ఉర్దూ వర్సిటీకి ఒక్క ఎకరా కేటాయించారా?
ఉర్దూ వర్సిటీకి ఒక్క ఎకరా కేటాయించారా?
Published Tue, Aug 16 2016 11:23 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– మైనారిటీ ఓట్ల కోసం హడావుడి
– బాబు రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
– విలేకర్ల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధ్వజం
కర్నూలు(టౌన్): ‘ఉర్దూ యూనివర్సిటీæ నిర్మాణం ఇంకా మొదలుకాలేదు. నిధులు కేటాయించలేదు. వర్సిటీకి రిజిస్ట్రార్ తప్పా..అధ్యాపకులు, సిబ్బందిని నియమించలేదు. అంతేందుకు యూనివర్సిటీ పేరుమీద ఒక్క ఎకరా భూమి బదలాయింపు జరిగిందా?’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హాఫీజ్‌ఖాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదంతా మైనారిటి ఓట్ల కోసమే అధికారపార్టీ నేతలు చేస్తున్న హడావుడి అని మండిపడ్డారు. మంగళవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీ తరగతులు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్నట్లు ప్రచారం చేయకపోవడంతో మొత్తం ఆరు కోర్సుల్లో 180 సీట్లు ఉంటే 55 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఉర్దూ వర్సిటీ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఇంగ్లిషులో ముద్రించడం సిగ్గుచేటన్నారు. 2004 సవంత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం దష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రహెమాన్ మాట్లాడుతూ జిల్లాలో 7 ఎకరాల్లో హజ్‌హౌస్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ నీటి మూటలేనా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం టీడీపీ వేస్తున్న ఎత్తుగడలను ముస్లిం మైనార్టీలు, మత పెద్దలు గమనించాలని కోరారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమా...?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండున్నరేళ్ల పాలనలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో దానిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ నేతలకు ౖÐð ఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య సవాల్ విసిరారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇతరపార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే బాబు చేసిన అభివద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత 2014 సంవత్సరంలో కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబునాయుడు ప్రజలకు 23 హమీలు ఇచ్చారన్నారు. అందులో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు.రెండురోజుల క్రితం అనంతపురంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో కూడా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మరోసారి మోసం చేసేందుకు యత్నించారన్నారు. ఎప్పుడూ డబ్బుల్లేవు అనే ముఖ్యమంత్రి మరి ఇచ్చిన హామీలకు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలపై ప్రభుత్వం 6 నెలల ముందే ఎందుకు మేల్కోలేదన్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేవలం కాంట్రాక్టర్లకు, పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టేందుకే హడావుడి పనులతో ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. ప్రజల్లో తెలుగుదేశానికి విశ్వసనీయత పోయిందని, అందుకనే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు భయపడుతున్నారని చెప్పారు. కర్నూలు నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ఉన్న ప్రజాదరణను చూసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు జంకుతున్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీసెల్ నాయకులు జహీర్‌ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మద్దయ్య, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు టి.వి. రమణ పాల్గొన్నారు.
Advertisement