MIC
-
పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం
కోపెన్హాగన్: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమస్టర్‌డ్యామ్‌లో పర్యావరణానికి సంబంధించిన ర్యాలీలో ఆమె మైక్‌ను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కున్నాడు. థన్‌బర్గ్ పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. #GretaThunberg gets interrupted at a climate rally after she speaks up about #Palestine the crowd begins to chant " let her speak" pic.twitter.com/XdrdPD4qyW — Arthur Morgan (@ArthurM40330824) November 13, 2023 అణిచివేతకు గురవుతున్నారు.. స్వతంత్య్రం కోసం పోరాడుతున్నారు.. ప్రపంచ శాంతి లేకుండా పర్యావరణ సమతుల్యాన్ని సాధించలేం అని థన్‌బర్గ్ అన్నారు. పాలస్తీనీయులు ధరించినట్లు తలకొప్పు ధరించి.. ఆక్రమిత ప్రాంతాల్లో పర్యావరణం కాపాడలేం అంటూ నినదించారు. ఈ సమయంలోనే ర్యాలీలో ఓ గుంపు పాలస్తీనాకు స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన ర్యాలీని థన్‌బర్గ్ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. రాజకీయ విషయాలు మాట్లాడవద్దంటూ ర్యాలీలో ముందుకు వచ్చి థన్‌బర్గ్ వద్ద ఉన్న మైక్‌ను లాక్కున్నాడు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా గాజాలో కొంతభాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పాలస్తీనాకు అండగా నినదిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసేదే సరైనదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ను తొలగించిన రిషి సునాక్ -
కేవలం విపక్షాలు మాట్లాడినప్పుడే పని చేయడం లేద్సార్!
కేవలం విపక్షాలు మాట్లాడినప్పుడే పని చేయడం లేద్సార్! -
స్వామీజీ నుంచి మైక్ లాక్కున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాగేసుకున్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. తాను అందరిలా కాదని, ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేసి తీరుతానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు. వారి ఇబ్బందులను ఎవరూ తీర్చడం లేదని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్న సీఎం స్వామీజి నుంచి మైక్ లాగేసుకుని మధ్యలో మాట్లాడారు. తాను ఇతర నాయకుల్లా కాదని, ఏదైనా చెబితే చేసి తీరుతానని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పారు. #WATCH | Karnataka CM takes mic from seer Eshwaranandapuri Swami during an event to respond to his criticism on civic issues in Bengaluru, y'day CM said that he isn't one who only gives assurances but has released funds to find a solution to these problems pic.twitter.com/R3v3rAhfJz — ANI (@ANI) January 27, 2023 కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గుంతల రోడ్లు, ఇతర సమస్యలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు వరదల్లో మునిగిపోతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలనే స్వామీజి ప్రస్తావించగా సీఎం మైక్ లాక్కుని మధ్యలో జోక్యం చేసుకున్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
FIFA WC: వార్నీ వదిలేస్తే మొత్తం తినేసేలా ఉన్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం మొరాకో, క్రొయేషియా మధ్య మూడోస్థానం కోసం ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు అంతా సిద్ధం చేసుకున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడో స్థానంలో నిలుస్తుందా లేక తొలిసారి సెమీస్ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మొరాకో జట్టు మూడోస్థానం సాధించి కెరీర్ బెస్ట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి. ఈ సంగతి పక్కనబెడితే.. మొరాకో గోల్‌కీపర్ యాసీ బౌనౌ కుమారుడు చేసిన పని సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. పోర్చుగల్‌తో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసీ బౌనౌ తన కుమారుడితో కలిసి ఇంటర్య్వూ ఇచ్చేందుకు వచ్చాడు. యాసీ మాట్లాడుతుండగా.. రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్‌ను ఐస్‌క్రీం అనుకొని నాకడానికి ప్రయత్నించాడు. కానీ అది ఐస్‌క్రీం కాదని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. కొడుకు చేసిన పనిని గమనించిన యాసీ బౌనౌకు నవ్వు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మొరాకో గోల్‌కీపర్‌గా యాసీ బౌనౌ సూపర్ ఫామ్ కొనసాగించాడు. పెనాల్టీ అడ్డుకోవడంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాసీ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అదే ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పెనాల్టీల్లో ఐదింటిని గోల్స్ కాకుండా అడ్డుకున్నాడు. Yassine Bounou's son thinking the 🎤 to be 🍦 is supremely adorable! ❤️ #FIFAWorldCup pic.twitter.com/YTorvQwDvM — FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022 -
మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. -
ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి?
Machine Identification Code: దగ్గరున్న ప్రింటర్లోనో, ఏదో ఇంటర్నెట్ సెంటర్లోనో ఓ తప్పుడు కలర్ డాక్యుమెంట్‌ను ప్రింట్ చేశారు. ఎప్పుడో పాత తేదీని పెట్టుకున్నారు, పేర్లు మార్చారు. తీసుకెళ్లి ఏదో ధ్రువీకరణ కింద చూపించారు. కానీ ఎంత జాగ్రత్తపడ్డా.. ఎక్కడా లేశమాత్రం తేడా లేకుండా డాక్యుమెంట్‌ను ప్రింట్ చేసినా.. అడ్డంగా దొరికిపోయారు. దీనికి కారణం.. యెల్లో డాట్స్ (పసుపు రంగు చుక్కలు). ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? వాటితో లాభమేంటో తెలుసుకుందామా? ప్రింటర్లు నిఘా పెట్టినట్టా? వివిధ గుర్తింపుకార్డుల నుంచి ఇళ్లపత్రాలు, దొంగనోట్ల దాకా.. అక్రమార్కులు అన్నింటిలోనూ నకిలీలను, ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అసలు వాటికి, తప్పుడు పత్రాలకు తేడాను గుర్తించడం చాలా కష్టం కూడా. దీనికి చెక్ పెట్టేందుకే జపాన్‌లో పరిశోధకులు/అధికారులు కలిసి ‘యెల్లో డాట్స్’ను రంగంలోకి తెచ్చారు. ప్రింట్ చేసే ప్రతి పేజీలో.. లేజర్ కలర్ ప్రింటర్లు ప్రతిపేజీలో.. మనం గమనించలేనంత సూక్ష్మంగా, అంటే మిల్లీమీటర్లో పదో వంతు పరిమాణంలో ‘పసుపు రంగు’ చుక్కలను ముద్రిస్తాయి. పేజీలో కాస్త దూరం దూరంగా.. నిర్దిష్ట ఆకృతులు వచ్చేలా ఈ చుక్కలు ఉంటాయి. (ఉదాహరణకు బ్రెయిలీ లిపి మాదిరిగా అనుకోవచ్చు). సదరు ప్రింటర్ కంపెనీ, మోడల్, సీరియల్ నంబర్, సదరు పేజీని ప్రింట్ చేసిన తేదీ, సమయం వివరాలు ఆ ఆకృతుల్లో ఉంటాయి. దీన్ని ‘ప్రింటర్ స్టెగనోగ్రఫీ’ అని పిలుస్తున్నారు. పసుపు రంగే ఎందుకు? సాధారణంగా ఎరుపు, నీలం, నలుపు వంటి రంగులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి, అదే పసుపు రంగును, అందులోనూ లేతగా ఉంటే గుర్తించడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు ఈ రంగును ఎంచుకున్నారు. మనం ప్రింట్ చేసే కాగితాలపై అత్యంత సూక్ష్మంగా, దూరం దూరంగా పసుపు రంగు చుక్కలు ఉంటే.. సాధారణ కంటితో గుర్తించడం దాదాపు సాధ్యం కాదు కూడా. చదవండి: చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్ వివరాలను ఎలా గుర్తిస్తారు? పేజీల్లో ప్రింట్ అయ్యే పసుపు చుక్కల ప్యాటర్న్ (ఆకృతుల)ను గుర్తించేందుకు ‘ఈఎఫ్ఎఫ్ (ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్) ఆన్లైన్ డీకోడర్ల’ను వినియోగిస్తుంటారు. అందులో తేదీ, సమయం వివరాలు సులువు గానే తెలిసిపోతాయి. ఇక ప్రింటర్ మోడల్, సీరియల్ నంబర్ ఆధారంగా.. సదరు ప్రింటర్ కంపెనీ నుంచి వివరాలు తీసుకుంటారు. అధికారులు ఆ ప్రింటర్‌ను ఎవరు కొన్నారు, ఎక్కడ వినియోగిస్తున్నారనేది ట్రేస్ చేసి.. తప్పుడు డాక్యుమెంట్ మొత్తం చరిత్రను బయటికి తీస్తారు. ఇంకేం.. దొంగలు దొరికిపోయినట్టే. ఎప్పటి నుంచో ఉన్నా రహస్యమే.. 2017లో అమెరికాలో ఓ రహస్య పత్రం లీకైంది. దానిపై అక్కడి జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ చేపట్టి.. లీకేజీకి కారణమైన ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్‌ను గుర్తించి, అరెస్టు చేసింది. లీకైన పత్రాల కాపీలపై ఉన్న ఎల్లో డాట్స్ ఆధారంగానే ఆ కాంట్రాక్టర్‌ను పట్టేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశాన్ని రహస్యంగా ఉంచే ఉద్దేశంతో అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి? ► అయితే నకిలీలు, తప్పుడు పత్రాలను గుర్తించడం, ట్రాక్ చేయడంలో భాగంగా.. ఇలా ‘ఎల్లో డాట్స్’ను ముద్రించేలా కొన్ని పెద్ద ప్రింటర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు అమెరికా నిఘా సంస్థలు అంగీకరించడం గమనార్హం. ►ఈ ఎల్లో డాట్స్ ఆకృతుల్లోని సమాచారం ఏమిటని గుర్తించే కోడ్.. అటు ప్రభుత్వం, ఇటు ప్రింటర్ కంపెనీలఉన్నతాధికారులకు మాత్రమే తెలిసి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ చుక్కలను మనమూ చూడొచ్చు భూతద్దాలు వంటి వాటిని ఉపయోగించి పేజీలను పరిశీలిస్తే.. అతి చిన్నగా ఉండే ఈ పసుపు రంగు చుక్కలను గుర్తించవచ్చు. ఇంకా సులువుగా మొత్తం చుక్కలను చూడాలనుకుంటే.. పూర్తి చీకటిలో నీలి రంగు కాంతిని సదరు పేజీపై ప్రసరింపజేయాలని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల సదరు పసుపు రంగు చుక్కలు.. నల్లటి చుక్కల్లా కనిపిస్తాయని వివరిస్తున్నారు. ► కానన్, ఎప్సన్, డెల్, హ్యులెట్ ప్యాకర్డ్, ఐబీఎం, కొనికా, పానసొనిక్, జిరాక్స్, సామ్సంగ్ వంటి చాలా వరకు ప్రింటర్ తయారీ కంపెనీలు ‘ఎల్లో డాట్స్’ టెక్నాలజీని అమలు చేస్తున్నాయని ఈఎఫ్ఎఫ్ సంస్థ పేర్కొంది. ఏయే కంపెనీలకు చెందిన ఏ ప్రింటర్లలో దీనికి వాడుతున్నరన్న జాబితాలను తమ వెబ్సైట్లో కూడా పెట్టింది. బ్లాక్ అండ్ వైట్‌లో కష్టమే.. ఈ ఎల్లో డాట్స్ టెక్నాలజీ కేవలం కలర్ ప్రింటర్లకే పరిమితం. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లలో కేవలం నలుపు రంగును మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆ చుక్కలు సులువుగా కనిపిస్తాయి. సదరు డాక్యుమెంట్‌లోని అక్షరాలు, ఫొటోలు, ఇతర అంశాలు ఈ చుక్కలపై ఎఫెక్ట్ చూపించడంతో.. రహస్య కోడ్ దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎన్ఎంసీ తొలి చీఫ్‌గా సురేశ్
న్యూఢిల్లీ: వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు తొలి చీఫ్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సురేశ్ చంద్ర శర్మను ఎన్ఎంసీ చైర్మన్‌గా నియమించింది. నియామకాల కేబినెట్ కమిటీ శర్మ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు. సంబంధిత విధి నిర్వహణ కోసం ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఎన్ఎంసీకి ఒక చైర్ పర్సన్, 10 మంది ఎక్స్ అఫిషియొ సభ్యులు ఉంటారు. -
నీట్ (ఎంబీబీఎస్) అభ్యర్థులకు శుభవార్త
అమరావతి: నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను సడలించనున్నట్టు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులు 17-24 ఏళ్ల వారై ఉండాలి. అలాగే, మూడుసార్లు మాత్రమే ఈ అర్హత ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ రెండు నిబంధనలను సడలించాలని ఎంసీఐ నిర్ణయించింది. 17 ఏళ్ల వయసు లేకపోయినా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశమిస్తే బాగుంటుందని ఎంసీఐ కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే గరిష్ట వయోపరిమితితో పాటు ఎన్ని సార్లు ఈ అర్హత పరీక్ష రాసుకోవచ్చు అనేది ఇంకా నిర్ణయించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై రెండ్రోజుల్లో అన్ని రాష్ట్రాలకు ఈ ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా పీజీ వైద్య విద్య కోసం పోటీ పడే విద్యార్థులకు మాత్రం ఎలాంటి వయసు సడలింపులివ్వడం లేదని ఎంసీఐ వర్గాలు తెలిపాయి. వైద్య సీట్ల పెంపుపై కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత: పీజీ వైద్య సీట్ల పెంపుపై కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత వస్తుందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు స్పష్టం చేశారు. భారతీయ వైద్య మండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెరగాల్సిన సీట్లపై కసరత్తు జరుగుతోందని, ఈనెల 17న జరిగే ఎంసీఐ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. దీనిపై ఈనెల 20లోగా స్పష్టత వస్తుందని చెప్పారు. మొత్తం 6 కళాశాలల (గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురం) నుంచి వివిధ స్పెషాలిటీలకు సంబంధించి మొత్తం 380 సీట్లకు పైగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కనీసం 250 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ సీట్లన్నీ తొలివిడత కౌన్సెలింగ్‌లోపే జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న ఒక ప్రొఫెసర్‌కు ఇద్దరు విద్యార్థుల నిబంధనను సడలించి ఒక ప్రొఫెసర్‌కు ముగ్గురు విద్యార్థులను ప్రకటించడంతో సీట్లు పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు.