
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా): సోదరికి కానుక ఇద్దామని చీర ఆర్డర్ చేస్తే సగానికి చిరిగిన పాత ప్యాంటు డెలివరీ అయిన ఘటన పెనుగంచిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు పండుగకు తన సోదరికి చీర కొనిద్దామనుకున్నాడు. ఓ ఆన్‌లైన్ యాప్‌లో రూ.550 విలువ గల చీర బుక్ చేశాడు.
శనివారం ఆర్డర్ అందింది. డెలి వరీ బాయ్‌కు డబ్బు చెల్లించి, కవర్‌ను తెరిచి చూడగా దానిలో చీరకు బదులు చిరిగిన పాత ప్యాంట్ అదీ ఒక కాలు వరకు మాత్రమే ఉండ టంతో అవాక్కయ్యారు. ఇదేమని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా తమకేం తెలియదని, రిటన్ ఆప్షన్ ఉంటుంది చేసుకోమంటూ సలహా ఇచ్చాడు. జరిగిన దానికి తానేమీ చేయలేనని, ఆన్‌లైన్ వ్యాపారంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిమరీ వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment