Aravind
-
కేజ్రీ యమునా జలం తాగాలి: రాహుల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే దుర్గంధపూరిత నీరు తాగాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. హౌజ్ కాజీ చౌక్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 2020 అల్లర్ల బాధితులను తరఫున తనతోపాటు తన పార్టీ మాత్రమే మద్దతుగా నిలిచిందని, అణచివేతకు గురయ్యే వారికి ఇకపైనా దన్నుగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రేమ, సోదరభావాన్ని పంచే కాంగ్రెస్ కావాలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే బీజేపీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు. -
బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
Arvinder Lovely, Who Quit As Delhi Congress Chief Twice, Rejoins BJPలోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ తాజాగా బీజేపీలో చేరారు. శనివారం కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీ, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, ఢిల్లీ పార్టీ చాఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో తీవ్ర అసహనానికి గురైన అరవిందర్ ఇటీవల ఢిల్లీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. అయితే నిన్నటి మొన్నటి వరకు కూడా బీజేపీలో చేరడం లేదని తెలిపిన ఆయన..నేడు కాషాయ కండువా కంపుకోవడం ఆసక్తికరంగా మారింది.బీజేపీలో చేరిన తర్వాత లవ్లీ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరుపున పోరాడే అవకాశం లభించిందని, దేశంలో అఖండ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.అయితే 2015లోనే అరవిందర్ ఢిల్లీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.#WATCH | Congress leader Arvinder Singh Lovely joins BJP at the party headquarters in Delhi in the presence of Union Minister Hardeep Singh Puri.Arvinder Singh Lovely resigned from the position of Delhi Congress president on April 28. pic.twitter.com/3OJXisQIEd— ANI (@ANI) May 4, 2024 -
కాంగ్రెస్‌కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్‌తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. Arvinder Singh Lovely resigns from the position of Delhi Congress president."The Delhi Congress Unit was against an alliance with a Party which was formed on the sole basis of leveling false, fabricated and malafide corruption charges against the Congress Party. Despite that,… https://t.co/Y1A360fuut pic.twitter.com/hLP9RtnzUE— ANI (@ANI) April 28, 2024 -
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘ఏ మాస్టర్ పీస్’
మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సుకు పూర్వజ్. ఆయన తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. ఏ మాస్టర్ పీస్ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా "ఏ మాస్టర్ పీస్" ఉండబోతోంది. -
ఈసారి మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం.. కానీ రాజపూజ్యం ఎవరికో?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జగిత్యాల, మెట్పల్లి నిజామాబాద్ పరిధిలోకి, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ కరీంనగర్ పరిధిలోకి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. మూడు స్థానాల్లోనూ అభ్యర్థులకు ఈ ఎన్నికలు చాలా కీలకం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా వీటిని కై వసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండింటినైనా గెలిచి, తిరిగి పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సామాన్యులుగా రంగంలోకి దిగిన బండి సంజయ్(కరీంనగర్) సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఓడించి, ధర్మపురి అర్వింద్(నిజామాబాద్) సిట్టింగ్ ఎంపీ కవితపై పైచేయి సాధించి, అనూహ్య విజయాలను అందుకున్నారు. ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తోంది. నినాదాలు.. మేనిఫెస్టోలు.. నిజామాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. వా రు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్(బీఆర్ఎస్), ధర్మపురి అర్వింద్(బీజేపీ), తాటిపర్తి జీవన్‌రెడ్డి(కాంగ్రెస్)లు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ(కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ), కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)లు బరిలో ఉన్నారు. కీలకమైన కరీంనగర్ నుంచి బండి సంజయ్(బీజేపీ), బి.వినోద్‌కుమార్(బీఆర్ఎస్)లు బరిలో ఉండగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దేశభక్తి, అయోధ్య రామాలయం, ఉమ్మడి జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు, హిందుత్వమే ఏజెండాగా బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెట్టిన 6 గ్యారంటీలనే కాంగ్రెస్ నమ్ముకుంది. దీనికితోడు కేంద్ర నాయకత్వం ప్రకటించిన ‘పంచన్యాయ్’, రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో తమకు మేలు చేస్తాయని భావిస్తోంది. జాతీయ పా ర్టీలు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవని, తెలంగా ణగళం పార్లమెంట్లో వినిపించాలంటే.. తప్పకుండా తమను గెలిపించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈసారి ఖర్చు రూ.కోట్లలోనే.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల ఖర్చు క్రితంసారితో పోలిస్తే పెరిగేలా ఉంది. ప్రచారం, పెట్రోల్, భో జనం, సభల నిర్వహణ ఖర్చు అమాంతం పెరిగింది. ఇక, జన సమీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన అభ్యర్థుల వ్యయం శ్రీ క్రోధి నా మ సంవత్సరంలో రూ.కోట్లలో ఉండనుందని స మాచారం. దీనికి ప్రతిఫలంగా ప్రజలు ఓట్ల రూపంలో ఆదాయం ఇవ్వనున్నారు. ఇది ఎవరికి అధికంగా ఉంటే వారినే రాజయోగం వరించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తమ జాతకాలను పరీక్షించుకుంటున్నారు. ఎవరి ఆదాయ, వ్యయాలు ఎంత? ఎవరి రాజపూజ్యం ఎంత? ఎవరికి రాజయోగం ఉంది? తదితర వివరాలను పండితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవి చదవండి: బస్సు యాత్రతో ‘కారు’ ప్రచారం -
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
ధర్మపురి అరవింద్‌కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్‌కు టికెట్ ఇవ్వద్దని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిలో సతీష్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి అరవింద్‌కు టికెట్ ఇవ్వద్దని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ‘వి వాంట్ జస్టిస్, అహంకార అరవింద్ మాకొద్దు.. అరవింద్ డౌన్ డౌన్ , అరవింద్ కీ హటావో బీజేపీ బచావో’ అంటూ మెడలో దండలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన చేశారు. ‘ఎంపీగా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు. గత 30 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదు. ఈసారి అరవింద్‌కు టికెట్ ఇస్తే ఒడిస్తాం’ అని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు -
కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్‌తో డేటింగ్లో కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్‌ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్‌స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్‌గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్‌లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
నిజామాబాద్ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న పసుపు రైతులు
-
ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా
-
రాజకీయాలకు కళంకం అరవింద్ జీవితం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
-
నా గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతా : కవిత
-
ఇందూరు బీజేపీలో ఇంటిపోరు.. ఎంపీ అరవింద్‌ను టార్గెట్ చేశారా?
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయాల్లో అలజడి పెరుగుతోంది. పోటీ చేయాలనుకునేవారిలో టెన్షన్ మొదలవుతోంది. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. నిజామాబాద్ కమలం పార్టీలో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి సిటింగ్ ఎంపీకి, మాజీ ఎమ్మెల్యేకు మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. ఎంపీ అరవింద్ వర్సెస్ యెండల.. నిజామాబాద్ జిల్లా కాషాయ సేనలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. సిటింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీలో యెండల రాష్ట్ర నాయకుడైనా.. స్థానికంగా ఎంపీ అరవింద్ హవా ముందు ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఇరు వర్గాల మధ్య చాన్నాళ్ళుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. యెండల ప్రధాన అనుచరుడిగా ఉన్న ప్రసాద్ పటేల్‌పై వచ్చిన ఆరోపణలతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పటేల్‌పై వేటు వేయడానికి అరవింద్ కారణమని యెండల వర్గీయుల ఆరోపణ. ప్రసాద్ పటేల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. అతను తన హిందూత్వను వదల్లేదు. గోరక్షణ కోసం, లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. సున్నితమైన అంశాల్లో వీధికెక్కి పోరాడటం, సోషల్ మీడియాలో పోస్టులతో ఆయన మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. బల ప్రదర్శనలకు సై.. తన అనుచరుడైన ప్రసాద్ పటేల్ అంశాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల అనేకసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం బీజేపి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ర్యాలీ బయటకు చూస్తే ప్రసాద్ పటేల్‌పై పెట్టిన కేసులను ఎత్తేయాలని పోలీసులను డిమాండ్ చేయడంతో పాటు.. యెండల బలప్రదర్శన అనే వాదన ఇప్పుడు నిజామాబాద్‌లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా లేదా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న యెండల స్థానికంగా తన ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వేళ.. ప్రసాద్ పటేల్ అంశాన్ని ఎజెండాగా తీసుకుని పోలీసుల పేరుతో అధికార పార్టీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసినప్పటికీ అందులో అంతర్లీనంగా తన స్టామినా చాటుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎవరికి ఎవరు చెక్? తనకు చెక్ పెట్టాలనుకుంటున్న ఎంపీ అరవింద్‌కు తానేంటో చూపించడానికే యెండల ఈ ర్యాలీని ఉపయోగించుకున్నారని నిజామాబాద్‌లో టాక్. ఆర్మూర్ నుంచి అరవింద్ అసెంబ్లీ బరిలోకి దిగుతాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. గతంలో అక్కడ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఈసారి అరవింద్ వల్ల తనకు టిక్కెట్ రాదేమో అన్న అనుమానంతో ఉన్న వినయ్ రెడ్డి వంటి నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకే పార్టీలో ఉంటూ, ఒకే ప్రాంతానికి చెందిన నాయకుల మధ్య వైరం పార్టీకి మంచిది కాదని కమలం నేతలు సలహా ఇస్తున్నారట. అయితే రాజకీయ ఉనికి చాటుకునే సందర్భంలో ఇటువంటి పోరాటాలు, వైరాలు తప్పవంటున్నారు. -
తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాల ని జగిత్యాల రైతుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు విజ్ఞప్తి చేసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వచ్చిన రైతుల బృందం గురువారం బీజేపీ ఎంపీ అర్వింద్ నేతృత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, సహాయమంత్రి కైలాశ్ చౌదరిలను కలసి అనేక అంశాలపై చర్చించింది. అనంతరం అర్వింద్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతుల బృందానికి అధ్యక్షత వహించిన పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు పంటకు మద్దతు ధర, చెరకు పంట పునరుద్ధరణ, మామిడి మార్కెట్ అభివృద్ధి, మిర్చి మార్కెట్ ఏర్పాటు, వాలంతరి ప్రదర్శన క్షేత్రం అభివృద్ధి, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం, రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర వాటాగా ఉన్న 30 శాతాన్ని రైతులకు మేలు చేయడానికి 50 శాతం భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి తోమర్ హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే నెల 10న జగిత్యాలలో జరగనున్న రైతు సభలో కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి సమక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలసి బీజేపీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇథనాల్ ప్లాంట్స్ పెట్టడంలేదని..ప్రైవేట్ వారిని కూడా పెట్టనివ్వడం లేదని విమర్శించారు. -
బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ నాయకులు దాడి
-
బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ నాయకులు దాడి
-
‘టీఆర్ఎస్ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’
సాక్షి,రామాయంపేట (మెదక్): వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను గొంతు కోసుకుంటానని, టీఆర్ఎస్కు ఒక్కరూ కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. ఇటీ వల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా రామా యంపేటకు చెందిన సంతోష్ కుటుంబాన్ని అర్వింద్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లీ కొడుకులు కామారెడ్డి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడ్డారంటే ఇక్కడి పోలీసులు, అధికార పార్టీ నాయకులపై వారికి అను మానాలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మృతులకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. -
బ్రేకేయకున్నా ఢీకొట్టలే!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలు.. వికారాబాద్ రైల్వే సెక్షన్ పరిధిలోని గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం.. ఒకవైపు నుంచి రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అదే ట్రాక్‌పై ఎదురుగా లోకో ఇంజిన్ 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.. రెండింటి మధ్య దూరం 600 మీటర్లే.. అయినా దేనికీ బ్రేకులు వేయలేదు.. కానీ చూస్తుండగానే రెండూ ఆటోమేటిగ్గా వేగం తగ్గించుకున్నాయి. రెండింటి మధ్య 380 మీటర్ల దూరం ఉందనగా ఆగిపోయాయి. అంటే ఎదురెదురుగా దూసుకొస్తున్న రైళ్లు బ్రేకులతో ప్రమేయం లేకుండా, లోకో పైలట్ల (రైలు నడిపేవారు) జోక్యం లేకుండానే ఆగిపోయి ప్రమాదాన్ని నివారించాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘కవచ్’ పరిజ్ఞానమే దీనికి కారణం. తొలుత టి–కాస్ పేరుతో రూపొందిన ఈ పరిజ్ఞానంపై ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మేకిన్ ఇండియాలో భాగంగా ‘కవచ్’ పేరిట పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. మరో విశేషం ఏమిటో తెలుసా.. ఇలా ఒకేట్రాక్‌పై దూసుకొచ్చిన ఓ రైలులో స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉండగా.. ఎదురుగా వచ్చిన ఇంజన్లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ ఉన్నారు. త్వరలోనే ‘కవచ్’ను దేశవ్యాప్తంగా రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీనిని స్వయంగా పరిశీలించేందుకు రైల్వే మంత్రి ఈ పరీక్షలో పాల్గొన్నారు. కవచ్ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయిందని చెబుతున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రంలో ఎంపీ అర్వింద్ తదితరులు కిలోమీటరుకు రూ. 50 లక్షల ఖర్చు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ పూర్తిస్థాయిలో విజయవంతం కావటం గర్వకారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. ‘‘కవచ్ అద్భుతంగా పనిచేస్తుందని ధీమాగా చెప్పగలను. అందుకే బహిరంగంగా, అందరి సమక్షంలో ప్రయోగించి చూశాం. దీన్ని దేశవ్యాప్తంగా.. ఏటా నాలుగైదు వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేస్తాం. కవచ్ పరిజ్ఞానం కోసం కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అదే యూరోపియన్ పరిజ్ఞానానికైతే కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా కవచ్ వాటి కంటే సమర్థవంతమైనది. అందుకే దీన్ని సగర్వంగా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తాం’’ అని రైల్వే మంత్రి చెప్పారు. అన్ని రూల్స్.. ఆటోమేటిగ్గా.. ►తొలుత రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ విడివిడిగా రెండు రైళ్లలో బయలుదేరారు. సనత్‌నగర్ దాటాక ఒకేట్రాక్లో ముందు మంత్రి ఉన్న రైలు, వెనుక బోర్డు చైర్మన్ ఉన్న రైలు ప్రయాణించాయి. ముందున్న రైలుకు వెనకాల ఉన్న రైలు చేరువగా వచ్చే ప్రయత్నం చేసింది. లోకో పైలట్ బ్రేకు వేయకున్నా.. వెనకాల ఉన్న రైలు దానంతట అదే వేగం తగ్గి, ఆగిపోయింది. ►ఒకచోట మధ్యలో రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలట్ బ్రేకు వేయకుండా ముందుకు నడిపించారు. కానీ ఆటోమేటిగ్గా బ్రేకు పడి రైలు ఆగిపోయింది. ►లెవల్ క్రాసింగ్ వద్ద నిర్ధారిత దూరం నుంచి హారన్ మోగించాలి. కానీ లోకోపైలట్ మోగించకున్నా.. నిర్ధారిత ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్‌గా రైలు కూత వేసింది. ►లూప్లైన్లో వెళ్లేప్పుడు గంటకు 20 కిలోమీటర్ల లోపు వేగం ఉండాలన్న నిబంధన ఉంది. వేగంగా నడిపేందుకు లోకో పైలట్ ప్రయత్నించినా రైలు దానంతట అదే వేగం తగ్గింది. ►పెద్ద మలుపులో రైలుగరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించొద్దు. అంతకన్నా వేగంగా నడిపితే రైలు ఆటోమేటిగ్గా ఆ వేగానికి తగ్గిపోయింది. ఎలా పనిచేస్తుంది? రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’ కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందిం చింది. కొన్ని దేశీ పరిశ్రమలు పరికరాలను తయారు చేసి సమకూర్చాయి. 2013లో ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం(టీకాస్)పేరుతో.. వికారాబాద్–వాడీ–సనత్ నగర్ సెక్షన్ల మధ్య ప్రయోగాలు చేసి, అభి వృద్ధి చేశారు. ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వేస్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్ పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాబ్‌లను అమర్చుతారు. రేడి యో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాం తాల్లో 40 మీటర్ల ఎత్తు ఉండే టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజ్లతో అన్నిం టినీ అనుసంధానిస్తారు. ఈ మొత్తం పరి జ్ఞానం ఎప్పటికప్పుడు రైళ్లను పరిశీలిస్తుం టుంది. లోకోపైలట్ ముందుండే స్క్రీన్‌లో సమాచారం డిస్ప్లే అవుతుంది. మంచు, రాత్రి సమయాలు, ఇతర కారణాలతో మసకగా ఉన్నప్పుడు.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏ చిన్న సమస్య చోటుచేసుకున్నా.. వెంటనే లోకోపైలట్‌ను, స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా పరస్పరం సమాచారాన్ని కూడా పంపించుకోవచ్చు. కొత్త ధైర్యం వచ్చింది ‘‘కవచ్‌తో ఎంతో దూరం నుంచి కూడా సిగ్నళ్లను తెలుసుకోగలం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులకు పూర్తి ధైర్యం, నమ్మకాన్ని కల్పించగలం. మాకు కూడా కొత్త ధైర్యం వచ్చింది’’ – జీఎస్ ప్రసాద్, రైలు లోకో పైలట్ -
సోషల్ మీడియాపై స్పెషల్ నజర్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ చేస్తున్న దాడిని చట్టపరంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. వ్యక్తిగత దూషణలు, కార్టూన్లు, క్యారికేచర్లు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు మొదలుకుని స్థానిక బడా, చోటా నేతలు పెడుతున్న పోస్ట్‌లు అభ్యంతరకరంగా పేర్కొంటూ వాటిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఇటీవల ఫిర్యాదు చేసింది. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ వ్యక్తులు, గ్రూప్‌ల పేరిట ఏర్పాటు చేసిన ఖాతాలను గుర్తించే పనిలో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నిమగ్నమైంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యపదజాలంతో దూషణలు, కార్టూన్లు, కేరికేచర్లు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై దృష్టి సారించింది. ఎక్కడికక్కడ ఫిర్యాదులు.. ఎప్పటికప్పుడు బ్లాక్ దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ ఆదేశించింది. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలియచేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. గతంలో బీజేపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్‌తో పాటు మరికొందరిపై పోలీసు కేసులు నమోదు కాగా, వనస్థలిపురం పోలీసు స్టేషన్‌తో పాటు ఒకటి రెండు చోట్ల నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కూడా టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. చట్టపరమైన చర్యలతో పాటు ఆయా సోషల్ మీడియా వేదికల్లో ఉన్న సాంకేతిక అవకాశాలను కూడా ఉపయోగించుకుని అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలు తదితరాలను బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేయాలని పార్టీ సోషల్ మీడియా గ్రూప్‌లకు టీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారానే ఎదురుదాడి రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. వారిపై ఎదురుదాడికి దిగాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించిన టీఆర్ఎస్ ఇకపై.. విపక్షాలు ప్రత్యేకించి బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టడంతో పాటు ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే గ్రామ స్థాయి మొదలుకుని జిల్లా, పట్టణ స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటయ్యాయి. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధంగా సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ తాజాగా నిర్ణయించింది. తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టం సోషల్ మీడియా వేదికగా విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డులేకుండా పోయింది. జాతీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు కూడా తమ స్థాయిని మరిచి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వీటిపై చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. సోషల్ మీడియాలో వీరి ఆగడాలను అడ్డుకునే వారికి వస్తున్న బెదిరింపులపై కూడా ఫిర్యాదు చేయాలని మా సోషల్ మీడియా కమిటీల బాధ్యులకు చెబుతున్నాం. – వై.సతీష్‌రెడ్డి, స్టేట్ కన్వీనర్, టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ -
‘దిశ’ పోలీసు క్షతగాత్రుల రిపోర్టుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్లో క్షతగాత్రులైన పోలీస్ కానిస్టేబుల్ ఏ అరవింద్‌గౌడ్‌కు గచ్చబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్ రచ్చను వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ పలు ప్రశ్నలను సంధించారు. అరవింద్ చికిత్స ఫైనల్ రిపోర్ట్లన్నీ విచారణ అధికారికి ఒరిజినల్స్‌తో సహా సమర్పించామని, తమ వద్ద ఎలాంటి పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు లేవని రాజేశ్ వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్ మెడికో లీగల్ కేస్(ఎంఎల్సీ)లో కూడా సీటీ స్కాన్ కాపీలు ఆసుపత్రి వద్ద ఉండవని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గచ్చిబౌలి ఆసుపత్రిలో 2019, డిసెంబర్ 6న ఉదయం 10:18 గంటలకు బెడ్ నంబర్ 11 కేటాయిస్తూ అడ్మిట్ చేసుకున్నట్లు ఓపీ రికార్డ్‌లో ఉంది. కానీ, షాద్‌నగర్ ఇన్స్పెక్టర్ నుంచి ‘వైద్యం సమాచార లేఖ’ మాత్రం 2019, డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు చేరింది. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.. తెలియదని సమాధానమిచ్చారు. అతనికి ఐసీయూలో చికిత్స చేయాల్సినంత గాయాలేవీ కాలేదని చెప్పారు. చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి.. డిశ్చార్జి సమ్మరీలో ఎక్స్‌రే గురించి ఎందుకు రాయలేదని ప్రశ్నిచగా.. అందులో పేషెంట్ చికిత్స తాలూకు అన్ని వివరాలను నమోదు చేయమని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మరణించిన చెన్నకేశవులు ఎడమ చేతిలో లభ్యమైన కాటన్ స్వాబ్‌ను పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బాలిస్టిక్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వీ వెంకటేశ్వర్లు.. కమిషన్ ముందు వాం గ్మూలం ఇచ్చారు. న్యూఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీబీఐ) బాలిస్టిక్ రిటైర్డ్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడీ ఎన్బీ బర్ధన్‌ను కూడా కమిషన్ విచారించింది. కాగా, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్‌లకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పి.విశ్వక్‌సేన్‌రెడ్డిని సిర్పుర్కర్ కమిషన్ గురువారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ ఆయనను ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 6న ఉదయం 8 గంటలకు కేర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్‌సేన్‌రెడ్డి వివరించారు. కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స చేశామని కమిషన్‌కు తెలిపారు. ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్‌లోనూ నమోదు చేశామని వివరించారు. నొప్పి, వాపును తగ్గించే వోవెరాన్, టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుల్ బయటే ఇప్పించుకున్నారని, కేర్ ఆస్పత్రిలో ఇవ్వలేదని తెలిపారు. గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్‌లో నమోదు చేశానని సమాధానమిచ్చారు. ‘సంచలనం సృష్టించిన లేదా మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉంటుందని.. మరి మీరెందుకు నమోదు చేయలేద’ని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం చెప్పలేనంటూ డాక్టర్ విశ్వక్‌సేన్‌రెడ్డి దాటవేశారు. అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్సేన్.. కేర్ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు. షాద్‌నగర్ సీహెచ్‌సీ రికార్డ్‌లో కానిస్టేబుల్ స్పృహ కోల్పోయారని ఉందని, అందువల్లే ఐసీయూలో అడ్మిట్ చేశామని, అంతే తప్ప చికిత్సలో ఆ రికార్డులను అనుసరించలేదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు. ఫోన్లో చెప్తే రికార్డ్‌లో నమోదు మంగళవారం షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ (సీహెచ్‌సీ) సర్జన్ గోనె నవీన్ కుమార్ విచారణ అసంపూర్తిగా ముగియగా.. గురువారం ఉదయం తిరిగి కొనసాగించారు. కేర్ ఆస్పత్రి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు సంబంధించిన డిశ్చార్జి సమ్మరీని ఎవరూ తన వద్దకు తీసుకురాలేదని.. ఎవరో ఫోన్లో చెబితే ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేశానని నవీన్‌కుమార్ తెలిపారు. డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రులకు ఎక్స్‌రే తీసినట్టు లేదని.. కానీ డాక్టర్స్ నోట్లో మాత్రం ఉందేమిటని ప్రశ్నించగా.. ‘డాక్టర్స్ నోట్‌ను ఇప్పుడే తొలిసారి చూస్తున్నా’నని నవీన్ సమాధానమిచ్చారు. కేర్ ఆస్పత్రి రికార్డుల్లో అరవింద్‌గౌడ్‌కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుకలాంటి చీలిక ఏర్పడి ఉందని, దాన్ని మీరెందుకు షాద్‌నగర్ ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం ఇవ్వకుండా 15 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు నడుచుకుంటూ షాద్‌నగర్ సీహెచ్‌సీకి వచ్చారని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ముందు వాంగ్మూలం ఇచ్చిన నవీన్ కుమార్.. త్రిసభ్య కమిటీ ముందు మాత్రం స్పృహ కోల్పోయి వచ్చారని తెలిపారు. పైగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీనిపై కమిషన్ ప్రశ్నించగా.. అన్నింటికీ ‘ఏమీ లేదు’అంటూ సమాధానం ఇచ్చారు. నేడు సజ్జనార్ విచారణ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించనుంది. ఈ మేరకు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు ఇతర సాక్షుల విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో సజ్జనార్ విచారణ వాయిదా పడింది. కమిషన్ మూడు రోజుల పాటు సజ్జనార్‌ను విచారించనున్నట్టు సమాచారం. -
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ అని అందులో బిగ్ లోఫర్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ (పీఏసీ) జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని నకిలీ హామీపత్రం రాసిచ్చిన ఎంపీ అరవింద్ అని అలాంటి వ్యక్తికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితల గురించి మాట్లాడే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఈనెల 16న హుజూరాబాద్‌లో జరిగిన దళిత బంధు సభ గురించి అరవింద్ ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతికి అండగా నిలిచే పార్టీలు కాం గ్రెస్, బీజేపీలేనని జైలుకు పోయిన రేవంత్‌రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విరుచుకుపడ్డారు. మాటి మాటికి సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామనే ప్రగల్భాలను బీజేపీ నేతలు బంద్ చేయాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా, మోకాళ్ళ మీద నడిచినా రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం కలేనన్నారు. -
Shankanada Aravind: ప్రముఖ కన్నడ నటుడు మృతి
యశవంతపుర: ప్రముఖ కన్నడ నటుడు శంకనాడ అరవింద్(70) కన్నుమూశారు. కరోనాతో వారం రోజుల క్రితం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు, మ్యూజిక్ డైరెక్టర్ మనసా హోల్లా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొన్నాళ్లు క్రితమే తల్లి చనిపోయిందని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయామని ఎమోషనల్ అయ్యింది. అరవింద్ భార్య రమ ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నటుడు అరవింద్ అనుభ, అగుంటక, బెట్టాడ హూవు, అపరిచిత, శంకనాడ, జ్ఞాన గంగే వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సహాయక పాత్రల్లో తనదైన మార్కును చూపించేవారు. శంకనాడ చిత్రంలో శంఖం బ్లోవర్ పాత్రతో ఎంతో ప్రజాదరణ పొందారు. అరవింద్ ఇప్పటివరకు సుమారు 250 సినిమాల్లో నటించారు. చదవండి : టాలీవుడ్లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి చోటా రాజన్ మృతిపై రూమర్స్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్ -
నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఛాలెంజ్ చేశారు. బోధన్‌లో బంగ్లాదేశ్ వాసులు కొందరు అక్రమ పత్రాలతో పాసు పోర్టులు పొందిన విషయంపై ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఒకే ఇంటి నంబర్ మీద 32కు పైగా పాసు పోర్టులు పొందుతుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పాసుపోర్టుల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.. ఎంపీ అరవింద్ కేంద్రంలోని బీజేపీకి చెందిన ఎంపీ కాబట్టి ఆయన కేంద్రంతో మాట్లాడి పాసుపోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీఎం కేసీఆర్ మాట తప్పారు: ఎంపీ అరవింద్
సాక్షి, నిజామాబాద్: రైతులను సన్న రకం సాగు చేయమని, మంచి ధర ఇప్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని బీజేపీ ఎంపీ ఆరవింద్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికల కోసం మక్కలకు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఇప్పిస్తామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. దీంతో ఆయన తీరుకు రైతులు ఆవేదన చెందున్నారని, కేంద్రం ఇస్తున్న ఎంఎస్పీకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వటం లేదన్నారు. కడ్త పేరుతో 9 శాతం తరుగు తీస్తున్నారని, పాల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులకు, రైస్ మిల్లర్ల కోసం వరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, కేసీఆర్ తీరుతో రైతులకు ప్రభుత్వాలపై నమ్మకం పోతుందన్నారు. ముస్లింలకు కేంద్రం అన్ని ఇస్తున్నా కేసీఆర్ వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పసుపు బోర్డు కన్న మంచి వ్యవస్థను కేంద్రం ఇచ్చినా కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కేసీఆర్ భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కేసీఆర్ సర్కార్‌యే అన్నారు. విద్యుత్ బకాయిలు ఎగ గొట్టేందుకు విద్యుత్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్నారు. కొత్త రాష్ట్రంలో ఒక్క కొలువు కూడా ఇవ్వలేదని, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలు నాశనం అయ్యాయి.. రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్ అయిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్ స్క్రాప్‌లా తయారైంది
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్): రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్క్రాప్‌లా తయారైందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. భరతమాతను 3 ముక్కలు చేసి పాపాన్ని ఆ పార్టీ మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో మాట్లాడుతూ, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించి పుణ్యం కట్టుకున్నారని అభినందించారు. పౌరసత్వ బిల్లుతో దేశంలోని మైనారిటీలకు ఇబ్బందులు ఉండబోవన్నారు. దీనికి వ్యతిరేకంగా ఓటేసి టీఆర్ఎస్, కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మైనారిటీలైన హిందువులు ఊచకోతకు గురవుతున్నారని, శరణార్థులుగా మారిన వారికోసం ఈ చట్టాన్ని తెచ్చామని చెప్పారు. ఎంఐఎంకు ఓ వర్గం గంప గుత్తగా ఓట్లు వేస్తున్నారని, రాష్ట్రంలోని మైనార్టీలందరికీ సీఎం కేసీఆర్ ఒవైసీ కళ్లద్దాలు పెట్టి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. -
‘శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు కారణం కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని బీజేపీ ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జీహెచ్ఎంసీ యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సొంత కుటుంబం కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో డబ్బు వ్యామోహం బాగా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని పరిస్థితి ఉందని.. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయినా బాధపడే వారెవరూ లేరని’ అరవింద్ వ్యాఖ్యానించారు. అహంకారపూరిత ధోరణి వలన నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు కవితకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఆయన నిప్పులు చెరిగారు. -
'ఎంపీ అరవింద్ పచ్చి అబద్ధాల కోరు'
సాక్షి, డిచ్పల్లి : ఎన్నికల్లో గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్.. గెలిచి ఆర్నెళ్లయినా పసుపుబోర్డు మాటెత్తని అబద్ధాలకోర్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బతుకమ్మను ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన మాజీ ఎంపీ కవితను ఓ డించి, మోసపూరిత వ్యక్తిని గెలిపించడం బా ధాకరమని వ్యాఖ్యానించారు. డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొద్దున లేస్తేనే సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నాడని ఆరోపించారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్‌ను కలిశారని,తమను తెలంగాణలో కలపాలని కోరారని చెప్పారు. మహారాష్ట్రలోనూ 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు అమలు చేయమని అక్కడఅధికారంలో ఉన్న బీజేపీకి చెప్పాలని అర్వింద్‌కు సవాల్ విసిరారు. ఫ్లెక్సీ వివాదం.. చీరల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్ ఫొటో లేదని ఎవరో చెప్పడంంతో ఆయన కలెక్టర్ రామ్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఆర్డీవోకు ఫోన్ చేసి ప్రశ్నించారు. దీంతో ఆర్డీవో స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. అయితే, ఎమ్మెల్యే రాగా నే, పార్టీ నాయకులు ఫ్లెక్సీ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. స్టేజీపై ఫ్లెక్సీ పెట్టించాలని సూచించడంతో ఆర్డీవో ఏర్పాటు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక వ్యక్తి కోసం మా ఫొటో తీసేస్తరా ఆర్డీవో సాబ్ అని ప్రశ్నించారు. ‘ఆ వ్యక్తి రాడు, ముఖం లేదు, మంచి కార్యక్రమాలకు అడ్డుపడుతుంటాడు. అతడు ఫోన్ చేయగానే భయపడి ఫ్లెక్సీ తొలగిస్తారా..? ఏం.. మేం పని చేస్తలేమా..? ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చిత్రాలు ఉన్నాయి.. అతడు ఏం చేస్తడో చేసుకోని’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎంపీపీ భూ మన్న, జెడ్పీటీసీలు ఇందిర, జగన్, సర్పం చ్ సతీశ్‌రావు, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీవో సురేందర్, నేతలు గడీలరాములు పాల్గొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో చెలరేగిపోయారు. జిల్లాలోని నందిపేట్ మండలం లక్కంపల్లిలో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హర్ సిమ్రత్‌కౌర్ బాదల్, రామేశ్వర్ తెలి హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఎంపీకి వ్యతిరేకంగా పసుపు ఫ్యాక్టరీని వాగ్ధానాన్ని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రసంగ సమయంలో బీజేపీ కార్యకర్తలు చుక్కులు చూపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రైతులకు యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల పోటా పోటీగా నినాదాలు, గందరగోళం మధ్యనే సభ నిర్వహణ జరిగింది. ఇదంతా కేంద్రమంత్రుల ఎదుటనే జరగటం వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్ సిమ్రాత్కౌర్ కలుగచేసుకుని.. వారిని శాంతింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ మెగాఫుడ్ పార్క్‌కి ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేశాం. కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తోంది. రైతులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మెగాఫుడ్ పార్క్ వల్ల రైతుల ఉత్పత్తులు ఉపయోగంలోకి వస్తాయి. మంచి గిట్టుబాటు ధరలు కూడా వస్తాయి. కేంద్రం అన్ని పంటలకు ఈసారి గిట్టుబాటు ధరలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా ఫుడ్ పార్క్‌ని పూర్తి చేశాం. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం పంపిణీ చేస్తోంది’ అని అన్నారు. -
క్యూనెట్ చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
క్యూనెట్ బాధితుడి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన అరవింద్ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అరవింద్ క్యూనెట్‌లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. చాలాసార్లు తన డబ్బులు తనకు వెనక్కి వెళ్లాలని అడిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన అరవింద్ మంగళవారం రాత్రి మాదాపూర్‌లో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూసెట్ సంస్థల కొన్ని లక్షల మందిని మోసం చేసింది. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో క్యూ నెట్ సంస్థ కోట్లు వసూలు చేసింది. బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు దంచుకున్నారు. కూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్‌లో పలు సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి. (చదవండి : క్యూనెట్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!) -
‘తండ్రీకొడుకులు ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయారు’
సాక్షి, నిజామాబాద్ : ముప్పై ఏళ్ల త్యాగాలు, కృషి, ఫలితంగా తెలంగాణలో విజయం సాధించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో సాధించిన బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తండ్రీకొడుకులు ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయారని దుయ్యబట్టారు. పసుపు, ఎర్ర జొన్న రైతులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. తన కూతురు కవిత కోసం సీఎం ఎన్నో పాట్లు పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీ ప్రభంజనం ప్రారంభమైందని, తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలకు చెక్ పెడతామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలమైన శక్తిగా మారుతామని పేర్కొన్నారు. ప్రజల కళ్లలో ఆనందం చూసేందుకే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని తెలిపారు. గత ఐదేళ్లలో కవిత చేయలేని అభివృద్దిని అరవింద్ చేసి చూపిస్తారని, పసుపు రైతుల సమస్యలను త్వరలోనే తీరుస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తు లేదని, భవిష్యత్తులో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ఉద్యోగాలు పెరుగుతున్నాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు. మజ్లిస్ పార్టీతో చేతులు కలిపితే జనం కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. భవిష్యత్తులో గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామన్నారు. నిజామాబాద్‌లో ఇకపై ప్రజల పాలన, కార్యకర్తల పాలన ఉంటుందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం, అహంకారంతో కూడిన పాలనకు పాతర వేస్తామన్నారు. ఈ విజయం తెలంగాణను కైవసం చేసుకునేందుకు నాంది కావాలన్నారు. అవినీతి లేని పాలన అందిస్తామని హామి ఇచ్చారు. -
పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే రాజీనామా
బాల్కొండ/కమ్మర్పల్లి/మోర్తాడ్: పసుపు పంటకు మద్దతు ధర కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే పది రోజుల్లో రాజీనామా చేసి రైతులతో కలిసి పోరాటం చేస్తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ముప్కాల్, బాల్కొండ మండల కేంద్రాలు, కమ్మర్పల్లి మండలం ఉఫ్లూర్, ఏర్గట్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌కు ఎన్నికైన 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్నారు. లేదంటే పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానన్నారు. ఇళ్లులేని ప్రతి పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం నిధులిస్తే టీఆర్ఎస్ నాయకులు కమీషన్ కోసం మిషన్ భగీరథ పనుల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో మహిళలకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు దేశం కోసం ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశ సమైక్యతను కాపాడలేవన్నారు. దేశాన్ని కాపాడే సత్తా మోదీకే ఉందన్నారు. టీఆర్ఎస్తో రైతులకు ఒరింగిదేమి లేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని తాను గతంలో ముత్యంపేట్ నుంచి బోధన్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో రుయ్యాడీ రాజేశ్వర్, తేలు నరేశ్, లింగారెడ్డి, నల్లమోహన్, ఢమాంకర్ శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, శివరాజ్, శ్రీనివాస్, రమేష్, శ్రావణ్‌కుమార్, మనోహర్, రాజారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహిళలకు ఇల్లు కట్టించే బాధ్యత నాది
మోపాల్(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో ని నిరుపేద మహిళలందరికీ సొంతిల్లు కట్టించే బాధ్యతను తీసుకుంటానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హామీనిచ్చారు. శనివారం నిజా మాబాద్ రూరల్ మండలంలోని మల్లారం, మ ల్కాపూర్, గాంధీనగర్‌లో అర్వింద్ ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకమైందన్నారు. నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలను తామే ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. మోదీని గెలిపించి మరోసారి ప్ర ధానమంత్రిని చేయాలని యావత్ భారతావని ఎ దురు చూస్తోందని తెలిపారు. మోదీ ప్రధాని అ యిన వెంటనే 2022 వరకు 5కోట్ల ఇళ్లను మహిళలకు ఇవ్వాలనే ధృడసంకల్పంతో ఉన్నారని పే ర్కొన్నారు. నియోజకవర్గానికి లక్ష ఇళ్లను ఒక్కో ఇల్లుకు రూ.2.50లక్షలు ఇవ్వనున్నారన్నారు. అ లాగే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులే ఎక్కువగా ఉంటాయని, స్వచ్ఛభారత్ మి షన్ కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.12వేలతో మ రుగుదొడ్లను నిర్మించి ఇచ్చిందని గుర్తుచేశారు. ఉ చిత గ్యాస్ కనెక్షన్లు, కేసీఆర్ కిట్లలో రూ.6వేలు, రేషన్ బియ్యంలో రూ.29 కేంద్ర ప్రభుత్వానివేన ని, పంచాయతీ భవనాలు, రోడ్లును నిర్మించి ఇ స్తుందన్నారు. ఉపాధిహామీ పథకం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రూరల్ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి డబ్బులు ఉండవు కానీ జక్రాన్‌పల్లిలో రూ.3వేల కోట్లతో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట అని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న హా మీ నీటమూటగానే మిగిలిపోయిందన్నారు. నిజా మాబాద్, జగిత్యాల్‌కు చెందిన అనేక మంది యు వత బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్తున్నారని చె ప్పారు. టీయూను జాతీయస్థాయి యూనివర్శిటీగా మారుస్తామని హామీనిచ్చారు. రైతుల పండిం చిన పంటలకు మద్దతు ధరలతోపాటు పసుపుబో ర్డు తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మల్లా రం గ్రామంలో అర్వింద్‌కు ఘన స్వాగతం పలికా రు. అదేవిధంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాని కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకా ర్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారె డ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్పాల్ సూర్యనా రాయణ గుప్త, పద్మారెడ్డి, ఆమంద్ విజయ్ కృష్ణ, బంటు రాము, వినాయక్‌నగర్ సుధా, స్థానిక నా యకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చేందుకు పడుతున్న తపనకు మనమందరం వారికి బాసట గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజే పీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పిలుపుని చ్చారు. శనివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో జెం డాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా గంగారె డ్డి మాట్లాడుతూ బీజేపీ 20 రాష్ట్రాల్లో, కేంద్రం లో అధికారంలో ఉండటానికి అనేకమంది కార్యకర్తల త్యాగఫలం, శ్రమ అని పేర్కొన్నా రు. రా జ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాల ప్రజలకు అం దించాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ను గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని, అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడాలన్నా రు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయమని, నిజామాబాద్‌లో కూడా బీజేపీ జెండా ఎగురడం తథ్యమన్నా రు. ఈకార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అ ర్వింద్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, గీతారెడ్డి, నాయకులు యెండ ల సుధాకర్, నాగరాజు, మల్లేష్ యాదవ్, వెంకటేష్, న్యాలం రాజు, శ్రీనివాస్ శర్మ, ఎల్లప్ప, ఆ కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లవ్ ట్వంటీ ట్వంటీ
అరవింద్, మోహిని జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ 20–20’. జోశర్మ, మెక్విన్ గ్రూప్ సహకారంతో మోహన్ మీడియా క్రియోషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల, మహేంద్ర వడ్లపట్ల నిర్మిస్తున్నారు. వడ్లపట్ల సినిమాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఈ చిత్రం లోగో లాంచ్‌ను శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘నాలుగు నెలల క్రితం బెంగళూరులో చిత్రదర్శకుడు సెంథిల్ పరిచయమయ్యారు. ఆయన అరగంటలో నాకొక కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే ఓకే చేశాను. నటీనటులందరూ బాగా నటించారు. ఈ చిత్రకథానాయిక మోహిని 2011లో మిస్ టీన్ యూ.ఎస్‌కు పోటీ చేశారు. అలాగే 2012లో మిస్ టీన్ కెనడా, మిస్ టీన్ ఇండియా కాంటెస్ట్లలోనూ పాల్గొన్నారు. సంగీతం, కెమెరా వర్క్ బాగా కుదిరాయి’’ అన్నారు. సెంథిల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు నన్ను పరిచయం చేస్తున్నందుకు మోహన్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘హుషారు’ చిత్రంలో ‘ఉండిపోరాదే...’ లాంటి సూపర్‌హిట్ పాటను రాశాను. ఆ పాట రాయటానికి అవకాశం ఇచ్చిన బెక్కం వేణుగోపాల్‌ను నాకు పరిచయం చేసింది మోహన్ వడ్లపట్ల గారే. మళ్లీ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు లిరిక్ రైటర్ కిట్టు. ‘‘నేను మాట్లాడటం కంటే నా మ్యూజిక్ మాట్లాడితే బావుంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు సత్యన్. ‘‘ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్‌గారికి కృతజ్ఞతలు. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ చిత్రంలోని పాటలు బావుంటాయి’’ అన్నారు మోహిని. దర్శక, నిర్మాత సాగర్, మహేంద్ర వడ్లపట్ల, ఎమ్.ఆర్.సి వడ్లపట్ల, నటులు క్రాంత్ రిసా తదితరులు పాల్గొన్నారు. -
మొదలయ్యింది ఇలా ఎలా...
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన పాత్రల్లో నటించారు. అవినాష్ కోకటి దర్శకత్వంలో తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లూరమ్మ(భారతి) నిర్మించారు. ‘మొదలయ్యింది ఇలా ఎలా...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండవ పాటను ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేశారు. ‘‘ప్రేమకథల్లో ఎప్పుడూ భావోద్వేగాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ టచెస్‌తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన చిత్రమిది. ఇది ప్రేమకథే అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టునే అంశాలు ఉంటాయి. ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సుద ర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీనివాస్ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్ రెడ్డి, అల్లూరి రెడ్డి.ఏ. -
ట్వంటీ ట్వంటీ లవ్
అరవింద్, మోహిని జంటగా సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘లవ్ 20–20’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల, జో శర్మ నిర్మిస్తున్నారు. మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) సహనిర్మాత. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కొంత ప్యాచ్ వర్క్‌తో సహా, ఫైనల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 6 వరకు జరుగుతుంది. ‘‘మంచి కథ కుదిరింది. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు కొత్తగా ఉంటాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్యన్. -
తదుపరి సీఎంలు కూడా వీరే..!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు భ్రమ్మరథం పట్టే అవాకాశం కనిపిస్తోంది. ఈ మేరకు తదుపరి సీఎంగా ఎవ్వరు ఉండాలనే అంశంపై పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్ఈ) పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఓ సర్వేను నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలో సీఎంగా ఆమ్ ఆద్మీ కన్వీనర్, ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా 47 శాతం మంది నిచిచారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు. చాలా ఏళ్లుగా నీటీ సమస్యతో బాధ పడుతున్న ఢిల్లీ వాసులకు ఆప్ ప్రభుత్వం ఈ సమస్యను తీర్చిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. రాజధానిని 15 ఏళ్ల పాటు నిరంతరంగా పాలించిన షీలా దీక్షిత్ (కాంగ్రెస్)పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరిందరే కావాలి.. షీలా పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఆమెను తదుపరి సీఎంగా 19 శాతం మంది కావాలనుకుంటున్నట్లు సర్వే తేల్చింది. పరిపాలనలో కూడా ఆప్ సరైన మార్పులను తీసుకువచ్చినట్లు పీఎస్ఈ ప్రకటించింది. విద్యా, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలక కల్పనలో ఆప్ మెరుగైన ఫలితం సాధించింది. ఇక పంజాబ్ సీఎంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత సీఎం అమరిందర్ సింగ్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంజాబీలు మరోసారి సీఎంగా పట్టంకట్టే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. 42శాతం పంజాబ్ ప్రజలు సింగ్నే తదుపరి సీఎంగా కోరుకుంటున్నట్లు.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని పీఎస్ఈ వెల్లడించింది. కాగా రెండు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఎత్తిచూపారు. ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రంతోపాటు.. రాష్ట్రాలు కూడా విఫలమైయ్యాయని సర్వే తెలిపింది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆప్ 67 సీట్లల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో తదుపరి ప్రధానిగా ఎవరుండాలనే అంశంపై పీఎస్ఈ పలు అంశాలను వెల్లడించింది. 49 శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోదీనే కోరుకుంటుండగా.. 43 శాతం మంది రాహుల్ గాంధీనే తదుపరి ప్రధాని కావాలని అనుకుంటున్నట్లు సర్వేలో పాల్గన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దేశ వ్యాప్తంగా బగ్గుమంటున్న పెట్రోల్ ధరలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నట్లు.. 8 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వన్ని వ్యతిరేకిస్తున్నట్లు సర్వే తెలిపింది. 22 శాతం మంది మాత్రం పెట్రోల్ ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని తీర్పునిచ్చారు. -
ప్రేమించలేదని గొంతుకోసి చంపాడు
-
ప్రేమోన్మాది ఘాతుకం
జిన్నారం(పటాన్చెరు): ప్రేమ పేరుతో పదో తరగతి బాలికను వేధించడమే కాకుండా ఓ ఉన్మాది ఆమెను కిరాతకంగా గొంతుకోసి చంపాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో గురువారం ఈ దారుణ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం .. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తాపేశ్వరరావు, భవానీ దంపతులు బొల్లారంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్నారు. తాపేశ్వరరావు స్థానికంగా ఉన్న పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె నిఖిత (15) బొల్లారంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నిఖిత ఇంటి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన బీటెక్ విద్యార్థి అరవింద్ ఉంటున్నాడు. కాగా, రెండు నెలలుగా తనను ప్రేమించాలంటూ అరవింద్, నిఖిత వెంట పడుతున్నాడు. ఇందుకు బాలిక అంగీకరించకపోవడంతో వేధింపులకు దిగాడు. గురువారం సాయంత్రం తాపేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. లోనికి వెళ్లాడు. ఆపై తనను ప్రేమించాలని నిఖితపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అరవింద్, నిఖిత మెడను కోసేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా.. చుట్టుపక్కల వారు గమనించి పారిపోయేందుకు ప్రయత్నించిన అరవింద్‌ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. రక్తపుమడుగులో ఉన్న నిఖితను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
తాగొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
సాక్షి, మారేడ్‌పల్లి: అతిగా మద్యం సేవించవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం మారేడుపల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పికెట్ చాకలి బస్తీకి చెందిన అరవింద్ (23) అమీర్‌పేట్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతిగా మద్యం ఎందుకు సేవించావంటూ మందలించారు. దీంతో కోపంతో మద్యం మత్తులో రాత్రి ఇంట్లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి కుటుంబసభ్యులు అరవింద్ గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 108కు సమాచారం అందించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీఎస్సీ చైర్మన్‌గా సక్సేనా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ వినయ్ మిట్టల్ పదవీకాలం ఈనెల 19తో పూర్తికానుండటంతో ఆయన స్థానంలో సక్సేనా జూన్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ లేదా పదవీకాలం పూర్తయ్యే 2020, ఆగస్టు 7వరకూ సక్సేనా యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు’ అని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 1978 బ్యాచ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి అయిన సక్సేనా భారత నిఘాసంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)తో పాటు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో పనిచేశారు. -
డీఎస్ తనయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నిజామాబాద్ : సీనియర్ నేత, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌పై ఆయన తనయుడు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి.. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని డీఎస్‌ను అరవింద్ కోరుతున్నారు. బీజేపీ నేత అయిన అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని డీ శ్రీనివాస్‌ను కోరారు. ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. అయితే దాని విషయంలో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత పట్టించుకోవటం లేదు. మీరు(డీ శ్రీనివాస్) టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. కాబట్టి, చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యండి. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని అరవింద్ పేర్కొన్నారు. పనిలో పనిగా ఎంపీ కవితపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని ఆమె ఏవో సాకులు చెబుతున్నారు. పసుపు బోర్డు విషయంలో అయితే ముందడుగే వేయలేదు. చిన్న చిన్న హామీలు ఇవ్వటం కాదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి పెద్దవే ఆశిస్తుంటారు. ముందు పెద్ద సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని అరవింద్.. ఎంపీ కవితకు సూచించారు. -
దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసు
హైదరాబాద్ : సినిమాల్లో హీరో వేషం ఇస్తానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన వర్థమాన దర్శకుడు వంశీకృష్ణపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... శ్రీనగర్ కాలనీ సమీపంలోని ప్రగతి నగర్లో నివసించే దర్శకుడు వంశీకృష్ణ వీ-డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రకటనలు ఇచ్చాడు. అప్పటికే 'జోరు' అనే సినిమాలో హీరోగా నటించిన అరవింద్ ఈ ప్రకటన చూసి వంశీకృష్ణను సంప్రదించాడు. తనకు హీరోగా అవకాశం కల్పించాలని కోరగా అందుకోసం వంశీకృష్ణ రూ.35లక్షలు తీసుకున్నాడు. సినిమా తీయకపోవడంతో తనకు డబ్బు తిరిగి చెల్లించాలని అరవింద్ కోరగా...బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్ : వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదృశ్యమైన గురైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. చిన్నారులను కిడ్నాప్ చేసిన మహిళ ....వాళ్ల మెడలో గొలుసు, చెవి పోగులు తీసుకుని పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. వీరిద్దర్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్న విద్యార్థులను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా తమ చిన్నారులు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
మీ నాన్న రమ్మంటున్నాడని కిడ్నాప్
హైదరాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సోమవారం ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన చిన్నారులు దుర్గా భవానీ (8), అరవింద్ (7)గా గుర్తించారు. ఈరోజు ఉదయం స్కూల్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి మీ నాన్న రమ్మంటున్నాడంటూ ఇద్దరు చిన్నారులను తనతో తీసుకు వెళ్లినట్లు సహ విద్యార్థులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా కిడ్నాప్ అయిన చిన్నారుల తల్లిదండ్రులు పొట్టకూటి కోసం రాజమండ్రి నుంచి నగరానికి వలస వచ్చినట్లు సమాచారం. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏడవరా కన్నా..!
చిన్నపిల్లలు ఏడిస్తే.. ఏడవద్దురా కన్నా నీకు తాయిలాలు పెడతా అని మురిపించి ఏడుపును మరిపించడం అందరికీ తెలిసిందే. అయితే కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన ఓ పిల్లాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. స్థానిక శ్రీరామ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మీదేవి దంపతులకు ఇరువురు సంతానం. పెద్ద కుమారుడు అరవింద్(7) పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యులు పరీక్షించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెబుతున్నా.. వారి మనసు కుదుటపడటం లేదు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న ఈ పిల్లాడు.. కొట్టినా, తిట్టినా, గిచ్చినా కంట్లో నీటి చుక్క రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండో కుమారుడు అఖిల్(5) మాత్రం అందరిలానే ఏడుస్తుండటంతో పెద్ద కుమారుని విషయంలో తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. సాధారణంగా పిల్లల కంట్లో కన్నీరు వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు.. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం కుమారుడు ఏడిచే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై స్థానిక వైద్యాధికారి చెన్నకేశవులును వివరణ కోరగా బాలుడికి స్వరపేటికలో సమస్య ఉండొచ్చని తెలిపారు. -ప్యాపిలి -
అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు!
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన శంషాబాద్ వాసి అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారన్న వార్త విని అతడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరవింద్‌కు ఈత వచ్చని, ఎలాగైనా బయటపడి ఉంటాడని భావించిన అతడి స్నేహితులకు నిరాశే మిగిలింది. ఇక అదే వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన గౌడవెల్లి వాసి సందీప్ జాడ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా బతికి వస్తాడంటూ ఆశతో ఉన్నారు. శంషాబాద్: ‘ఆయువు తీరిందారా.. పండు.. క్షేమంగా తిరిగి వస్తావనుకున్నం బిడ్డా, మంచిగ సదువుకునేటోడివి.. నీ మీదే గంపెడాశలు పెట్టుకున్నం.. నువ్వేమో తనువు చాలించినవ్..’ అంటూ బియాస్ నదిలో కొట్టుకుపోయి కానరానిలోకాలకు తరలివెళ్లిన విద్యార్థి అరవింద్ తాత, నాయనమ్మలు కన్నీంటి పర్యంతమవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. టీవీల్లో ఈ వార్త చూసిన అరవింద్ తాత, నాయనమ్మ ఈశ్వరప్ప, భద్రమ్మలతోపాటు శంషాబాద్‌లోని అతడి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అరవింద్ శంషాబాద్ పట్టణ వాసులైన వినోద్, శశిలత దంపతుల మొదటి కుమారుడు. ఒకటో తరగతి నుంచి పది వరకు శంషాబాద్‌లోని బాలయేసు (సెయింట్ ఇన్ఫాంట్ జీసస్) పాఠశాలలో చదివాడు. అనంతరం శశిలత పిల్లల చదువు కోసం వనస్థలిపురంలోని పుట్టింటికి వెళ్లింది. వినోద్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అరవింద్ చురుకైన విద్యార్థిఅని అతడితో చదువులో ఎవరూ పోటీపడలేకపోయారని అతడి స్నేహితులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అరవింద్‌కు ఈత రావడంతో బతుకుతాడని ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. నా మనవడిని నెలరోజుల కిందజూసిన.. నా మనవడు అరవింద్ నెలరోజుల కింద శంషాబాద్‌కు వచ్చిండు. మమ్మల్ని పలకరించి పోయిండు. నదిలో కొట్టుకుపోయిండని తెలిసినప్పటి నుంచి వాడు బతికే వస్తడని అనుకున్నం. వాడు మంచిగ తిరిగిరావాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్న. నా పండుకు అప్పుడే ఆయువు తీరిందా.. అయ్యో.. దేవుడా ఎంతపని చేస్తివి! - భద్రమ్మ, అరవింద్ నాయనమ్మ టూర్‌కు పోతనని చెప్పిండు.. ఈ నెల ఒకటో తేదీన నాకు ఫోన్‌చేసి టూర్‌కు పోతున్ననని చెప్పిండు. అరవింద్ నేను బాల్య స్నేహితులం. వాడు చదువులో ఎప్పుడు ఫస్టే, వాడికి ఈత కూడా వచ్చు. క్షేమంగా తిరిగి వస్తాడని అనుకున్నం. అరవింద్, నేను, హరిబాబు, అక్షయ్‌యాదవ్, రాజేష్, మణిసాయి, సందీప్, అజయ్ మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్. అరవింద్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నం. - నవీన్, అరవింద్ స్నేహితుడు ఐదు రోజులైనా జాడలేని సందీప్ ఆందోళనలో కుటుంబసభ్యులు మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ జాడ గురువారం వరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం స్వగ్రామం గౌడవెల్లిలో కుటుంబీకులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా సందీప్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం సందీప్ గల్లంతైన నాటి నుంచి తల్లిదండ్రులు వీరేష్, విజయలు నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారు. కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నా కొడుకు జాడ కనిపెట్టండి.. ప్రభుత్వం ఎలాగైనా తన కొడుకు సందీప్ జాడ కనిపెట్టాలని తండ్రి వీరేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలాంటి బాధ పగవారికి కూడా రాకూడదన్నారు. సందీప్ ఆచూకీ కోసం కుటుంబం మొత్తం నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ బాధను అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. గర్భశోకం సాక్షి, హైదరాబాద్: అదే వేదన.. తీరని రోదనతో కన్నపేగులు తల్లడిల్లుతున్నాయి. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం నగరంలోని వారి తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. తమ వారి కోసం ఐదు రోజులుగా రోదిస్తూ.. కళ్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. నగరవాసులకు కన్నీళ్లు మిగిల్చిన లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గురువారం మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బండరాళ్ల కింద లభ్యమయ్యాయి. నగరంలో వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాయని పోలీసులు తెలిపారు. మరోపక్క సాబేర్ మృతదేహం గురువారం శేరిలింగంపల్లి గుల్మొహర్ కాలనీలోని నివాసానికి చేరగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పుట్టినరోజుకూ కానరాని ఆచూకీ గల్లంతయిన విద్యార్థుల్లో దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన అఖిల్ కూడా ఉన్నాడు. గురువారం అఖిల్ పుట్టినరోజు కావడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం బంధువులు, స్థానికుల తరం కాలేదు. పుట్టినరోజుకు తమ బాబు క్షేమంగా తిరిగొస్తాడనుకున్న ఆశలు అడియాసలు కావడంతో కన్నవారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. 8 మంది మృతదేహాలు లభ్యం గల్లంతయిన 24 మందిలో ఇప్పటివరకు 8 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీలకు చెందిన సుమారు 600 మంది సుశిక్షితులైన సిబ్బంది లార్జీ నుంచి మండో డ్యామ్ పరిసరాల్లో సుమారు 15 కిలోమీటర్ల మేర జల్లెడ పడుతున్నారు. భారీ వర్షాలు, మంచు ప్రభావంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని అక్కడే మకాం వేసిన నగర పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. -
అరవింద్ మృతదేహం లభ్యం
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అరవింద్ కుమార్ మృతదేహం లభ్యమైంది. సహాయక సిబ్బంది గురువారం ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. అరవింద్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారుడి మరణవార్తతో అతని తల్లి శశిలత రోదన వర్ణనాతీతంగా ఉంది. తన కుమారుడు ఇంకా సజీవంగా తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆమెకు అరవింద్ మృతదేహం లభ్యం కావటంతో కోలుకోలేని విషాదంలో మునిగిపోయారు. అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్న విషయం తెలిసిందే. అతని మృతదేహం లభ్యం కావటంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు గల్లంతు అయిన 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. -
గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి
దుఃఖసాగరంలో మునిగిన కుటుంబం శంషాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి కూడా ఉన్నారు. స్థానిక పట్టణంలో పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసించే వినోద్, శశిలతల కుమారుడు అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్నాడు. అతను కూడా గల్లంతు కావడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్‌తోపాటు అతడి కుటుంబసభ్యులు ముగ్గురు పిల్లల చదువుల కోసం నాలుగైదేళ్లుగా వనస్థలిపురంలో ఉంటున్నారు. అరవింద్ వీరికి మొదటి సంతానం. సెలవుల్లో ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్లని వారి బంధువులు తెలిపారు. అరవింద్ కుటుంబసభ్యులను ఓదార్చడానికి వారి బంధువులు కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అరవింద్ తల్లి శశిలతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకు గల్లంతయ్యాడనే షాక్ నుంచి ఆ తల్లి తేరుకోలేకపోతోంది. మూడు రోజుల క్రితం ఫోన్ చేశాడు: వినోద్ , బంధువు నా కొడుకు అరవింద్ మూడు రోజుల కింద ఫోన్ చేసి బాగున్నామని చెప్పాడు. నిన్నరాత్రి 12 గంటలకు తెలిసింది.. గల్లంతైన వారిలో మా వాడు కూడా ఉన్నాడని. కాలేజీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌కు నా బావమరిది వెళ్లాడు. ఇది ఘోరం: ప్రశాంత్, పరమేశ్వర్ సోదరుడు కళాశాల నిర్లక్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది. కాలేజీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా తమ్ముడు గల్లంతైన వారిలో ఉన్నాడు. మా బాధను చెప్పుకోలేని పరిస్థితి. ఉదయమే ఫ్లైట్ ఉందని చెప్పినా విమానాశ్రయంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. -
ప్రేమంటే ఫీలింగ్ కాదు...
ప్రేమంటే ఫీలింగ్ కాదు... అది ఎథిక్స్‌తో కూడిన విషయం అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మనసు పడిన కథ’. ఈ చిత్రం ద్వారా అరవింద్ హీరోగా పరిచయం అవుతున్నారు. కార్తీక్ ప్రత్యేక పాత్రధారి. రాజేష్ మందపాటి దర్శకుడు. హనితా రాహుల్ చౌదరి, గాదె భానుప్రకాష్ నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. సందేశంతో కూడిన వినోదాత్మక ప్రేమకథ తెరకెక్కించాలనే తన అభిమతానికి అనుగుణంగా దర్శకుడు చక్కని కథ వినిపించాడని సమర్పకుడు జేఎల్వీ ప్రసాద్ చెప్పారు. రొమాంటిక్ లవ్‌స్టోరితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత అన్నారు. రెండేళ్లు ఈ కథ మీద వర్క్ చేశానని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌కుమార్, సంగీతం: హరినికేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్‌శర్మ. -
'మనసు పడిన కథ' ప్రారంభోత్సవం