Lancashire Cricket League: Bowler Pulls Down Umpires Pants During Run Up, Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: బౌలింగ్‌ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్‌ పరువు తీశాడు

Published Sun, Aug 28 2022 5:13 PM | Last Updated on Sun, Aug 28 2022 5:53 PM

Bowler Pulls-Down Umpires Track Pants During Run-up Video Viral - Sakshi

క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్‌ను ఫ్రాంక్‌ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్‌ను కూడా ఫ్రాంక్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్‌ చేయాల్సింది మరిచి అంపైర్‌ ప్యాంట్‌ను లాగడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన లంకాషైర్‌ క్రికెట్‌ లీగ్‌లో చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే.. రిస్టన్‌ క్రికెట్‌ క్లబ్‌లో లంకాషైర్‌ లీగ్‌, ఈస్ట్‌ లంకాషైర్‌ క్రికెట్‌ క్లబ్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరిగింది. బౌలింగ్‌ వేయడానికి సిద్ధమైన బౌలర్‌ రన్‌అప్‌కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్‌అప్‌ తీసుకోకుండా నేరుగా అంపైర్‌ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్‌ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్‌ నవ్వుతూ అంపైర్‌కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్‌ ప్రాంక్‌'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. 

కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్‌ ప్రాంక్‌ చేయడం ఏమో గాని అంపైర్‌ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్‌.. కారణం ఏంటంటే?

Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement