DC Vs CSK: చెన్నైకు మరో షాక్‌.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం | IPL 2021 2nd Phase DC Vs CSK Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

DC Vs CSK: చెన్నైకు మరో షాక్‌.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

Published Mon, Oct 4 2021 6:13 PM | Last Updated on Tue, Oct 5 2021 6:34 PM

IPL 2021 2nd Phase DC Vs CSK Match Live Updates And Highlights - Sakshi

చెన్నైకు మరో షాక్‌.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 3 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. 137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతూ లక్ష్యాన్ని చేధించింది.  చివర్లో హెట్‌మైర్‌(28)  కీలక ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. అంతకముందు శిఖర్‌ ధావన్‌ 39 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, జడేజా  రెండు వికెట్లు సాధించగా, హాజెల్‌వుడ్ , దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో  చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది.   వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు.  40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్‌ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్‌, అవేశ్ ఖాన్ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఢిల్లీకు బిగ్‌ షా​క్‌.. ధావన్‌ (39) ఔట్‌
137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతుంది. కేవలం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి ఊపు మీద ధావన్‌ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో మొయిన్‌ అలీకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 28 బంతుల్లో 36 పరుగులు కావాలి. ప్రస్తుతం​ 15.4 ఓవర్లులో 6 వికెట్లు కోల్పోయి 103  పరుగులు చేసింది.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. కెప్టెన్‌ పంత్‌ (15)ఔట్‌
కెప్టెన్‌ పంత్‌ (15) రూపంలో ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మొయిన్‌ అలీకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో ఢిల్లీ 84 పరుగులు చేసింది. ధావన్‌(​‍32) రిపల్ పటేల్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్ (2)ఔట్‌
స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(2) రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. మరో వైపు ధావన్‌ మాత్రం ఫోర్లు, సిక్స్‌రలతో చెన్నై బౌలర్లపైన విరుచుకు పడుతున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి  ఢిల్లీ 64 పరుగులు చేసింది. ధావన్‌(​‍32), పంత్‌(9) పరుగులతో ‍ క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18)ఔట్‌
137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వి​కెట్‌ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో పృథ్వీ షా(18),  డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లలో ఢిల్లీ వికెట్‌ నష్టానికి 27  పరుగులు చేసింది. ధావన్‌(​‍6), అయ్యర్‌(1) పరుగులతో ‍ క్రీజులో ఉన్నారు.

అర్దసెంచరీతో మెరిసిన రాయుడు.. సీఎస్‌కే 20 ఓవర్లలో 136/5
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే పవర్‌ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది.   వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు.  40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్‌ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్‌, అవేశ్ ఖాన్ చెరో వికెట్‌ పడగొట్టారు

                                           
                                                                                              Photo Courtesy: IPL

వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన  చెన్నై
ఢిల్లీ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాట్సమన్‌లు పెవిలియన్‌కు  క్యూ కడుతున్నారు. కేవలం 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి సీఎస్‌కే పీకల్లోతు కష్టా‍ల్లో పడింది. వరుస క్రమంలో ఉతప్ప (19), మొయిన్‌ అలీ(5) వికెట్లును కోల్పోయింది.  ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. రాయుడు (2), ధోని (1) పరుగులతో  క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్‌ చెరో వికెట్‌ సాధించారు.

రెండో వికెట్‌ కోల్పోయిన చెన్నై.. గైక్వాడ్‌ (13) ఔట్‌
గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రుతురాజ్‌ గైక్వాడ్‌ కేవలం 13పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు.  అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో ఆశ్విన్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్‌కే 5 ఓవర్లలో 2 వికెట్లు సష్టపోయి 41 పరుగులు చేసింది. ఉతప్ప (1), మొయిన్‌ అలీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. 35/1
ఓపెనర్‌ డుప్లెసిస్‌(10) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌,  అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 4ఓవర్లో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. రుతురాజ్‌ (13), ఉతప్ప (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

దుబాయ్‌: ఐపీఎల్ 2021లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న   చెన్నై సూపర్ కింగ్స్,  ఢిల్లీ క్యాపిటల్స్  మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ  తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా లీగ్‌లో ఇరు జట్లు 24 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా చెన్నై 15 .. ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. కాగా ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో  ఢిల్లీ  7 వికెట్ల తేడాతో సీఎస్‌కేపై ఘనవిజయం సాధించింది . పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు,  ధోని (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మైర్‌, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement