క్రికెట్‌లో అంపైర్లు చేసే తప్పిదాలు కొన్నిసార్లు నష్టం కలిగిస్తే.. ఒక్కోసారి మేలు చేస్తాయి. అంపైర్లు తాము ఇచ్చే తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలైనప్పుడు వచ్చే విమర్శలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక బౌలర్.. బ్యాట్స్‌మన్ ఎవరైనా సరే అంతిమంగా ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సిగ్నల్‌కు కట్టుబడాల్సిందే. తాజాగా విలేజ్ క్రికెట్‌లో అంపైర్ నిర్ణయం మాత్రం నవ్వులు పూయించింది. అంపైర్ చర్య కంటే బ్యాటర్ చేసిన పని మరింత నవ్వు తెప్పించింది.
విషయంలోకి వెళితే.. బౌలర్ లెగ్‌సైడ్ అవతల బంతి వేయడం.. బంతి బ్యాటర్ వద్దకు చేరకముందే అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. అయితే క్రీజులో ఉన్న బ్యాటర్ మాత్రం కనీసం అంపైర్ ఇచ్చిన సిగ్నల్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో సదరు బ్యాటర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అంపైర్ ఇచ్చిన వైడ్ సిగ్నల్ చూసి బ్యాటర్ ఆగిపోయి ఉంటే బాగుండేది.. అనవసరంగా గెలికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ షేర్ చేసింది. కాగా బ్యాటర్ చర్యను ట్రోల్ చేస్తూ క్రికెట్ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Umpire already signalling a wide…
— England’s Barmy Army (@TheBarmyArmy) August 1, 2022
OUT caught 🤣🤣🤣 pic.twitter.com/FWLpbTspUG
చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్‌లో ఐదో బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment