
క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు చాలా చూస్తుంటాం. అందులో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరింత నవ్వుకునేలా ఉంటే పదేపదే వీడియోనూ రిపీట్‌గా వేసుకొని చూస్తుంటాం. తాజాగా అలాంటిదే ఒక సంఘటన క్లబ్ క్రికెట్‌లో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఫీల్డర్ బౌండరీని ఆపే క్రమంలో జరిగిన చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మన కాళ్లకు పట్టిన దరిద్రం త్వరగా వదలదు అని పెద్దలు అంటుంటారు.
అది ఇక్కడ అక్షరాలా నిజమైంది. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ ఏదో ఆడాలని ప్రయత్నిస్తే అది ఇంకో చోట తాకి థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. బంతి స్పీడ్‌గా వెళ్లిందనుకుంటే పొరపాటే. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ కాదు కదా బంతిని ఆపడానికే నానా కష్టాలు పడ్డాడు. తొలిసారి బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే పరిగెత్తి బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టుకోవడంతో అరె ఫోర్ ఆగింది కదా అని అనుకున్నాం.
కానీ ఇంతలోనే ఊహించని పరిణామం జరిగింది. కీపర్ వైపు బంతి విసిరితే అతని కాలి షూకు తగిలి మళ్లీ వెనక్కొచ్చింది, బౌండరీ దాటింది. అంత కష్టపడి పరిగెత్తి చివరాఖరికి బంతిని మాత్రం బౌండరీ వెళ్లకుండా ఆపలేకపోయానని తెగ ఫీలయ్యాడు ఫీల్డర్. ఎంత కష్టపడితే ఏం లాభం ఫోర్ పోయిందిగా.. ఫోర్ ఇలా కూడా పోతుందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
I just watched this 25 times 😂 pic.twitter.com/ICRsu6UmMW
— Shiv Aroor (@ShivAroor) March 13, 2023