grabs
-
పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం
కోపెన్హాగన్: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమస్టర్‌డ్యామ్‌లో పర్యావరణానికి సంబంధించిన ర్యాలీలో ఆమె మైక్‌ను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కున్నాడు. థన్‌బర్గ్ పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. #GretaThunberg gets interrupted at a climate rally after she speaks up about #Palestine the crowd begins to chant " let her speak" pic.twitter.com/XdrdPD4qyW — Arthur Morgan (@ArthurM40330824) November 13, 2023 అణిచివేతకు గురవుతున్నారు.. స్వతంత్య్రం కోసం పోరాడుతున్నారు.. ప్రపంచ శాంతి లేకుండా పర్యావరణ సమతుల్యాన్ని సాధించలేం అని థన్‌బర్గ్ అన్నారు. పాలస్తీనీయులు ధరించినట్లు తలకొప్పు ధరించి.. ఆక్రమిత ప్రాంతాల్లో పర్యావరణం కాపాడలేం అంటూ నినదించారు. ఈ సమయంలోనే ర్యాలీలో ఓ గుంపు పాలస్తీనాకు స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన ర్యాలీని థన్‌బర్గ్ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. రాజకీయ విషయాలు మాట్లాడవద్దంటూ ర్యాలీలో ముందుకు వచ్చి థన్‌బర్గ్ వద్ద ఉన్న మైక్‌ను లాక్కున్నాడు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా గాజాలో కొంతభాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పాలస్తీనాకు అండగా నినదిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసేదే సరైనదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ను తొలగించిన రిషి సునాక్ -
మహిళపై షాప్కీపర్ దౌర్జన్యం.. గొంతు పట్టుకుని..
లండన్‌లోని పెక్హోమ్లో దుకాణాదారుడు ఓ నల్లజాతి మహిళపై అమానవీయంగా ప్రవర్తించాడు. మహిళను గొంతు పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు. హెయిర్ షాప్‌లో ఇంతకు ముందు తీసుకున్న వస్తువులకు రీఫండ్ చేసే అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం షాప్ కీపర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెక్హోమ్లోని రే లేన్‌లో హెయిర్ అండ్ కాస్మెటిక్స్ దుకాణం ఉంది. షాప్‌లోకి ఓ నల్లజాతీయురాలు వచ్చి దుకాణాదారుడితో ఏదో మాట్లాడుతోంది. ఇంతకు ముందు తీసుకున్న వస్తువులపై రీఫండ్ విషయంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దుకాణాదారుడు నిగ్రహం కోల్పోయాడు. మహిళ గొంతు పట్టుకుని దాడి చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Context: A Black woman in Peckham was refused a refund for hair extensions and went to take something as a personal compensation. She was refused exit and started violently hitting the shop owner before he proceeded to STRANGLE her. pic.twitter.com/OEYZinoAOH — ᴼᴹᴳ ᶥᵗˢ Adàeze (@nubianbarbieeee) September 12, 2023 సదరు దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. నల్లజాతీయురాలిపై దాడి చేసినందుకు ఆ షాప్ ముందు నిరసనకు దిగారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దోషులకు కఠినంగా శిక్ష విధిస్తామని హామి ఇచ్చారు. ఇదీ చదవండి: వీడియో: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు, ఆలస్యంగా బయటకు.. -
వైరల్ వీడియో: జస్ట్ కారు దిగి వచ్చింది..దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..
-
జస్ట్ కారు దిగి వచ్చింది.. దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..
క్రూర మృగాలు దాడులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అడవిలో జంతువుల వేటా ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడొక పెద్ద పులి భలే కామ్‌గా వచ్చి లటుక్కున మహిళను పట్టుకుపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఒక కారు అడవి మార్గం గుండా వెళ్తోంది. ఇంతలో సడెన్‌గా కారు ఆగింది. ఒక మహిళ కారు దిగి ముందుకు వచ్చి అటు వైపు ఉన్న డోరు తీసి అందులో ఉన్నవారితో ఏదో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి ఒక్కసారిగా పెద్ద పులి వచ్చింది. వారంతా చూస్తుండగానే ఆ మహిళను అడవిలోకి ఏదో బొమ్మను లాక్కెళ్లినట్లు లాక్కుపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో కారులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. వారు తేరుకుని ఆమెను రక్షించే అవకాశం కూడా లేకుండాపోయింది. Oh Shit pic.twitter.com/MG195HihOH — Terrifying As Fuck (@TerrifyingAsfuk) January 20, 2023 (చదవండి: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్: వీడియో వైరల్) -
భూములు లాక్కుంటే ఊరుకోం
∙ఎమ్మెల్యే స్వార్థం కోసమే భూసేకరణ ∙వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ సంగెం : పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వ్యవసాయ భూములను బల వంతంగా లాక్కుంటే ఊరుకునేది లేద ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. మం డల కేంద్రంలో ఆదివారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల కారిడార్ పేరుతో సంగెం మండలంలోని చింతలపల్లి, కృష్ణానగర్ గీసుకొండ మండలంలోని ఊకల్, శాయంపేట, రాయకుంట గ్రామాల్లోని పట్టా భూములను తీసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకముందే, అధికారులు అక్కడికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్వార్థం కోసమే భూసేకరణ చేయిస్తున్నారని విమర్శించారు. జనగామ జిల్లా కోసం ప్రజలు ఉద్యమం చేస్తుంటే 144సెక్షన్ పెట్టి భయబ్రాం తులకు గురి చేస్తున్నారన్నారు. ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పినట్లుగానే, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. సమావేశం లో వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు అప్పం కిషన్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బుల్లెట్ వెంకన్న, విద్యార్థి సంఘం నాయకుడు సుమిత్ గుప్తా, రాష్ట్ర యువజన నాయకుడు గుండ్ల రాజశేఖర్, బూర సుమన్, గ్రేటర్ బీసీ సెల్ అధ్యక్షుడు రజినీ కాంత్, రవితేజరెడ్డి, మండల అధ్యక్షుడు మెట్టుపల్లి రమేశ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల గణేశ్, నాయకులు మె ట్టుపల్లి బాబు, ప్రవీణ్ పాల్గొన్నారు. -
పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!
-
పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!
బీజింగ్: బస్సులో ప్రయాణిస్తున్న ఓ పురుషుడికి చెప్పుకోలేని అవమానం ఎదురైంది. తన పాటికి తాను బస్సులో నిలబడి ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ యువతి అతడి ప్యాంటును లాగింది. మోకాళ్ల కిందకు జారీపోయిన ప్యాంటుతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సరేలే అని సర్దుకున్నా.. సీసీ కెమెరాల పుణ్యమా అని అతడి వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హాట్‌టాపిక్‌గా మారింది. చైనాలోని వూ షాన్లులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. రక్షించుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది. అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఈ దృశ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వస్తున్నాయి. అయితే.. 'పాపం ఆ యువతి కావాలని లాగలేదు' అని కొందరు వెనుకేసుకొస్తున్నారు. -
పేదల భూములు లాక్కుంటే సహించేది లేదు
రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజిరెడ్డి మెదక్: రెవెన్యూ అధికారులు పేదల భూములు లాక్కొని వారిని రోడ్డుపాలు చేస్తే చూస్తు ఊరుకోమని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు అకిరెడ్డి రాజిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారం శివారులో సర్వే నం.261లో మొత్తం 588 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదన్నారు. అందులో అదే గ్రామానికి చెందిన ఓ భూస్వామికి 365 ఎకరాలు ఉండగా, మిగతా 223 ఎకరాల ప్రభుత్వ గైరాన్ భూమిని 1984నుంచి 5యేళ్లపాటు అప్పటి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి 108మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద లబ్ధిదారులకు మూడు విడతల్లో పట్టాలు చేసి ఇచ్చారన్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా ఆ భూమిని నిరుపేదలైన ఎస్సీ,ఎస్టీ, బీసీలు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. 2001 నుంచి నిరుపేదలకు సంబంధించిన ఈ భూములను రెవెన్యూ అధికారులు ఎక్స్ సర్వీస్మెన్లకు పట్టాలు చేసి ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
గొరిల్లా నుంచి బాలున్ని రక్షించడానికి..
ఒహియో: ప్రమాదవశాత్తూ గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో పడ్డ బాలున్ని కాపాడడానికి 17 ఏళ్ల వయసున్న హరాంబే అనే గొరిళ్లాను జూ అధికారులు కాల్చి చంపారు. ఈ సంఘటన అమెరికాలో ఒహియోలోని సిన్సినాటీ జూ లో చోటుచేసుకుంది. జూ ను వీక్షించడానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ గొరిళ్లాలు ఉండే 10 నుంచి 12 అడుగుల లోతులో ఉన్న ఎన్‌క్లోజర్‌లో పడ్డాడు. ఆ సమయంలో ఆక్కడ మొత్తం మూడు గొరిల్లాలు ఉన్నాయి. వీటిలో రెండుగొరిల్లాలను బాలుడికి దూరంగా అధికారులు బయటకు పంపారు. కానీ అక్కడే ఉన్న మరో గొరిల్లా హరాంబే మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు. బాలున్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అటూ ఇటూ విసరసాగింది. దీంతో బాలున్ని కాపాడడానికి వేరే దారి లేక గొరిల్లాను జూ అధికారులు కాల్చి చంపారు. గొరిల్లాను చంపిన సమయంలో బాలుడు గొరిల్లా రెండు కాళ్ల మధ్యలో ఉన్నాడు. తీవ్రగాయాలైన బాలున్ని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే గొరిల్లా బాలునితో దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలను అందులోంచి తీసేసిట్టు అధికారులు తెలిపారు.