స్పందించిన వారందరికి కృతజ్ఞతలు - మంత్రి సబితా | Activists Responded To Minister Sabitha Indra Reddys Call | Sakshi
Sakshi News home page

స్పందించిన వారందరికి కృతజ్ఞతలు - మంత్రి సబితా

Sep 10 2019 5:42 PM | Updated on Sep 10 2019 5:42 PM

Activists Responded To Minister Sabitha Indra Reddys Call - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డి తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే వారిని పూల బొకేలతో కాకుండా, వాటికి బదులుగా నోట్‌పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరిన విషయం తెలిసిందే. ఆ పిలుపుకు స్పందించిన అభిమానులు, కార్యకర్తలు 30వేలకు పైగా పుస్తకాలు, పెన్నులు, బాక్స్‌లు అందించారు. వీటిని త్వరలోనే పాఠశాలలకు వెళ్లి పేద విద్యార్థులకు అందజేయనున్నారు. బొక్కేలు వద్దు.. పుస్తకాలు ఇవ్వాలన్న పిలుపునకు స్పందించిన వారందరికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement