
క్రూర మృగాలు దాడులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అడవిలో జంతువుల వేటా ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడొక పెద్ద పులి భలే కామ్‌గా వచ్చి లటుక్కున మహిళను పట్టుకుపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఒక కారు అడవి మార్గం గుండా వెళ్తోంది. ఇంతలో సడెన్‌గా కారు ఆగింది.
ఒక మహిళ కారు దిగి ముందుకు వచ్చి అటు వైపు ఉన్న డోరు తీసి అందులో ఉన్నవారితో ఏదో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి ఒక్కసారిగా పెద్ద పులి వచ్చింది. వారంతా చూస్తుండగానే ఆ మహిళను అడవిలోకి ఏదో బొమ్మను లాక్కెళ్లినట్లు లాక్కుపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో కారులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. వారు తేరుకుని ఆమెను రక్షించే అవకాశం కూడా లేకుండాపోయింది.
Oh Shit pic.twitter.com/MG195HihOH
— Terrifying As Fuck (@TerrifyingAsfuk) January 20, 2023
(చదవండి: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment