![Arvind Saxena appointed acting UPSC chief - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/11/saksena.jpg.webp?itok=em3th_sA)
అరవింద్ సక్సేనా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ వినయ్ మిట్టల్ పదవీకాలం ఈనెల 19తో పూర్తికానుండటంతో ఆయన స్థానంలో సక్సేనా జూన్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ లేదా పదవీకాలం పూర్తయ్యే 2020, ఆగస్టు 7వరకూ సక్సేనా యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు’ అని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 1978 బ్యాచ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి అయిన సక్సేనా భారత నిఘాసంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)తో పాటు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment