కోపెన్‌హాగన్: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమస్టర్‌డ్యామ్‌లో పర్యావరణానికి సంబంధించిన ర్యాలీలో ఆమె మైక్‌ను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కున్నాడు. థన్‌బర్గ్ పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు.
#GretaThunberg gets interrupted at a climate rally after she speaks up about #Palestine the crowd begins to chant " let her speak" pic.twitter.com/XdrdPD4qyW
— Arthur Morgan (@ArthurM40330824) November 13, 2023
అణిచివేతకు గురవుతున్నారు.. స్వతంత్య్రం కోసం పోరాడుతున్నారు.. ప్రపంచ శాంతి లేకుండా పర్యావరణ సమతుల్యాన్ని సాధించలేం అని థన్‌బర్గ్ అన్నారు. పాలస్తీనీయులు ధరించినట్లు తలకొప్పు ధరించి.. ఆక్రమిత ప్రాంతాల్లో పర్యావరణం కాపాడలేం అంటూ నినదించారు. ఈ సమయంలోనే ర్యాలీలో ఓ గుంపు పాలస్తీనాకు స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన ర్యాలీని థన్‌బర్గ్ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. రాజకీయ విషయాలు మాట్లాడవద్దంటూ ర్యాలీలో ముందుకు వచ్చి థన్‌బర్గ్ వద్ద ఉన్న మైక్‌ను లాక్కున్నాడు.
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా గాజాలో కొంతభాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పాలస్తీనాకు అండగా నినదిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసేదే సరైనదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్‌మన్‌ను తొలగించిన రిషి సునాక్
Comments
Please login to add a commentAdd a comment