సాక్షి, హైదరాబాద్: ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోగా రిజల్ట్స్ ప్రకటించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు గత రెండు రోజులుగా వేగం పుంజుకుంది. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ ను త్వరగా ముగించారు. ఇప్పటికే పలు దఫా లుగా ట్రయల్ రన్ చేశారు.
ఈ సందర్భంగా వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కరించా రు. ఈ ప్రక్రియలో గత రెండు రోజులుగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, దీన్నిబట్టి ఫలితాల వెల్లడికి ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫలితాల విడుదల తేదీ ఖరారు కాకున్నా, ఈ నెల 13లోగా కచ్చితంగా వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డ్ ముఖ్య అధి కారి తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనే.. పలు దఫాలుగా ఫలితాల విశ్లేషణ, క్రోడీకరణ, కోడింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
మంత్రి అనుమతి తర్వాత తేదీ ఖరారు..
ఫలితాల వెల్లడికి సంబంధించిన కసరత్తును సోమవారం నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు బోర్డు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ అధికారులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజు పరీక్షల ఫలితాల వెల్లడి సమాచారాన్ని తెలియజేస్తారు. మంత్రి అనుమతి తర్వాత ఫలితాల వెల్లడి తేదీని ఖరారు చేస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23,901 మంది హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలో పూర్తయింది. రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు ఎంసెట్‌తో పాటు, అనేక పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే!
Comments
Please login to add a commentAdd a comment