సాక్షి, హైదరాబాద్: గతంలో జారీ చేసిన తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. కొత్త నోటిపికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ పేర్కొంది. 11 వేల 62 కొత్త పోస్టులతో రేపు డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది.
మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో రెండు రోజులు ఆలస్యమయ్యింది. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment