
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని మాత్రం తన అభిమానులను అలరించాడు. ఈ ఏడాది సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల వర్షం కురిపించాడు.
బుల్లెట్ల లాంటి షాట్లు కొడుతూ ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ధోని సిక్సర్లు కొడుతుంటే స్టేడియం హోరెత్తిపోయింది. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్‌లో అయితే ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ధోనీ 4, 6, 0, 4, 0, 6లతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్‌లో ధోని కొట్టిన సింగిల్ హ్యాండ్ సిక్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ షాట్‌గా నిలిచింది. ధోని మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తలా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#Dhoni can reach anything and everything. 🔥💪
— Satan (@Scentofawoman10) March 31, 2024
pic.twitter.com/bAaxqdezgb
Comments
Please login to add a commentAdd a comment