- రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజిరెడ్డి
మెదక్: రెవెన్యూ అధికారులు పేదల భూములు లాక్కొని వారిని రోడ్డుపాలు చేస్తే చూస్తు ఊరుకోమని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు అకిరెడ్డి రాజిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారం శివారులో సర్వే నం.261లో మొత్తం 588 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదన్నారు.
అందులో అదే గ్రామానికి చెందిన ఓ భూస్వామికి 365 ఎకరాలు ఉండగా, మిగతా 223 ఎకరాల ప్రభుత్వ గైరాన్ భూమిని 1984నుంచి 5యేళ్లపాటు అప్పటి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి 108మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద లబ్ధిదారులకు మూడు విడతల్లో పట్టాలు చేసి ఇచ్చారన్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా ఆ భూమిని నిరుపేదలైన ఎస్సీ,ఎస్టీ, బీసీలు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.
2001 నుంచి నిరుపేదలకు సంబంధించిన ఈ భూములను రెవెన్యూ అధికారులు ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు పట్టాలు చేసి ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.