
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన పాత్రల్లో నటించారు. అవినాష్ కోకటి దర్శకత్వంలో తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లూరమ్మ(భారతి) నిర్మించారు. ‘మొదలయ్యింది ఇలా ఎలా...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండవ పాటను ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేశారు. ‘‘ప్రేమకథల్లో ఎప్పుడూ భావోద్వేగాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ టచెస్‌తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది.
ఇది ప్రేమకథే అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టునే అంశాలు ఉంటాయి. ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సుద ర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీనివాస్ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్ రెడ్డి, అల్లూరి రెడ్డి.ఏ.
Comments
Please login to add a commentAdd a comment