సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ పొలిటికల్ వార్‌కు దిగుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన మంగళవారం లేఖ రాశారు.
2020లో అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటన చేసినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని మండిప డ్డారు. రూ.లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల్లేక వయోపరి మితి దాటిపోతూ లక్షలాదిమంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయో చెప్పాలని నిలదీశారు.
అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ఆరు నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఓసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథాచేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు
Comments
Please login to add a commentAdd a comment