సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌లో మాదిరి టెన్త్ ఫలితా ల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 87.61% మంది పాసయితే, బాలికలు 92.45% (4.84% ఎక్కువ) మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 90% ఉత్తీర్ణత నమోదయ్యింది. మొత్తం 3,007 స్కూళ్లు 100% ఫలితాలు సాధించాయి. 15 స్కూళ్ళలో సున్నా ఉతీర్ణత నమోదైంది. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకూ జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.పరీక్షల ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
హైదరాబాద్‌లో అతితక్కువ ఉత్తీర్ణత
మొత్తం 5,03,579 మంది టెన్త్ పరీక్షలు రాయగా 4,53,201 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,55,433 మంది బాలురకుగాను 2,23,779 మంది, 2,48,146 మంది బాలికలకుగాను 2,29,422 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలో సిద్దిపేట (97.85 శాతం), నిర్మల్ (97.73 శాతం) మొదటి, రెండో స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉత్తీర్ణత (79.63 శాతం) నమోదైంది. రెసిడెన్షియల్ పాఠశాలలు 99.32 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 75.68 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
15 రోజుల్లోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్..
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు జూలై 18లోగా సంబంధిత పాఠశాలలో పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఠీఠీఠీ. bట్ఛ. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn వెబ్‌సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్కుల రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక క్లాసులు: మంత్రి సబిత
టెన్త్ ఫలితాలపై మంత్రి సబిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల దాకా వారానికి రెండు రోజుల పాటు ప్రత్యేక క్లాసులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో అతి తక్కువ ఫలితాలు నమోదవ్వడంపై లోతైన పరిశీలన చేపడతామని చెప్పారు.
ఉత్తీర్ణత ఇలా...
మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత శాతం
రెసిడెన్షియల్ 99.32
సోషల్ వెల్ఫేర్ 98.1
బీసీ వెల్ఫేర్ 97.45
మోడల్ స్కూల్స్ 97.25
ట్రైబల్ వెల్ఫేర్ 95.83
రెసిడెన్షియల్ (మినీ) 93.73
కేజీబీవీ 93.49
ప్రైవేటు 91.31
ఆశ్రమ 88.7
జెడ్పీ స్కూల్స్ 87.13
ఎయిడెడ్ 85.37
ప్రభుత్వ స్కూల్స్ 75.68
మొత్తం 90.00
Comments
Please login to add a commentAdd a comment