకు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లుండగా ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియనే ప్రధాన ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. డీఈవోలతో డైరెక్టర్ టెలీకాన్ఫరెన్స్ జిల్లా విద్యాశాఖాధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సక్రమంగా చేపట్టేందుకు సన్నద్ధమవ్వాలని కోరారు. అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. బదిలీలకు కటాఫ్ డేట్‌ను గతంలో ఫిబ్రవరి 1గా నిర్ణయించారని, ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో బదిలీల కోసం దాదాపు 78 వేల దరఖాస్తులు అందాయి. ఇందులో 58 వేలు అర్హమైనవిగా గుర్తించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. టీచర్లు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసినట్లయితే బదిలీకి అర్హులవుతారు. కటాఫ్ తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 1 నాటికి 8, 5 ఏళ్ళు నిండే వాళ్ళ జాబితాను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన టీచర్లు సర్వీస్ కాలాన్ని ఆన్లైన్లో పొందు పర్చడమా? డీఈవోలే ఈ డేటాను అప్డేట్ చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఖాళీల విషయంలో సమగ్ర వివరాలను మాత్రం డీఈవోలు అందించాల్సి ఉంటుంది. మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. కటాఫ్ తేదీ పొడిగించడంతో ఇప్పుడు ఖాళీల సంఖ్యలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. చిక్కుముడిగా దివ్యాంగుల వ్యవహారం అంగ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 70 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అయితే ఇటీవల న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఓ కేసులో తీర్పు ఇచి్చంది. దీంతో బదిలీల్లోనూ దీన్నే కొలమానంగా తీసుకోవాలని దివ్యాంగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు అందజేయాల్సిందిగా మంత్రి సబిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 317 జీవో ద్వారా బదిలీ అయిన వారికి సర్వీస్ పాయింట్లలో అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలు హన్మంతరావు, నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా షెడ్యూల్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేయడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అన్ని స్థాయిల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీఆర్టీయూటీఎస్ నేతలు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు సూచించారు. సంఘాల హల్చల్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవ్వడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులను, మంత్రి సబితను కలుస్తున్నారు. పలు సలహాలు సూచనలతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సప్టెంబర్ 1ని కటాఫ్‌గా నిర్ణయించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మంత్రి సబితకు వినతి పత్రం సమర్పించారు. ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని టీఎస్‌యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి అధికారులను కోరారు. ఇది కూడా చదవండి: సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి -
TS: DSC నోటిఫికేషన్ విడుదలపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. మంత్రి సబిత బషీర్‌బాగ్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్యకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 5089 ఉపాధ్యాయ, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో నోటిఫికేషన్, విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే.. -
ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా
-
TS: వచ్చే వారం ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోగా రిజల్ట్స్ ప్రకటించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు గత రెండు రోజులుగా వేగం పుంజుకుంది. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ ను త్వరగా ముగించారు. ఇప్పటికే పలు దఫా లుగా ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కరించా రు. ఈ ప్రక్రియలో గత రెండు రోజులుగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, దీన్నిబట్టి ఫలితాల వెల్లడికి ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫలితాల విడుదల తేదీ ఖరారు కాకున్నా, ఈ నెల 13లోగా కచ్చితంగా వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డ్ ముఖ్య అధి కారి తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనే.. పలు దఫాలుగా ఫలితాల విశ్లేషణ, క్రోడీకరణ, కోడింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. మంత్రి అనుమతి తర్వాత తేదీ ఖరారు.. ఫలితాల వెల్లడికి సంబంధించిన కసరత్తును సోమవారం నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు బోర్డు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ అధికారులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజు పరీక్షల ఫలితాల వెల్లడి సమాచారాన్ని తెలియజేస్తారు. మంత్రి అనుమతి తర్వాత ఫలితాల వెల్లడి తేదీని ఖరారు చేస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23,901 మంది హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలో పూర్తయింది. రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు ఎంసెట్‌తో పాటు, అనేక పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది కూడా చదవండి: ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే! -
కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలతో పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రసక్తే ఉండదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగి, కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉన్నప్పుడు బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని, కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సభ్యుల ప్రసంగాల్లో భాగంగా ఉపాధ్యాయ బదిలీలపై పలు అంశాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం జోక్యం చేసుకుంటూ జీఓ 317లో భాగంగా పలువురు ఉపాధ్యాయులకు పల్లె బడుల్లో పోస్టింగ్ లిచ్చారని, తాజాగా బదిలీల నిబంధనల సడలింపుతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీ అయ్యే ప్రమాదముందంటూ సూచనలు చేశారు. దీనిపై మంత్రి పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా టీచర్ లేని పాఠశాలలు ఉండకూడదనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని వివరించారు. జీఓ 317 బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, జిల్లాల్లో ఖాళీల ఆధారంగా వారికి సొంత ప్రాంతాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యుడు ఏ.నర్సిరెడ్డి సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన క్రమబదీ్ధకరణ చేయాలని, కనిసీ వేతనాన్ని రూ.25వేలకు పెంచాలని కోరారు. యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించిన బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ త్వరితంగా ఆమోదించాలని, దీంతో నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలు నిర్దేశించిన లొకేషన్లలో కాకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని, దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా లేదని, తక్షణ చర్యలు తీసుకోవాలని మరో సభ్యుడు కె.జనార్ధన్‌రెడ్డి కోరారు. పాడి రైతుకూ ఉచిత కరెంట్ ఇవ్వాలి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నట్లుగానే పాడి రైతులకూ ఉచిత కరెంటు ఇవ్వాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పాడి రైతులు గడ్డికోత మెషీన్లు, ఇతరాలకు కరెంటును వినియోగిస్తుండగా... అధికారులు వాటికి చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో చాలాచోట్ల రైతాంగం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతోందని, వాటిని అరికట్టేందుకు స్టెరిలేజేషన్ యూనిట్లను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ రంగంలో 2,42,142 ఉద్యోగాలు కల్పించామని, ఇప్పుడు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి కేంద్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఈ అంశంపై నిలదీస్తే రాష్ట్రాలను బదనాం చేస్తోందని ఎమ్మెల్సీ బండప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే వ్యవహరిస్తోందని, కానీ కేంద్రం మాత్రం పరిధులు దాటి దేశాన్ని అప్పులపాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటివరకు రూ.54వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇక రైతుబందు బడ్జెట్లో 40శాతానికిపైగా బీసీలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇతర పద్దుల్లోనూ బీసీలకు సమ వాటా అందిస్తోందని ఆయన తెలిపారు. -
TS: పరీక్షా విధానంలో సంస్కరణలు.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకువచ్చింది. అందులో భాగంగానే 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లను తీసుకువచ్చింది. కాగా, ఈ సంస్కరణలు 2022-23 నుంచి అమలులోకి రానున్నాయి. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులతో పరీక్ష విధానం ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు ఇవ్వనున్నారు. ఫిజిక్స్, బయాలజీకి సగం సగం మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. టెన్త్ పరీక్షలు ఆరు పేపర్లకు కుదించాము. వంద శాతం సిలబస్‌తో పరీక్షల నిర్వహణ ఉంటుంది. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం కేటాయించాము. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉంటాయని సబిత స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. -
మెట్రో బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
-
గవర్నర్ Vs టీఆర్ఎస్: తమిళిసై ప్రెస్‌మీట్ వేళ ట్విస్ట్ ఇచ్చిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టుగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ తమిళిసై.. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీంతో ఆమె ప్రెస్‌మీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. గవర్నర్‌లో విభేదాల విషయంతో ప్రభుత్వం స్పందించింది. తాజాగా గవర్నర్‌ను కలిసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ క్రమంలో గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజ్‌భవన్‌కు వెళ్తామని విద్యాశాఖ మంత్రి, అధికారులు స్పష్టం చేశారు. ఇక, అంతకుముందు.. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. -
నిజాం కాలేజీలో పీక్ స్టేజ్‌కు విద్యార్థినిల ఆందోళన.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల ఘటన ముగియకముందే నిజాం కాలేజీ విద్యార్థులు నిరసనలు దిగారు. నిజాం కాలేజీలో విద్యార్థినిలు ఆందోళన బాటపట్టారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు. కొత్త హాస్టల్ బిల్డింగ్‌ను పీజీ విద్యార్థులకు కేటాయించడంపై నిరసనలు తెలుపుతున్నారు. యూజీ హాస్టల్ పీజీ కెట్ల..? డిగ్రీ వాళ్లు ఉండేదెట్ల..? అంటై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక, విద్యార్థినిల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై కేటీఆర్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ చేసి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మంత్రి సబిత సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. -
TS TET Results 2022: టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు వెల్లడించారు. టెట్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (https://results.sakshieducation.com/)లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. - టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత, 32.68% ఉత్తీర్ణత సాధించారు. - టెట్ పేపర్-2లో 1,24,535 మంది అర్హత, 49.64 % ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఇప్పటికే టెట్ ఫైనల్ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరి టెన్త్ ఫలితా ల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 87.61% మంది పాసయితే, బాలికలు 92.45% (4.84% ఎక్కువ) మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 90% ఉత్తీర్ణత నమోదయ్యింది. మొత్తం 3,007 స్కూళ్లు 100% ఫలితాలు సాధించాయి. 15 స్కూళ్ళలో సున్నా ఉతీర్ణత నమోదైంది. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకూ జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.పరీక్షల ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. హైదరాబాద్‌లో అతితక్కువ ఉత్తీర్ణత మొత్తం 5,03,579 మంది టెన్త్ పరీక్షలు రాయగా 4,53,201 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,55,433 మంది బాలురకుగాను 2,23,779 మంది, 2,48,146 మంది బాలికలకుగాను 2,29,422 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలో సిద్దిపేట (97.85 శాతం), నిర్మల్ (97.73 శాతం) మొదటి, రెండో స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉత్తీర్ణత (79.63 శాతం) నమోదైంది. రెసిడెన్షియల్ పాఠశాలలు 99.32 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 75.68 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 రోజుల్లోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్.. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు జూలై 18లోగా సంబంధిత పాఠశాలలో పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఠీఠీఠీ. bట్ఛ. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn వెబ్సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కుల రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక క్లాసులు: మంత్రి సబిత టెన్త్ ఫలితాలపై మంత్రి సబిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల దాకా వారానికి రెండు రోజుల పాటు ప్రత్యేక క్లాసులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో అతి తక్కువ ఫలితాలు నమోదవ్వడంపై లోతైన పరిశీలన చేపడతామని చెప్పారు. ఉత్తీర్ణత ఇలా... మేనేజ్మెంట్ ఉత్తీర్ణత శాతం రెసిడెన్షియల్ 99.32 సోషల్ వెల్ఫేర్ 98.1 బీసీ వెల్ఫేర్ 97.45 మోడల్ స్కూల్స్ 97.25 ట్రైబల్ వెల్ఫేర్ 95.83 రెసిడెన్షియల్ (మినీ) 93.73 కేజీబీవీ 93.49 ప్రైవేటు 91.31 ఆశ్రమ 88.7 జెడ్పీ స్కూల్స్ 87.13 ఎయిడెడ్ 85.37 ప్రభుత్వ స్కూల్స్ 75.68 మొత్తం 90.00 -
ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలు భళా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కన్నా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 76 శాతం ఫలితాలతో మేడ్చల్ మొదటి స్థానంలో, 74 శాతంతో హనుమకొండ రెండో స్థానంలో నిలిచింది. రెండో ఏడాదిలో సైతం 78 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మొదటి స్థానంలో నిలువగా, 77 శాతంతో కుమురం భీం ఆసిఫాబాద్ రెండో స్థానంలో ఉంది. మే నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోవిడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, సీజీజీ డైరెక్టర్ ఖాలిక్, పరీక్షల విభాగం ఓఎస్డీ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫస్టియర్‌లో..: ఫస్టియర్‌లో మొత్తం 4,64,892 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,94,378 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది (1,93,925) ‘ఎ’గ్రేడ్ సాధించారు. 63,501 మంది ‘బి’గ్రేడ్, 24,747 మంది ‘సి’గ్రేడ్, 12,205 మంది ‘డి’గ్రేడ్ సాధించారు. బాలికలు 2,33,210 మంది పరీక్ష రాస్తే, 1,68,692 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,31,682 మందికి గాను 1,25,686 మంది పాసయ్యారు. సెకెండియర్.. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,97,458 మంది పాసయ్యారు. ఈ సంవత్సరంలో కూడా ఎక్కువమందికి (1,59,432) ‘ఎ’గ్రేడ్ వచ్చింది. 82,501 మంది ‘బి’గ్రేడ్, 35,829 మంది ‘సి’గ్రేడ్, 18,243 మంది ‘డి గ్రేడ్’సాధించారు. 2,19,271 మంది బాలికలు పరీక్ష రాస్తే 1,65,060 మంది, 2,23,624 మంది బాలురుకు గాను 1,32,398 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ: సబిత ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఆగస్టు ఒకటి నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ఈ నెల 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టు చివరి నాటికి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. కోవిడ్ కాలంలోనూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు తీసుకున్న చొరవను అభినందించారు. ఒకే క్లిక్‌లో ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ఎంపీసీలోనే ఎక్కువ ఉత్తీర్ణత ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల్లోనూ 70 శాతానికిపైగా విద్యార్థులు పాసయ్యారు. రెండో స్థానంలో బైసీపీ ఉంటే, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల విద్యార్థుల ఉత్తీర్ణత 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఉత్తీర్ణత ఇలా.. ఫస్టియర్ : 63.32% సెకెండియర్: 67.16% ఫస్టియర్: బాలికలు: 63.32% బాలురు: 54.25% సెకెండియర్: బాలికలు: 75.28% బాలురు: 59.21% గ్రూపుల వారీగా ఉత్తీర్ణత శాతం ఫస్టియర్ సెకెండియర్ ఎంపీసీ 76.3 79.6 బైపీసీ 71.9 75.3 సీఈసీ 44.4 47.7 హెచ్ఈసీ 31.8 45.7 ఎంఈసీ 64.7 69.4 ––––––––– 2018–22 వరకూ ఇంటర్ జనరల్ (ఒకేషనల్ కాకుండా) విభాగంలో ఫలితాలు (శాతాల్లో) ఇలా... ఫస్టియర్ సెకెండియర్ 2018 62.74 67.08 2019 60.60 64.94 2020 61.07 69.61 2021 100 100 2022 64.85 68.88 (నోట్: 2021లో కోవిడ్ వల్ల పరీక్షలు లేకుండానే పాస్ చేశారు) -
బాసర ఐఐఐటీ విద్యార్థుల నిరసనపై స్పందించిన మినిస్టర్ కేటీఆర్
-
బాసర ట్రిపుల్ ఐటీ: స్పందించిన కేటీఆర్.. ఆపై చర్చలు విఫలం..
బాసర ట్రిపుల్ ఐటీలో(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం)లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ట్రిపుల్లో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్ధులు.. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం విద్యార్థులుతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారుల ముందు విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. కాగా, విద్యార్థులు డిమాండ్లకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమైనట్టు సమాచారం. దీంతో, విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు విద్యార్థులు.. మెస్‌లో భోజనం సరిగా లేదని, కరెంట్ ఉండటం లేదని, వాటర్ సమస్య వెంటాడుతోంది ఆరోపించారు. అలాగే, విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్స్ కూడా ఇవ్వడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. ఇక, రెండు సంవత్సరాల నుండి బాసర ట్రిపుల్ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. వారికి కూడా లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ విద్యార్థులకు పెట్టే భోజనంలో బొద్దింకలు, బల్లులు రావడంతో వారు ఆందోళన చేపట్టారు. మరోవైపు.. విద్యార్థుల ఆందోళనలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందకండి అంటూ ట్విట్టర్ వేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ విషయంపై బుధవారం.. వైస్ ఛాన్స్లర్(వీసీ)తో సమావేశం కానున్నట్టు తెలిపారు. Will take all the issues mentioned to the notice of Hon’ble CM KCR Garu & Education Minister @SabithaindraTRS Garu Kindly be assured that we are committed to resolving any challenges with respect to improving quality of education https://t.co/jNLkemAkMU — KTR (@KTRTRS) June 15, 2022 ఇది కూడా చదవండి: చదువు చెప్పే గురువులేరి? -
TS: పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ‘‘పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలి. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీగా పరీక్షలను నిర్వహించాలి. మే 23వ తేదీ నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఏంఈవో ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేయాలి. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు చేర్చడం జరిగింది. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి హాల్ టిక్కెట్లను పొందాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. పరీక్షలు జరుగుతున్న సమయంలో కరెంట్ సప్లైకు అంతరాయం కలగకూడదు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన రీతిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్.. ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా జిల్లాల వారీగా పరిశీలకులను నియమించడం జరుగుతుంది. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఉండేలా ముందస్తుగానే తనిఖీలను నిర్వహించాలి. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే పరీక్షలను నిర్వహించే నాటికి వాటిని పరిష్కరించాలి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి’’ అని సూచించారు. ఇది కూడా చదవండి: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన -
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
-
తెలంగాణ: రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. tsbie.cgg.gov.inలో ఫలితాలు చూడవచ్చు. చదవండి: రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
వస్తు తయారీ కేంద్రంగా హైదరాబాద్
అబ్దుల్లాపూర్‌మెట్(హైదరాబాద్): ప్రపంచంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, వస్తు తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగాను నగరం చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నగరంలో తయారైన ప్రతి వస్తువును దేశంలోని అన్నిప్రాంతాలకు రవాణా చేసేందుకు లాజిస్టిక్ పార్కులు దోహదపడతాయన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాలలో నిర్మించిన లాజిస్టిక్ పార్కును గురువారం విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం 50 లక్షల చదరపు అడుగుల గోదాములు అందుబాటులో ఉండగా, నగరం చుట్టూ ఇంకా కోటిన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్కుల ఆవశ్యకత ఉందన్నారు. నగరం చుట్టూ 8 రహదారులకు ఆనుకుని లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటివరకు 14 వేలకు పైచిలుకు పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫార్మాసిటీపై అపోహలు వద్దు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, దాని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయపార్టీలు రాద్ధాంతాలు చేయడం మానాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ఏ ఇబ్బంది వచ్చి నా పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఫార్మాసిటీలో పనిచేసే కార్మికులు కూడా స్థానికంగానే నివాసముంటారని, అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 50 ఏళ్ల ముందుచూపుతో కేసీఆర్ ప్రణాళికలు: సబిత వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు వెలుపల ఉన్న ప్రాంతాలను కూడా హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, లాజిస్టిక్ పార్కు సీఈవో రవికాంత్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ, జెడ్పీటీసీ సభ్యుడు బింగి దాసుగౌడ్, బాటసింగారం సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, నాయకులు క్యామ మల్లేష్‌తోపాటు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
సర్కారు బడిపిల్లల ఇన్నోవేషన్
-
రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రవేశాల కమిటీ పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకు 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించిన సమయంలో కరోనా బారిన విద్యార్థుల నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. వారికి ఈనెల 8వ తేదీన పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. -
ఫెయిలైన విద్యార్థులంతా పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన వార్షిక పరీ క్షల్లో ఫెయిలైన 1,61,710 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులం దరినీ పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిం చాల్సి ఉన్నా, కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా వాటిని రద్దుచేస్తూ సీఎం ఈ నిర్ణయం తీసు కున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తీర్ణులైన ఈ విద్యార్థులంతా కంపార్ట్ మెంటల్‌లో పాసైనట్లుగా మార్కుల మెమోల్లో పేర్కొంటామని తెలిపారు. విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఈ నెల 31 తర్వాత సంబం ధిత కాలేజీల్లో పొంద వచ్చన్నారు. వార్షిక పరీక్షల్లో పాసై, తమకు తక్కువ మార్కులు వచ్చాయని, తాము బాగా రాసినా ఎందుకు ఫెయిలయ్యామని తెలుసు కునేందుకు మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికే షన్ కమ్ ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసు కున్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల్లో వెల్ల డిస్తామని మంత్రి వివరించారు. కాగా, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిలై, ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాసైన విద్యార్థు లకు సంబంధించి ప్రథమ సంవత్సర బ్యాక్ లాగ్స్ ఏమైనా ఉన్నా.. వాటిలోనూ పాస్ చేస్తామని అధికారులు తెలిపారు. ఫస్టియర్ విద్యార్థుల పరిస్థితేంటి? ద్వితీయ సంవత్సర విద్యార్థులను పాస్‌చేసిన ప్రభుత్వం వార్షిక పరీక్షల్లోనే ఫెయిలైన 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థుల విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో అందరినీ పాస్ చేసింది. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టం చేయలేదు. కరోనా అదుపులోకి వచ్చాక పరీక్ష పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. లేదంటే వచ్చే ఏడాది వార్షిక పరీక్షలతో ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలను కూడా రాసుకోవాల్సి వస్తుంది. అప్పుడు పరీక్షలు రాయాలంటే ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలతోపాటు ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావాల్సి ఉంటుంది. దాంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే కరోనా అదుపులోకి వచ్చాక వారికి పరీక్షలను నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే వారిని పాస్‌చేసే అంశంపైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికి ముందుగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంసెట్, ఇతర సెట్స్ రాసుకునేలా, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లేకపోతే వారు విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
ఫైనల్ సెమిస్టర్ వారికి ఇక పరీక్షలే..
సాక్షి, హైదరాబాద్: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఉన్నత విద్యాశాఖ ఆలోచనకు భిన్నంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పందిం చింది. డిగ్రీ, పీజీ, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లోనూ యూజీసీ ఉత్తర్వులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంగళవారం నిర్ణయించింది. పరీక్షలు లేకుండా వారిని ప్రమోట్ చేయడం సరికాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు కేంద్రం ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. అయితే ఇదివరకే సంప్రదాయ డిగ్రీల్లో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు సెమిస్టర్ల పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులను పై సెమిస్టర్లకు ప్రమోట్ చేస్తూ యూనివర్సిటీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇంజనీరింగ్‌లోనూ ఒకటి నుంచి ఏడో సెమిస్టర్ వరకు విద్యార్థులను పైసెమిస్టర్లకు ప్రమోట్ చేసేలా చర్యలు చేపట్టింది. పీజీలోనూ అంతే. ఇలా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై సెమిస్టర్లకు ప్రమోట్ చేసింది. సెప్టెంబరులో 3.7 లక్షలమంది విద్యార్థులకు పరీక్షలు కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీలు, పీజీ కోర్సుల్లో ఫైనల్ సెమిస్టర్ చదివే విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్ మార్కులు, కిందటి సెమిస్టర్లలో వచ్చిన మార్కులు వేసి ప్రమోట్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపింది. అయితే, తాజాగా యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు దాదాపు 3.7 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. కేంద్రమే ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీఎంకు ఫైలు వెళ్లినా, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. మరోవైపు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లోనూ యూజీసీ జారీ చేసిన తాజా ఉత్తర్వులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంగళవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
జూలై 6 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్ : జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జూలైలోనే ఇతర అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. శనివారం హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపైనా, ప్రవేశ పరీక్షలపైనా చర్చించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా నిబంధనలకు లోబడి, యూనివర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడిం చారు. పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్, మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌కు 6.. అగ్రికల్చర్‌కు 3 సెషన్లు జూలై 6 నుంచి నిర్వహించే ఎంసెట్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 6, 7, 8 తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుందన్నారు. ఇక 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే 10న ఉదయం సెషన్ కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. 10న జరిగే లాసెట్‌కు విద్యార్థులు తక్కువే ఉంటారు కాబట్టి ఆ సదుపాయాలను కూడా దీనికి వినియోగించుకుంటామని చెప్పారు. ఇక రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్లో 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఎంసెట్‌కు 2,10,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,35,974 మంది ఇంజనీరింగ్ కోసం, 74,567 మంది అగ్రికల్చర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, కామన్ ఎంట్రెన్స్ టెస్టŠస్ దరఖాస్తుల గడువు వచ్చే నెల పది వరకు పెంచినట్టు పాపిరెడ్డి తెలిపారు. జూన్ 20 నుండి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామని, మొదట ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఇవి ముగిసిన వారం తర్వాత బ్యాక్ లాగ్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
స్పందించిన వారందరికి కృతజ్ఞతలు - మంత్రి సబితా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డి తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే వారిని పూల బొకేలతో కాకుండా, వాటికి బదులుగా నోట్‌పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరిన విషయం తెలిసిందే. ఆ పిలుపుకు స్పందించిన అభిమానులు, కార్యకర్తలు 30వేలకు పైగా పుస్తకాలు, పెన్నులు, బాక్స్‌లు అందించారు. వీటిని త్వరలోనే పాఠశాలలకు వెళ్లి పేద విద్యార్థులకు అందజేయనున్నారు. బొక్కేలు వద్దు.. పుస్తకాలు ఇవ్వాలన్న పిలుపునకు స్పందించిన వారందరికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. -
మహేందర్‌రెడ్డి, సబితారెడ్డిలను కలిసిన ఎమ్మెల్యే
చేవెళ్ల: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిలను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా, కోడలు భవాని నవాబుపేట ఎంపీపీగా, కొడుకు శ్రీకాంత్ మొయినాబాద్ జెడ్పీటీసీగా గెలుపొందడంతో వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల జెడ్పీటీసీ.. నూతనంగా టీఆర్ఎస్ జెడ్పీటీసీగా గెలిచిన మర్పల్లి మాలతీ క్రిష్ణారెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎంపీ జెడ్పీటీసీని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ కోసం కార్తీక్‌రెడ్డి సీటు త్యాగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాడు కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద మనస్సు చేసుకొని పోటీకి దూరమైన అమ్మ.. నేడు తల్లి బరిలోకి దిగేందుకు వీలుగా తన సీటును త్యాగం చేసిన కుమారుడు. ఇలా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్రెడ్డిలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లగా.. కార్తీక్‌కు చేవెళ్ల ఎంపీగా పోటీకి లైన్‌క్లియర్ చేసేందుకు సబిత తన మహేశ్వరం సీటును త్యాగం చేశారు. ఇప్పుడు మహేశ్వరం సెగ్మెంట్‌ను సబితకు కేటాయించగా.. కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కార్తీక్‌కు సీటు త్యాగం తప్పలేదు. పాత కథ పునరావృతం 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే మహేశ్వరం శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధనను కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తేవడంతో తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని త్యజించారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కార్తీక్‌కు లభించింది. ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కార్తీక్‌కు పరాభవం ఎదురైంది. దీంతో కొద్ధిరోజుల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సబిత.. ఈ సారి పాత స్థానమైన మహేశ్వరం నుంచి, కార్తీక్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ రెండు స్థానాల టికెట్లు తమకు ఖాయమని భావించారు. అయితే, అనూహ్యంగా ఈ సారి కూడా ‘ఫ్యామిలీకి ఒకే టికెట్’ షరతును వర్తింపజేయాలని హైకమాండ్ నిర్ణయించడంతో కార్తీక్ నీరుగారారు. అయితే, ఈ నిబంధన కార్యరూపం దాల్చదని చివరి నిమిషం వరకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నెరిపారు. సొంత పార్టీని ఒప్పించడానికి సతమతమవుతున్న ఆయనకు మిత్రపక్షం రూపంలో చుక్కెదురైంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని ఎగురేసుకుపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో కుంగిపోయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పడమేగాకుండా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, మహేశ్వరంలో అమ్మ పోటీ చేస్తుండడంతో తన రాజీనామా ప్రభావం ఆమెపై పడకూడదని భావించారు. రాజీనామా నిర్ణయంపై వెనుకడుగువేశారు. దీంతో నాడు కార్తీక్ కోసం తల్లి సీటును త్యాగం చేయగా.. ఈ సారి తల్లి కోసం తనయుడు సీటును త్యజించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
ఒక్కరికే అయితే ఎలా..
2014 సీన్ రిపీటవుతుందా..? మాజీ మంత్రి సబిత కుటుంబంలో ఈసారి కూడా ఒక్కరే పోటీచేస్తారా..? లేక ఇద్దరూ పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం కల్పిస్తుందా..? ఒకవేళ అనుకున్నది జరగకపోతే పటోళ్ల ఫ్యామిలీ ఆలోచన ఏంటి..? ఇవీ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు. కుటుంబం నుంచి ఒక్కరికే పోటీచేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుందన్న వార్తల నేపథ్యంలో సబిత ఎలాంటి వ్యూహంతో వెళతారనేది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, గతంలో పోటీ చేసిన వారికి మినహాయింపు ఉంటుందని, కొత్త వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తంమీద ఏఐసీసీ ఆలోచన జిల్లా కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుండడం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే నిబంధనతో సబిత పోటీకి దూరమయ్యారు. తాజాగా అదే నిబంధనను అధిష్టానం మరోసారి అమలు చేస్తుందేమోననే ఆందోళన సబిత కుటుంబంలో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సబిత మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా కుటుంబం నుంచి ఒక్కరే పోటీచేయాలని అధిష్టానం చెప్పడంతో ఆమె తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. తాను పోటీచేయకుండా తనయుడు కార్తీక్‌ను చేవెళ్ల లోక్‌సభ నుంచి బరిలోకి దించారు. ఇప్పుడు ఇద్దరూ పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. మహేశ్వరం నుంచి సబిత, రాజేంద్రనగర్ నుంచి కార్తీక్‌లు బరిలో నిలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కొంత కాలంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. కానీ, ఏఐసీసీ నుంచి అందిన తాజా ఖబర్ మళ్లీ సబితను డోలాయమానంలో పడేసింది. అయితే, అధిష్టానం విధించిన నిబంధనల్లోనూ కొన్ని సానుకూలతలు ఉండడం, తల్లీ, తనయులు అడిగే స్థానాల్లో సొంత పార్టీలో పెద్దగా పోటీ లేకపోవడంతో వారు బరిలో నిలిచే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. సుఖాంతమేనా..? కుటుంబంలో ఒకరికే టికెట్టు ఇవ్వాలనే నిబంధన సబిత ఫ్యామిలీకి వర్తించేలా కనిపించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అటు మహేశ్వరం.. ఇటు రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి ఒకరిద్దరూ మినహా చెప్పుకోదగ్గ నేతలు ఆసక్తి చూపడం లేదు. ఇది వీరికి కలిసొచ్చే అంశం. దీనికితోడు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా సబిత, కార్తీక్ ఇరువురు కూడా సీనియర్లు కావడం.. గతంలో పోటీచేసిన నేపథ్యం ఉండడంతో ఈ షరతుల నుంచి సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. కేవలం కొత్తవారికి మాత్రమే ఈ నిబంధనను వర్తింపజేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అధిష్టానం వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆంక్షలు అమలు చేస్తే మాత్రం సబిత కుటుంబీకులకు ఇబ్బందులు కలగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి అనివార్యమైతే ఈసారి తల్లి కోసం తనయుడు బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతారని తెలిసింది. గతంలో పోటీచేసిన కుటుంబాలకు కాకుండా కేవలం కొత్తవారికి మాత్రమే ఈ నిబంధన అమలు చేసే అవకాశముంది. తప్పదనుకుంటే అమ్మ కోసం ఈసారి టికెట్‌ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. – కార్తీక్‌రెడ్డి -
బీజేపీ కనుసన్నల్లో కేసీఆర్ ‘ఫ్రంట్’
మొయినాబాద్(చేవెళ్ల) : సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తుందని ఏఐసీసీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగంగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. శనివారం మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. అనంతరం అంజనాదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని.. రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు అదే గతి పడుతుందన్నారు. దేశంలో రాహుల్‌గాంధీ గ్రాఫ్ పెరుగుతుందని, దీన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే బీజేపీ కేసీఆర్‌ను పావుగా వాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లీటరు పెట్రోలు రూ.50 ఉంటే ఇప్పుడు రూ.80 దాటిందన్నారు. పెద్దనోట్లు రద్దుతో ఇప్పటికీ ఏటీఎంల్లో డబ్బులు లేని పరిస్థితి దాపురించిందని, కానీ కేసీఆర్ ఇచ్చే పెట్టుబడి చెక్కులు డ్రా చేసుకునేందుకు మాత్రం బ్యాంకుల్లో డబ్బులు అందుబాటులో ఉంచుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ప్రత్యేక రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు పూర్తి అన్యా యం జరుగుతోందని సబితారెడ్డి అన్నారు. జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుని నీళ్లు రాకుండా చేసిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు నీళ్లు తెస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని ఊసెత్తడంలేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కేంద్రం, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మద్దతు ధర పెంచి రైతులకు ఎకరాకు రూ.18 వేల లాభం వచ్చేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్, మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు మాణిక్‌రెడ్డి, గణేష్ గౌడ్, యాదయ్య, మాధవరెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్త లావణ్య, నాయకులు మాణెయ్య, శ్రీనివాస్‌యాదవ్, సతీష్, వడ్డెరాజు, మహేందర్, కృష్ణగౌడ్, అశోక్‌రెడ్డి, జొన్నాడ రాజు, మక్బుల్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడింది దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఏఐసీసీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యావత్ భారతదేశం ఎదిరిచూసిన కర్ణాటక ఫలితాలు సంతోషానిచ్చాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కాపాడాల్సిన గవర్నర్ కర్ణాటకలో ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా నిర్ణ యం తీసుకున్నారని.. దానికి సుప్రీంకోర్టు సరై న నిర్ణయం తీసుకుని ప్రజాస్వామాన్ని కాపాడిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జోన్ల విభజనతో వికారాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సబితారెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలన్నారు. -
‘కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తాము లక్ష కోట్లు ఇచ్చామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇవ్వలేదని అంటున్నారని, అసలు లెక్కలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అంటున్న కేసీఆర్.. మరి అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అమర వీరుల పునాదులపై టీఆర్ఎస్ అధికారం చెలాయిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతుంటే నిరుద్యోగులను కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కోరుతుంటే రైతులకు బేడీలు వేస్తున్నారని చెప్పారు. -
'ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే'
హైదరాబాద్: ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే కేసీఆర్ ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వడం లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో గురువారం వారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. మహిళా సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నికలో ప్రభుత్వ వైఫల్యాలను గ్రహించే ప్రజలు ఓటేస్తారని మాజీ మంత్రులు చెప్పారు. -
'శ్రీకాంతాచారి తల్లిని అవమానించారు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్రని, పార్టీని పాతరెయ్యడం ఎవరికీ సాధ్యంకాదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు టీఆర్ఎస్కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే మీకు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్య సుచరితా రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వకపోవడం మానవత్వమా అని నిలదీశారు. భర్తను కోల్పోయిన మహిళను పరామర్శించడం కనీస సంప్రదాయమని, సుచరితారెడ్డికి ఇచ్చే గౌరవం ఇదేనా అని లేఖలో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని, కానీ టీఆర్ఎస్ వాళ్లు మానవత్వం మరచి మరణించినవారిపై విమర్శలు చేయడం కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఇచ్చి అవమానించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఆమెను ఎమ్మెల్సీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓడిపోయిన వారికి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు వంటివారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని.. అమరవీరుల త్యాగం, ఓడిపోయిన శ్రీకాంతా చారి తల్లి గుర్తుకురాలేదా? ఇదేనా మానవత్వం అని దుయ్యబట్టారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేకనే 10 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు అక్కడ తిష్టవేశారని, దీన్నిబట్టి కాంగ్రెస్ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. అమలు కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్ఎస్ను పాతరేయడానికి పాలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు లేఖలో హెచ్చరించారు. -
'మాజీ మంత్రిపై విమర్శలు మానుకోవాలి'
శంషాబాద్ రూరల్: పదవులను కాపాడుకోవడానికి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతూ వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీపీ చెక్కల ఎల్లయ్య అన్నారు. మండలంలోని పెద్దషాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న మహేందర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అవినీతి కేసుల విషయంలో అధికారంలో ఉన్నట్టు మీ దగ్గర ఆధారాలుంటే కేసులో సమర్పించాలని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పును గట్టిగా వ్యతిరేకిస్తున్న సబితారెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో సాగునీటి శాఖ ఆధ్వర్యంలో రూ.కోట్లు ఖర్చు చేసి చెరువుల, కుంటలకు మరమ్మతులు చేపట్టామని, టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో ఏదో చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. భూదందాలకు ఎవరు పేరుగాంచారో మంత్రిగారి సొంత మండలానికి వెళ్తే జనాలు చెబుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇస్రానాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌నాయక్, సొసైటీ డైరక్టర్ నర్సింహ, వార్డు సభ్యులు శ్రీధర్, నారాయణ, నాయకులు గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు'
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ఆమె వర్గంగా పేరొందిన పలువురు నాయకులు సదస్సుకు డుమ్మా కొట్టారు. పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ఇటీవలి జరిగిన పలు సమావేశాల్లో సబితా ఉద్ఘాటించగా... తాజా సదస్సుకు దూరంగా ఉండటంపై అక్కడి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఇబ్రహీంపట్నంలో తలపెట్టిన సదస్సుకు పార్టీలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హాజరు కాలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నేతలంతా సదస్సుకు గైర్హాజరు అయినట్లు సమాచారం. -
కలిసిరాని ‘హోం’!
*రంగారెడ్డి జిల్లా నేతలకు అచ్చిరాని హోంమంత్రి పదవి *క్రమక్రమంగా తగ్గుతున్న రాజకీయ ప్రాభవం * ప్రభాకర్‌రెడ్డి నుంచి సబితారెడ్డి వరకూ ఇదే పరిస్థితి ‘హోం మినిస్టర్’ పదవి రంగారెడ్డి జిల్లా నేతలకు కలిసి రావట్లేదా.. ఈ శాఖలో కొనసాగిన మంత్రులు క్రమంగా కీలక పదవులకు దూరమవుతున్నారా.. క్రియాశీల రాజకీయాల్లో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నారా..? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం అవుననిపిస్తోంది. ఇటీవలీ వరకూ జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పట్లోళ్ల సబితారెడ్డి నుంచి అలనాటి హోంమంత్రి ప్రభాకర్‌రెడ్డి దాకా ఒకసారి పరిశీలిస్తే పై ప్రశ్నలకు మరింత స్పష్టత కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణలు ఇవిగో.. తనయుడి కోసం సబిత త్యాగం భర్త పి.ఇంద్రారెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన పట్లోళ్ల సబితారెడ్డి అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 2000 సంవత్సరంలో చేవెళ్ల ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొం దిన సబిత.. ఆ తర్వాత 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో గనులు, చేనేత, జౌళి శాఖ పదవులను ఆమె అధిష్టించారు. ఆ తర్వాత చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో 2009లో మహేశ్వరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి వైఎస్ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ తర్వాత కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ ఆమె హోంమంత్రిగా వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రానికి చివరి హోంమంత్రిగా నిలిచిపోయారు. అయితే అవినీతి అభియోగాల నేపథ్యంలో సబితపై సీబీఐ కేసు నమోదు చేయడంతో 2013 ఏప్రిల్‌లో పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న కోణంలో తనయుడు కార్తీక్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆమె పోటీ నుంచి అనివార్యంగా వైదొలగాల్సి వచ్చింది. క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ దూరం రాష్ట్రంలో బలీయమైన బీసీ నేతగా ఎదిగిన దేవేందర్ గౌడ్.. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవితో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1994లో మేడ్చల్ శాసనసభకు పోటీ చేసి చంద్రబాబు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1999 రెండోసారి ఎన్నికైన దేవేందర్.. చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అనూహ్యంగా టీడీపీ నుంచి బయటకొచ్చిన దేవేందర్.. నవతెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేస్తూ 2009లో ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటు కొత్త సమీకరణాలు.. అటు అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ దూరంగా ఉంటున్నారు. టీడీపీని వీడిన ఇంద్రారెడ్డి రాజకీయాల్లో చురుకైన వ్యక్తిగా పేరున్న పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1985లో చేవెళ్ల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కార్మిక శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1994లో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇంద్రారెడ్డిని హోంశాఖ వరించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడంతో ఇంద్రారెడ్డి ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని చేవెళ్ల నుంచి 1999లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం ఏప్రిల్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కందాడి ప్రభాకర్రెడ్డిదీ ఇదే పరిస్థితి..! టి.అంజయ్య ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన కందాడి ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామం. 1978లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1984లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పార్టీని వీడిన తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. -
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'
-
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'
హైదరాబాద్ : కార్యకర్తల అభీష్టం మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించటంపై కార్యకర్తలు గురువారం సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మహేశ్వరం నుంచే పోటీ చేసే విషయంలో అధిష్టానంతో మాట్లాడతానని సబితా ఈ సందర్భంగా కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఓ కార్యకర్త వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించగా, ఆ ప్రయత్నాన్ని సహచర కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.