
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. గురువారం డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌లో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నోటిఫికేషన్ సందర్బంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరంలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
పోస్టుల వివరాలు..
స్కూల్ అసిస్టెంట్ 2629,
లాంగ్వేజ్ పండిట్ 727,
ఎస్జీటీ 6508,
పీఈటీ 182.
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.
— Telangana CMO (@TelanganaCMO) February 29, 2024
11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.
హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య. pic.twitter.com/4jcijEsmpq