UPSC chairman
-
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను కట్టుదిట్టం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాల్లో సర్విస్ కమిషన్ల ను అధ్యయనం చేయాలని ఆదేశించింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్సీ) కార్యాలయానికి వెళ్లి చైర్మన్, కార్యదర్శులతో భేటీ అయ్యారు. మెరుగ్గా ఉందని చెప్పినా.. ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్విస్ కమిషన్లతో పోలిస్తే టీఎస్పీఎస్సీ మెరుగ్గా ఉందని, ఆధునిక పరిజ్ఞానం వినియోగంలో ముందుందని అభిప్రాయాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా పనిచేసిన ఘంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని సర్వీస్ కమిషన్ల తో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా కూ డా వ్యవహరించారు. దరఖాస్తుల నుంచి పరీక్షలు, నియామకాల దాకా టీఎస్పీఎస్సీ తీసుకువచ్చిన ఆన్లైన్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుకరించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నా యి. అయితే పలు పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. వరుసగా పరీక్షల రద్దు కలకలం రేపింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. కఠిన నిబంధనలు.. కొత్త సాంకేతికతతో.. టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి.. అత్యాధునిక సాంకేతికతను తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కమిషన్ నుంచి ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కోసం టెక్ దిగ్గజాల సహకారం తీసుకోనుంది. కమిషన్‌లో కంప్యూటర్లను సైతం పూర్తిగా మార్చేసి.. సరికొత్త, భద్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల బయోమెట్రిక్ ఉంటేనే కంప్యూటర్లు పనిచేసే లా సాంకేతికతను వినియోగించాలని భావిస్తోంది. ఇప్పటివరకు కేరళ, ఇతర రాష్ట్రాల్లో పబ్లిక్ సర్విస్ కమిషన్ల పనితీరును రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. మరింత లోతుగా అధ్యయనం జరిపాక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని అధికారులు చెప్తున్నారు. -
యూపీఎస్సీ చైర్మన్‌గా సక్సేనా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ వినయ్ మిట్టల్ పదవీకాలం ఈనెల 19తో పూర్తికానుండటంతో ఆయన స్థానంలో సక్సేనా జూన్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ లేదా పదవీకాలం పూర్తయ్యే 2020, ఆగస్టు 7వరకూ సక్సేనా యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు’ అని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 1978 బ్యాచ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి అయిన సక్సేనా భారత నిఘాసంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)తో పాటు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో పనిచేశారు. -
యూపీఎస్సీ చైర్మన్‌గా అల్కా సిరోహి
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అల్కా సిరోహి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 3 వరకు ఆమె చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 2012 జనవరి నుంచి అల్కా కమిషన్ సభ్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ దీపక్ గుప్తా తన పదవీ కాలం పూర్తవడంతో ఆమె స్థానంలో అల్కాను నియమించారు. కమిషన్‌లో సభ్యురాలిగా చేరకముందు అల్కా కేంద్ర వ్యక్తిగత, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు.