ఏడాది తర్వాత బ్యాట్ పట్టిన సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాత రోజులను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో వీర లెవెల్లో విజృంభించిన ధోని.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం (16 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైనప్పటికీ ధోని మాత్రం చాలాకాలం తర్వాత అభిమానులను అలరించాడు.
MS Dhoni x @RishabhPant17 😁pic.twitter.com/lbFkNkwsWM
— CricTracker (@Cricketracker) March 31, 2024
ఈ క్రమంలో ధోని పలు రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా.. ఐపీఎల్‌లో 19, 20 ఓవర్లలో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా.. టీ20ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత, ఏషియన్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
MS Dhoni is the only batter with 200+ strike rate against Delhi tonight.pic.twitter.com/bUxudHAEYU
— CricTracker (@Cricketracker) March 31, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ధోని చెలరేగినప్పటికీ సీఎస్‌కే 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని లేటుగా క్రీజ్‌లోకి రావడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పృథ్వీ షా (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రిషబ్ పంత్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పతిరణ 3 వికెట్లతో రాణించాడు.
DHONI RULES EVERYTHING IN CRICKET 🦁🐐pic.twitter.com/mI4D3qUBIp
— Johns. (@CricCrazyJohns) March 31, 2024
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. ఖలీల్ అహ్మద్ (4-1-21-2), ముకేశ్ కుమార్(3-0-21-3), అక్షర్ పటేల్ (3-0-20-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రుతురాజ్ (1),రచిన్ రవీంద్ర (2), సమీర్ రిజ్వి (0) విపలం కాగా.. రహానే (45), డారిల్ మిచెల్ (34) పర్వాలేదనిపించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (21 నాటౌట్), ధోని చెలరేగిప్పటికీ అప్పటికే సీఎస్‌కే ఓటమి ఖరారైపోయింది. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది తొలి ఓటమి కాగా.. ఢిల్లీ బోణీ కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment