Pant
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
-
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
చీర ఆర్డర్ చేస్తే చిరిగిన ప్యాంటొచ్చింది
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా): సోదరికి కానుక ఇద్దామని చీర ఆర్డర్ చేస్తే సగానికి చిరిగిన పాత ప్యాంటు డెలివరీ అయిన ఘటన పెనుగంచిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు పండుగకు తన సోదరికి చీర కొనిద్దామనుకున్నాడు. ఓ ఆన్లైన్ యాప్‌లో రూ.550 విలువ గల చీర బుక్ చేశాడు. శనివారం ఆర్డర్ అందింది. డెలి వరీ బాయ్‌కు డబ్బు చెల్లించి, కవర్‌ను తెరిచి చూడగా దానిలో చీరకు బదులు చిరిగిన పాత ప్యాంట్ అదీ ఒక కాలు వరకు మాత్రమే ఉండ టంతో అవాక్కయ్యారు. ఇదేమని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా తమకేం తెలియదని, రిటన్ ఆప్షన్ ఉంటుంది చేసుకోమంటూ సలహా ఇచ్చాడు. జరిగిన దానికి తానేమీ చేయలేనని, ఆన్లైన్ వ్యాపారంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిమరీ వెళ్లాడు. -
ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్!
వస్తువులు పాతవయ్యే కొద్దీ వాటిని పక్కన పెట్టడం సహజం. వాటి విలువ తగ్గడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, పాడైపోవడం లాంటి కారణాలతో పక్కన పెట్టేస్తాం. ఇదంతా ఒక వైపే. మరో వైపు చూస్తే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దశాబ్దాల కాలం నాటి వస్తువుల కోసం కోట్లు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ నగదు చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. అమ్మో.. ఈ ప్యాంటు ధర రూ.60 లక్షలా! అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్సన్తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు. View this post on Instagram A post shared by Golden State Vintage (@goldenstatevtg) చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్‌ను ఫ్రాంక్ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్‌ను కూడా ఫ్రాంక్ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ చేయాల్సింది మరిచి అంపైర్ ప్యాంట్‌ను లాగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన లంకాషైర్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రిస్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్ నవ్వుతూ అంపైర్‌కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్ ప్రాంక్'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్ ప్రాంక్ చేయడం ఏమో గాని అంపైర్ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్ చేశారు. @ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. 😂😂😂 pic.twitter.com/oF2qWeZbXk — Tino Hallerenko (@tinohalleron) August 27, 2022 చదవండి: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్ -
DC Vs CSK: చెన్నైకు మరో షాక్.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
చెన్నైకు మరో షాక్.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతూ లక్ష్యాన్ని చేధించింది. చివర్లో హెట్‌మైర్(28) కీలక ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. అంతకముందు శిఖర్ ధావన్ 39 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, జడేజా రెండు వికెట్లు సాధించగా, హాజెల్‌వుడ్ , దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఢిల్లీకు బిగ్ షాక్.. ధావన్ (39) ఔట్ 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతుంది. కేవలం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి ఊపు మీద ధావన్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 28 బంతుల్లో 36 పరుగులు కావాలి. ప్రస్తుతం 15.4 ఓవర్లులో 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. కెప్టెన్ పంత్ (15)ఔట్ కెప్టెన్ పంత్ (15) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో ఢిల్లీ 84 పరుగులు చేసింది. ధావన్(32) రిపల్ పటేల్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్ (2)ఔట్ స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(2) రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరో వైపు ధావన్ మాత్రం ఫోర్లు, సిక్స్రలతో చెన్నై బౌలర్లపైన విరుచుకు పడుతున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఢిల్లీ 64 పరుగులు చేసింది. ధావన్(32), పంత్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18)ఔట్ 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో పృథ్వీ షా(18), డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ధావన్(6), అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. అర్దసెంచరీతో మెరిసిన రాయుడు.. సీఎస్కే 20 ఓవర్లలో 136/5 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు Photo Courtesy: IPL వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై ఢిల్లీ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాట్సమన్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. కేవలం 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస క్రమంలో ఉతప్ప (19), మొయిన్ అలీ(5) వికెట్లును కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. రాయుడు (2), ధోని (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్ చెరో వికెట్ సాధించారు. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. గైక్వాడ్ (13) ఔట్ గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్ కేవలం 13పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో ఆశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే 5 ఓవర్లలో 2 వికెట్లు సష్టపోయి 41 పరుగులు చేసింది. ఉతప్ప (1), మొయిన్ అలీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 35/1 ఓపెనర్ డుప్లెసిస్(10) రూపంలో సీఎస్కే తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డుప్లెసిస్, అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 4ఓవర్లో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రుతురాజ్ (13), ఉతప్ప (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. దుబాయ్: ఐపీఎల్ 2021లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా లీగ్‌లో ఇరు జట్లు 24 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా చెన్నై 15 .. ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘనవిజయం సాధించింది . పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ -
నేనిక్కడే ఉన్నా, వచ్చేయమంటారా.. టీమిండియాకు డీకే బంపర్ ఆఫర్
లండన్: టీమిండియా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 20 నుంచి కౌంటీ ఛాంపియన్షిప్ జట్టుతో ప్రారంభం కాబోయే ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఇంగ్లండ్‌లోనే ఉన్నాను, వచ్చేయమంటారా అంటూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీమిండియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. క్రికెట్‌కు వీడ్కోలు పలుకకుండానే కామెంటేటర్‌గా మారిపోయాడు. స్కైస్పోర్ట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. 😋 #justsaying pic.twitter.com/zX3ValErDc — DK (@DineshKarthik) July 15, 2021 ఇదిలా ఉంటే, టీమిండియాలోని ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు కరోనా కారణంగా ఐసోలేషన్‌కు పరిమితం కావడంతో జట్టులో వికెట్ కీపింగ్ అనుభవమున్న కేఎల్ రాహుల్‌వైపు అందరూ చూస్తున్నారు. అయితే రాహుల్‌కు గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కీపింగ్ చేసిన అనుభవం ఉంది. అందులోనూ రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఓపెనింగ్ బాధ్యతలు రాహుల్‌పైనే పడే ఆస్కారం ఉంది. దీంతో టీమిండియా యాజమాన్యం అతనిపై అధిక భారం వేసేంత సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇలాంటి సమయంలో దినేశ్ కార్తీక్ చేసిన ట్వీట్ టీమిండియా పాలిట బంపర్ ఆఫర్‌గా మారింది. అయితే, డీకే.. క్రికెట్ కిట్‌తో పెట్టిన ట్వీట్లో 'జస్ట్ సేయింగ్' అన్న క్యాప్షన్ జోడించడం విశేషం. -
మొన్న అలా, నేడు ఇలా.. కోహ్లిపై సెహ్వాగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌటైనా, రెండో మ్యాచ్‌లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో(రోహిత్‌కు విశ్రాంతినివ్వడం) కొద్ది రోజుల కిందట టీమిండియా సారధిపై విరుచుకుపడిన ఆయన.. రెండో టీ20లో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లి.. దిగ్గజ ఆటగాడు సచిన్‌తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండేందుకు అనాసక్తి కనబరిచాడని, ఈ విషయంలో అతను కెప్టెన్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. అలాగే మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లి చాలా పట్టుదలగా ఉంటాడని, ఈ కసిని యువ క్రికెటర్లు కూడా కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇటీవలకాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లికి తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్‌ను సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఇదే వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. -
ప్యాంట్ కోసం గొడవ.. మీకెలా కనబడుతున్నాం?
సాక్షి, అనంతపురం : ప్యాంట్ తెచ్చిన తంటా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. టూటౌన్ ఎస్ఐ రాంప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓబుళదేవనగర్‌కు చెందిన ప్రసాద్ హౌసింగ్‌బోర్డులోని రాహుల్ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) ఇంటిలో దోబీ పనికి వెళ్లేవాడు. ఇటీవల వేరొకరి ప్యాంట్ బీట్ ఆఫీసర్ ఇంటికి వెళ్లింది. దీంతో ప్రసాద్ వేరొకరికి చెందిన ప్యాంట్ మీ వ్రస్తాల్లో కలిసిందని బీట్ ఆఫీసర్ కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు ఆ ప్యాంట్ తమ వద్ద లేదని, తమ ఓనర్ ఇంటిలో ఏమైనా కలసిందేమో కనుక్కొని చెబుతామని సమాధానమిచ్చారు. చదవండి: ఆర్సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే ఈ విషయమై ఇంటి యజమాని చంద్రశేఖర్ అతని కుటుంబ సభ్యుడు రాజేష్ ‘మీకెలా కనబడుతున్నాం’ అంటూ ప్రసాద్‌పై మండిపడ్డారు. ప్రసాద్ తన సోదరుడు రమణ, తదితరులను తీసుకుని బీట్ ఆఫీసర్ ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి బీట్ ఆఫీసర్ ఓ కర్రతో రమణపై దాడి చేయగా కంటికి గాయమైంది. దీంతో వారు సోమవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రసాద్, రమణలు తమపై దాడికి వచ్చారంటూ చంద్రశేఖర్, రాజేష్, బీట్ ఆఫీసర్ రాహుల్ కూడా ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో టూటౌన్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
వైరల్: ప్యాంటులో దూరిన పాము
-
ప్యాంటులో పాము, రాత్రంతా జాగారం
లక్నో: పామును చూస్తేనే సగం చస్తాం. అలాంటిది ఏకంగా అది వేసుకున్న బట్టల్లో దూరితే... ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ! కానీ నిజంగానే ఓ వ్యక్తి ప్యాంటులో పాము దూరిన షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. మీర్జాపూర్ జిల్లాలోని అరోరా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ఎనిమిది మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరందరూ రాత్రిళ్లు అక్కడే ఆరుబయట నిద్రిస్తారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఓ పెద్ద పాము మరెక్కడా చోటు లేనట్లు లావ్రేశ్ కుమార్ అనే కార్మికుడి ప్యాంటులో దూరింది. ఉదయం మూడు గంటలకు ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అతడికి అనిపించింది. (ఇంటి వెనకాల పాము: కనిపించిందా?) కొద్ది క్షణాలకు అది పామని అర్థమయ్యేసరికి భయంతో నోట మాట రాలేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పక్కనే ఉన్న కార్మికులకు చెప్పడంతో వారు పాములను పట్టేవాళ్లను పిలుచుకు వచ్చేందుకు పరిగెత్తుకెళ్లారు. మరోవైపు కదిలితే ఆ పాము ఎక్కడ కాటు వేస్తోందనన్న భయంతో మూడు గంటల వరకు అతను స్థంభాన్ని పట్టుకుని కదలకుండా నిల్చున్నాడు. అనంతరం పాములు పట్టే వ్యక్తి వచ్చి అతడి ప్యాంటు విప్పి పామును బయటకు తీశారు. అది విషసర్పమని ఆయన వెల్లడించారు. అదృష్టం బాగుండి ఎట్టకేలకు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం) -
ఢిల్లీ దంచేసింది
నీరు పల్లమెరుగు అన్నట్లే పరుగు ప్రవాహామెరిగిన మ్యాచ్ ఇది. రహనే శతకంతో రాజస్తాన్ భారీ స్కోరే చేసింది. గెలుపు ఆశలతో ఉంది. కానీ ప్రత్యర్థి ఢిల్లీ కూడా ఛేదనలో ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా శిఖర్ ధావన్ తాను ఉన్నంతసేపు దంచేస్తే... రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో బంతి పదేపదే బౌండరీని తాకింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయం వరించింది. జైపూర్: ఐపీఎల్లో మళ్లీ బంతి బలయింది. బ్యాట్ చెలరేగింది. దీంతో లక్ష్యం పెద్దదైనా ఛేదన సులువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పవర్ హిట్టింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే (63 బంతు ల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ స్మిత్ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేజింగ్‌కు అవసరమైన బ్యాటింగ్ చేశాడు. గోపాల్ 2 వికెట్లు తీశాడు. పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మార్పుల్లేని రాయల్స్ జట్టు బరిలోకి దిగగా... ఢిల్లీ క్యాపిటల్స్‌లో సందీప్ లమిచానే స్థానంలో మోరిస్ తుది జట్టులోకి వచ్చాడు. సామ్సన్ డకౌట్... టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు క్రీజులోకి వచ్చిన సంజూ సామ్సన్ (0) ఒక్క బంతి ఆడకుండానే రనౌటయ్యాడు. తర్వాత రహానేకు కెప్టెన్ స్మిత్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో జట్టును నడిపించారు. రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన (ఇన్నింగ్స్ ఐదోది) ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న రహానే షార్ట్ ఫైన్ లెగ్‌లోకి షాట్ ఆడాడు. అక్కడే ఉన్న ఇషాంత్ శర్మ సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో బతికి పోయిన రహానే ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ వెంటనే రెండు బంతులను 6, 4గా తరలించాడు. రహానే కళాత్మక వేగం... లైఫ్ దక్కిన రహానే అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కళాత్మక షాట్లతో అలరించాడు. రబడ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో రాయల్స్ స్కోరు 52/1కు చేరింది. మరుసటి ఓవర్లోనే రహానే చూడచక్కని బౌండరీ బాది 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ కూడా ఫోర్లు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. దీంతో 10 ఓవర్లలో రాజస్తాన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. స్మిత్ 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి కెప్టెన్ శ్రేయస్ శతవిధాలా కష్టపడినా ఫలితం పొందలేకపోయాడు. మరోవైపు స్మిత్ కూడా 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అతను నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిగతా వారెవరూ నిలకడగా ఆడలేకపోయారు. స్టోక్స్ (8), టర్నర్ (0), పరాగ్ (4) పెద్దగా కష్టపడలేదు. స్టువర్ట్ బిన్నీ (19; 2 ఫోర్లు) అండతో 58 బంతుల్లో రహానే శతకం సాధించాడు. అయితే రబడ ఆఖరి ఓవర్లో బిన్నీ, పరాగ్ వికెట్లను పడగొట్టడంతో జట్టు 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది. ధనాధన్ ఆరంభం... ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 192 పరుగులు. అంటే ఓవర్‌కు దాదాపు 10 పరుగులు చేయాలి. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలిద్దరు కూడా ఛేదించాల్సిన లక్ష్యానికి తగ్గట్లే ధనాధన్ ఆరంభమిచ్చారు. దీంతో క్యాపిటల్స్ స్కోరు క్రమపద్ధతిలో దూసుకెళ్లింది. రెండో ఓవర్ వేసిన కులకర్ణి బౌలింగ్‌లో 6, 4 బాదిన ధావన్ తన అర్ధసెంచరీ చేసేదాకా ఇదే ధాటిని కొనసాగించాడు. దీంతో ధావన్ ఉన్నంత సేపూ ప్రతీ ఓవర్లోనూ బౌండరీలు, సిక్సర్లు అలవోకగా వచ్చాయి. 25 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్సర్లు) శిఖర్ అర్ధశతకం పూర్తయింది. ఆ వెంటనే మరో బౌండరీ కొట్టిన అతను నిష్క్రమించడంతో 72 పరుగుల శుభారంభం ముగిసింది. పంత్ పటాకా... అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యాడు. 77 పరుగుల వద్ద రెండో వికెట్. రాజస్తాన్ శిబిరంలో ఆనందం. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు, ఢిల్లీ చితగ్గొట్టేందుకు ఎక్కువ సమయం పట్టనే లేదు. ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన హిట్టర్ రిషభ్ పంత్ ఆద్యంతం తన ధాటిని కొనసాగించాడు. ఇద్దరు మరో భాగస్వామ్యానికి తెరలేపారు. ఒక ఓవర్లో çపృథ్వీ షా బౌండరీలు బాదితే మరుసటి ఓవర్లో పంత్ సిక్సర్లు కొట్టాడు. ఇలా ఒకర్నిమించి మరొకరు రాజస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేయడంతో కొండంత లక్ష్యం చిన్నదైంది. పంత్ 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించాక పృథ్వీ ఆట ముగిసినా... రూథర్‌ఫర్డ్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయినా... రిషభ్ పంత్ తన సిక్సర్ల ధాటితో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు. కులకర్ణి, పరాగ్ చెరో వికెట్ తీశారు. ►ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడం ద్వారా టి20 చరిత్రలో వరుసగా ఐదు ఇన్సింగ్స్‌లో ఖాతా తెరవకుండా ఔటైన తొలి బ్యాట్స్‌మన్‌గా ఆస్టన్ టర్నర్ గుర్తింపు పొందాడు. ►ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుపై నమోదైన సెంచరీలు. ►ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నమోదైన సెంచరీలు. సామ్సన్ (రాజస్తాన్), బెయిర్‌స్టో, వార్నర్ (హైదరాబాద్), లోకేశ్ రాహుల్ (పంజాబ్), కోహ్లి (బెంగళూరు), రహానే (రాజస్తాన్) ఈ ఘనత సాధించారు. -
మొదలయ్యింది ఇలా ఎలా...
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన పాత్రల్లో నటించారు. అవినాష్ కోకటి దర్శకత్వంలో తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లూరమ్మ(భారతి) నిర్మించారు. ‘మొదలయ్యింది ఇలా ఎలా...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండవ పాటను ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేశారు. ‘‘ప్రేమకథల్లో ఎప్పుడూ భావోద్వేగాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ టచెస్‌తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన చిత్రమిది. ఇది ప్రేమకథే అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టునే అంశాలు ఉంటాయి. ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సుద ర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీనివాస్ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్ రెడ్డి, అల్లూరి రెడ్డి.ఏ. -
ముంబైతోనే రోహిత్, పాండ్యా
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కొనసాగించడం దాదాపుగా ఖాయమైంది. మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఆలోచన లేకుండా ముంబై అట్టి పెట్టుకోనుంది. అతనితో పాటు పాండ్యా సోదరులను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యాతో పాటు 2017 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కృనాల్ పాండ్యాను కూడా ముంబై కొనసాగించనుంది. పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాలను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా జట్టులోకే తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీమ్‌లో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను రిటెయిన్ చేసుకుంటే రూ. 21 కోట్లు (12.5+ 8.5), ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే రూ. 33 కోట్లు (15+11+7) చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముంబై ఇండియన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయని కృనాల్‌ను రూ. 3 కోట్లకే తమతో కొనసాగించుకునేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు. -
ఐపీఎల్: ఉప్పొంగిన 'యువ'కెరటాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పది సంవత్సరాలుగా భారత యువ టాలెంట్ కు వేదికైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లకు భవిష్యత్తునిచ్చింది. కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ అవకాశాలను గల్లీ క్రికెటర్లకు సైతం కల్పించింది. ఇలా ప్రతి సీజన్లో ఓ గల్లీ క్రికెటర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యారు. విదేశీ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమంటూ అసాధరణ ప్రతిభ కనబరుస్తున్న యువ కెరటాల ప్రదర్శన పై ఓ లుక్కెద్దాం.. నితీష్ రాణా- ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉందంటే నితీష్ రాణా బ్యాట్ ఝలిపించడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో178 పరుగుల చేజింగ్ లో ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా 29 బంతుల్లో 50 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజారత్ పై 53 పరుగులు, కింగ్స్ పంజాబ్ 198 పరుగుల భారీ లక్ష్య చేదనలో 62 పరుగులు చేసిన రానా జట్టుకు కీలక విజయాల్లో ముఖ్యపాత్ర వహించాడు. 13 మ్యాచ్ లు ఆడిన రాణా మూడు అర్ద సెంచరీలతో 333 పరుగులు చేశాడు. బసీల్ తంపి- గుజరాత్ లయన్స్: గుజరాత్ లయన్స్ పేసర్ బసీల్ తంపి గంటకు140 కీ.మీ వేగంతో బంతిని విసరగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో పరుగుల ఇవ్వకుండా కట్టడిచేయడంలో దిట్ట. యార్కర్లు, స్టో డెలివరీలు వేస్తు ప్రత్యర్ధులను కట్టిడిచేసిన తంపి 12 మ్యాచుల్లో 3/29 ఉత్తమ ప్రదర్శనతో 11 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టు గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయిన తన ప్రతిభను చాటుకున్నాడు. రాహుల్ త్రిపాఠి: రైజింగ్ పుణె ఫైనల్ చేరడంలో త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించాడు. కొన్ని కీలక మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్ తో రాబట్టాడు. ఈ సీజన్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిపాఠి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇక కోల్ కతా తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 98 పరుగులతో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించాడు. 12 మ్యాచ్ లు ఆడిన త్రిపాఠి 2 అర్ధ సెంచరీలతో 388 పరుగులు బాది తన సత్తా చాటాడు. రిషబ్ పంత్, ఢిల్లీ డేర్ డెవిల్స్: ఈ సీజన్లో అసాధారణ ప్రతిభతో అభిమానుల మనసు దోచుకున్న యంగ్ క్రికెటర్ గా పంత్ గుర్తింపు పొందాడు. తన ఆట తీరుతో ఏకంగా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పంత్..వారితో మా ఫ్యూచర్ ధోని రిషబ్ పంతే అనేలా చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటి చేత్తో గెలిపించి దిగ్గజ క్రికెటర్ల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 9 సిక్సర్లు బాది 97 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే పంత్ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపించగా ఢిల్లీ కోచ్ ద్రావిడ్ మాత్రం టీం ఇండియా ఫ్యూచర్ పంతే అని కొనియాడాడు. తండ్రి మరణాంతరం ఐపీఎల్ లో పాల్గొన్న పంత్ బెంగళూరు పై ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయడం అందరి మనసులును కదిలించింది.14 మ్యాచులు ఆడిన పంత్ 366 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్- సన్ రైజర్స్ హైదరాబాద్: కేవలం భారత క్రికెటర్లకే కాకుండా క్రికెట్ ఆడే చిన్నదేశాల ఆటగాళ్లను సైతం వెలుగులోకి తెచ్చింది ఐపీఎల్. ఈ ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. కానీ ఈ సీజన్లో అప్ఘన్ బౌలర్ అసాధరణ ప్రతిభకు క్రికెట్ అభిమానులు దాసోహం అన్నారు. ఐపీఎల్ వేలం అధిక ధర రూ.4 కోట్లు వెచ్చించి ఈ బౌలర్ ను తీసుకోవడం అందరీని ఆశ్చర్య పరిచింది. కానీ సన్ రైజర్స్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాణించాడు రషీద్. 13 మ్యాచులు ఆడిన అప్ఘన్ బౌలర్ 17 వికెట్లు పడగొట్టాడు. -
పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!
-
పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!
బీజింగ్: బస్సులో ప్రయాణిస్తున్న ఓ పురుషుడికి చెప్పుకోలేని అవమానం ఎదురైంది. తన పాటికి తాను బస్సులో నిలబడి ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ యువతి అతడి ప్యాంటును లాగింది. మోకాళ్ల కిందకు జారీపోయిన ప్యాంటుతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సరేలే అని సర్దుకున్నా.. సీసీ కెమెరాల పుణ్యమా అని అతడి వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హాట్‌టాపిక్‌గా మారింది. చైనాలోని వూ షాన్లులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. రక్షించుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది. అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఈ దృశ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వస్తున్నాయి. అయితే.. 'పాపం ఆ యువతి కావాలని లాగలేదు' అని కొందరు వెనుకేసుకొస్తున్నారు. -
ఫైనల్లో యువ భారత్
రాణించిన సుందర్, పంత్ * అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుందర్ వాషింగ్టన్ (75 బంతుల్లో 50; 6 ఫోర్లు; 2/25) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు చేసింది. హసన్ మిరాజ్ (90 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. సైఫ్ హసన్ (33), సైఫుద్దీన్ (30) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి నెగ్గింది. రిషబ్ పంత్ (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అమన్‌దీప్ (41), ఇషాన్ కిషన్ (24), విరాట్ సింగ్ (21) తలా కొన్ని పరుగులు జత చేశారు. పంత్, ఇషాన్‌లు 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి ఓ దశలో భారత్ 116 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ దశలో సుందర్, అమన్‌దీప్ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.