సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను కట్టుదిట్టం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాల్లో సర్విస్ కమిషన్ల ను అధ్యయనం చేయాలని ఆదేశించింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్సీ) కార్యాలయానికి వెళ్లి చైర్మన్, కార్యదర్శులతో భేటీ అయ్యారు.
మెరుగ్గా ఉందని చెప్పినా..
ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్విస్ కమిషన్‌లతో పోలిస్తే టీఎస్‌పీఎస్సీ మెరుగ్గా ఉందని, ఆధునిక పరిజ్ఞానం వినియోగంలో ముందుందని అభిప్రాయాలు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా పనిచేసిన ఘంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని సర్వీస్ కమిషన్ల తో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా కూ డా వ్యవహరించారు.
దరఖాస్తుల నుంచి పరీక్షలు, నియామకాల దాకా టీఎస్‌పీఎస్సీ తీసుకువచ్చిన ఆన్‌లైన్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుకరించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నా యి. అయితే పలు పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. వరుసగా పరీక్షల రద్దు కలకలం రేపింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది.
కఠిన నిబంధనలు.. కొత్త సాంకేతికతతో..
టీఎస్‌పీఎస్సీలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి.. అత్యాధునిక సాంకేతికతను తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కమిషన్ నుంచి ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కోసం టెక్ దిగ్గజాల సహకారం తీసుకోనుంది. కమిషన్‌లో కంప్యూటర్లను సైతం పూర్తిగా మార్చేసి.. సరికొత్త, భద్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగుల బయోమెట్రిక్ ఉంటేనే కంప్యూటర్లు పనిచేసే లా సాంకేతికతను వినియోగించాలని భావిస్తోంది. ఇప్పటివరకు కేరళ, ఇతర రాష్ట్రాల్లో పబ్లిక్ సర్విస్ కమిషన్ల పనితీరును రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. మరింత లోతుగా అధ్యయనం జరిపాక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment