పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..! | woman slips and grabs hold of a man's shorts on a bus in China | Sakshi
Sakshi News home page

పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!

Published Wed, Jul 27 2016 11:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!

పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!

బీజింగ్: బస్సులో ప్రయాణిస్తున్న ఓ పురుషుడికి చెప్పుకోలేని అవమానం ఎదురైంది. తన పాటికి తాను బస్సులో నిలబడి ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ యువతి అతడి ప్యాంటును లాగింది. మోకాళ్ల కిందకు జారీపోయిన ప్యాంటుతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. సరేలే అని సర్దుకున్నా.. సీసీ కెమెరాల పుణ్యమా అని అతడి వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హాట్టాపిక్గా మారింది.

చైనాలోని వూ షాన్లులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. రక్షించుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది. అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఈ దృశ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వస్తున్నాయి. అయితే.. 'పాపం ఆ యువతి కావాలని లాగలేదు' అని కొందరు వెనుకేసుకొస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement