
ఈ ఏడాదే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం
తల్లిదండ్రులే పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వొద్దన్నారు
గత సర్కారులో రూ.1,300 కోట్లు వృథా
శాసన మండలిలో మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి: ‘ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్‌లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్‌కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం’ అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. డీఎస్సీకి కట్టుబడి ఉన్నామని, ఈ సంవత్సరమే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.
బుధవారం శాసన మండలిలో ‘విద్యా రంగంలో సంస్కరణల’పై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడం ద్వారా రూ.1,300 కోట్లు వృథా చేసిందని విమర్శించారు. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం సరికాదని నాతో చెప్పారు. మళ్లీ మీరు ట్యాబ్స్ ఇవ్వకండన్నారు. నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి దేవాన్‡్ష ఉన్నాడు. తనకు ఫోన్ ఇవ్వం. ఐప్యాడ్ లేదు.
వారానికి రెండు గంటలు ఒక సినిమా చూడొచ్చు. కానీ, టెక్నాలజీ యుగంలో హోం వర్క్, రీసెర్చ్ ఆన్‌లైన్ చేయాలంటే డెస్‌్కటాప్ (కంప్యూటర్)ని అది కూడా సూపర్‌వైజ్ చేసి∙యాక్సెస్ ఇస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. సీబీఎస్సీ మోడల్ ఎగ్జామ్ విధానంపై చాలా ప్రిపరేషన్ అవసరమని, అది పూర్తి అయిన తర్వాతే కొనసాగించేందుకు వాయిదా వేశామన్నారు. స్థానికంగా విద్యార్థులు ఇంగ్లిష్ లో వెనుకబడితే గత ప్రభుత్వం టొఫెల్‌తో ఇబ్బంది పెట్టిందన్నారు.
ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై ఉపాధ్యాయులకు సెలవుల్లోనే శిక్షణ తరగతులు పెడతామని, వర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకురావడంతో పాటు డీప్‌టెక్ వర్సిటీని నెలకొల్పుతామని చెప్పారు.
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీని డిజిటల్ వర్సిటీగా మారుస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖను నిర్వహించడం ఎంతో సులువని, అయితే తాను కఠినమైన విద్యా శాఖను తీసుకున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment