- ∙ఎమ్మెల్యే స్వార్థం కోసమే భూసేకరణ
- ∙వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్
భూములు లాక్కుంటే ఊరుకోం
Published Sun, Sep 11 2016 11:27 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
సంగెం : పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వ్యవసాయ భూములను బల వంతంగా లాక్కుంటే ఊరుకునేది లేద ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. మం డల కేంద్రంలో ఆదివారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల కారిడార్ పేరుతో సంగెం మండలంలోని చింతలపల్లి, కృష్ణానగర్ గీసుకొండ మండలంలోని ఊకల్, శాయంపేట, రాయకుంట గ్రామాల్లోని పట్టా భూములను తీసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకముందే, అధికారులు అక్కడికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్వార్థం కోసమే భూసేకరణ చేయిస్తున్నారని విమర్శించారు.
జనగామ జిల్లా కోసం ప్రజలు ఉద్యమం చేస్తుంటే 144సెక్షన్ పెట్టి భయబ్రాం తులకు గురి చేస్తున్నారన్నారు. ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పినట్లుగానే, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. సమావేశం లో వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు అప్పం కిషన్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బుల్లెట్ వెంకన్న, విద్యార్థి సంఘం నాయకుడు సుమిత్ గుప్తా, రాష్ట్ర యువజన నాయకుడు గుండ్ల రాజశేఖర్, బూర సుమన్, గ్రేటర్ బీసీ సెల్ అధ్యక్షుడు రజినీ కాంత్, రవితేజరెడ్డి, మండల అధ్యక్షుడు మెట్టుపల్లి రమేశ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల గణేశ్, నాయకులు మె ట్టుపల్లి బాబు, ప్రవీణ్ పాల్గొన్నారు.
Advertisement