Fielders
-
పాపం తగలరాని చోట తగిలి..
క్రికెట్లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అయ్యో పాపం అనుకుంటాం. తాజాగా ఒక బ్యాటర్ పరుగు తీస్తున్న క్రమంలో ఫీల్డర్ వేసిన బంతి తగలరాని చోట తగిలి నానా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రదర్స్ ఎలెవెన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇండియన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేశారు.. అయితే ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో బంతి వచ్చి పొట్ట కింద భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగానే తగిలిందనుకుంటా పాపం నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవెన్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బల్వీందర్ సింగ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం పడే సమయానికి ఇండియన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆడుతుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్‌కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు విజయం సాధించింది. Timeline cleanser. Sound on for maximum dopamine injection. pic.twitter.com/Vk0bw7B71U — Georgie Parker (@georgieparker) March 23, 2023 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ ఇంగ్లండ్ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు -
కాలికి పట్టిన దరిద్రం.. ఫోర్ ఇలా కూడా పోతుందా?
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చాలా చూస్తుంటాం. అందులో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరింత నవ్వుకునేలా ఉంటే పదేపదే వీడియోనూ రిపీట్‌గా వేసుకొని చూస్తుంటాం. తాజాగా అలాంటిదే ఒక సంఘటన క్లబ్ క్రికెట్లో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఫీల్డర్ బౌండరీని ఆపే క్రమంలో జరిగిన చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మన కాళ్లకు పట్టిన దరిద్రం త్వరగా వదలదు అని పెద్దలు అంటుంటారు. అది ఇక్కడ అక్షరాలా నిజమైంది. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ ఏదో ఆడాలని ప్రయత్నిస్తే అది ఇంకో చోట తాకి థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. బంతి స్పీడ్‌గా వెళ్లిందనుకుంటే పొరపాటే. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ కాదు కదా బంతిని ఆపడానికే నానా కష్టాలు పడ్డాడు. తొలిసారి బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే పరిగెత్తి బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టుకోవడంతో అరె ఫోర్ ఆగింది కదా అని అనుకున్నాం. కానీ ఇంతలోనే ఊహించని పరిణామం జరిగింది. కీపర్ వైపు బంతి విసిరితే అతని కాలి షూకు తగిలి మళ్లీ వెనక్కొచ్చింది, బౌండరీ దాటింది. అంత కష్టపడి పరిగెత్తి చివరాఖరికి బంతిని మాత్రం బౌండరీ వెళ్లకుండా ఆపలేకపోయానని తెగ ఫీలయ్యాడు ఫీల్డర్. ఎంత కష్టపడితే ఏం లాభం ఫోర్ పోయిందిగా.. ఫోర్ ఇలా కూడా పోతుందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. I just watched this 25 times 😂 pic.twitter.com/ICRsu6UmMW — Shiv Aroor (@ShivAroor) March 13, 2023 చదవండి: ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?' -
ఫీల్డింగ్ పరిమితుల గొడవేంటి.. ఐసీసీ కొత్త రూల్స్ ఏంటంటే!
ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చేజింగ్‌లో హార్దిక్ దాటిగా ఆడడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే ఇరుజట్లు మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్లో ఓవర్ రేట్‌తో పాటు సర్కిల్ బయట ఫీల్డింగ్‌పై పరిమితులు అనే కొత్త పదం వినిపించింది. అంటే నిర్ణీత ఓవర్లలోగా ఇన్నింగ్స్ పూర్తి చేయలేకపోతే.. మిగిలి ఉన్న ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఈ అంశం భారత్-పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత వార్తల్లో నిలిచింది. -సాక్షి, వెబ్‌డెస్క్ అయితే ఈ నిబంధనను గత సంవత్సరమే ఐసీసీ క్రికెట్ కమిటీ మార్పును సిఫార్సు చేసింది. ఇది అన్ని ఫార్మాట్లలో ఆట యొక్క వేగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఐసీసీ సవరించిన ఈ రూల్స్‌తో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఐర్లాండ్ల మధ్య జనవరిలో సబీనా పార్క్‌లో జరిగింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22లో పేర్కొన్న ప్రకారం ఒక మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్‌తోపాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచకప్‌లో కూడా ఇదే నిబంధన అమలు కానుంది. ఇక ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన టీమిండియా నిర్ణీత సమయం ముగిసేలోగా 18 ఓవర్లు మాత్రమే పూర్తి చేసింది. దీంతో మిగిలిన రెండు ఓవర్లలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండడంతో పాక్ టెయిలెండర్లు స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా టీమిండియా ఇన్నింగ్స్‌ను పూర్తి చేసి ఉంటే పాకిస్తాన్ 130 పరుగులలోపే చేసి ఉండేది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ కూడా అదే తప్పు చేసింది. నిర్ణీత సమయంలో పాక్ తమ కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లించుకుంది. నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ వేసిన చివరి ఓవర్లలో 30 అడుగుల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు అంపైర్లు. ఇది టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉండటంతో భారత్ ఆఖరి 3 ఓవర్లలో భారీగా పరుగుల రాబట్టి (18 బంతుల్లో 32 పరుగులు) విజయం అందుకుంది. చదవండి: Asia Cup 2022: సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.. హార్దిక్‌కు అఫ్గనిస్తాన్ అభిమాని ‘ముద్దులు’! -
మా ఫీల్డర్లే గెలిపిస్తారు
ఆసీస్ బ్యాట్స్‌మన్ హెడ్ ధీమా చెన్నై: తమ జట్టులో అత్యంత నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారని, వారే భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జట్టు విజయానికి కారణమవుతారని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రెవిస్ హెడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఓ మ్యాచ్ గెలవాలన్నా.. ఓడాలన్నా ఫీల్డింగే కారణమవుతుంది. అయితే ఈ విషయంలో మా జట్టు గర్వపడాల్సి ఉంది. ఎందుకంటే అద్భుతమైన ఫీల్డింగ్ మా సొంతం. ఈ విషయంలో మేం చాలా కష్టపడ్డాం. తమ ఫీల్డింగ్‌తో జట్టును గెలిపించే వారు మా జట్టులో ఉన్నారు’ అని హెడ్ అన్నాడు. ఫించ్ అనుమానమే... ఆసీస్ పించ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది. అతడి కాలి పిక్క కండరాల నొప్పి ఎక్కువ కావడమే ఇందుకు కారణం. నెట్ ప్రాక్టీస్ సమయంలో తను గాయపడటంతో సెషన్‌కు దూరంగా ఉంచి విశ్రాంతి కల్పించారు. ఒకవేళ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే హెడ్ లేదా కార్ట్రైట్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. -
వదిలినా దొరికారు
► ఇంగ్లండ్ 268/8 బెయిర్ స్టో అర్ధసెంచరీ ► సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ► నాలుగు క్యాచ్‌లు వదిలేసిన ఫీల్డర్లు ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదు... ఇలాంటి స్థితిలో ఏ ప్రత్యర్థరుునా దొరికిన అవకాశాలను వినియోగించుకుని చెలరేగుతుంది. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం నిర్లక్ష్యపు షాట్లతో... ఏ మాత్రం బాధ్యత లేని ఆటతీరుతో తొలిరోజే భారత్‌కు దొరికారు. ఫీల్డర్ల నుంచి సహకారం లేకపోరుునా... బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో రాణించి మూడో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు. మొహాలీ: ఆరంభంలో బౌన్స... పాత బంతితో పేసర్ల రివర్స్ స్వింగ్... స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ నుంచి సహకారం లేకపోరుునా బంతుల్లో వైవిధ్యంతో స్పిన్నర్లు... వెరసి బౌలర్ల సమష్టి కృషితో మూడో టెస్టు తొలి రోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో మొదటిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలిఇన్నింగ్సలో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. బెరుుర్‌స్టో (177 బంతుల్లో 89; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్సతో అర్ధసెంచరీ చేయగా... బట్లర్ (80 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. స్టోక్స్ (29) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి రషీద్ (4 బ్యాటింగ్), బ్యాటీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్, జయంత్, జడేజా తలా రెండు వికెట్లు తీసుకోగా... షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. సెషన్ 1: ఆరంభంలో వికెట్లు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఇన్నింగ్‌సను ప్రారంభించింది. మూడు, పదో ఓవర్లలో షమీ బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా, అశ్విన్‌లు వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మరో ఎండ్‌లో డిఫెన్సకే ప్రాధాన్యమిచ్చిన హమీద్ (9)... ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు బౌండరీలతో ధాటిగా ఇన్నింగ్‌సను ప్రారంభించిన రూట్ (15)కూడా ... వికెట్ల ముందు జయంత్‌కు దొరికిపోయాడు. అశ్విన్ తన తొలిబంతికే కుక్ (27)ను పెవిలియన్‌కు పంపించి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో 51 పరుగులకే ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోరుుంది. లంచ్ విరామానికి మరో రెండు ఓవర్లు ఉందనగా అలీ (16) వికెట్‌ను షమీ తీయడంతో సెషన్లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఓవర్లు: 29; పరుగులు: 92; వికెట్లు: 4 సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్, బెరుుర్‌స్టో చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన బంతితో స్టోక్స్ (29)ను అవుట్ చేసి జడేజా ఈ జంటను విడదీశాడు. బట్లర్ అండతో 76 బంతుల్లో బెరుుర్‌స్టో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. తర్వాత మరో వికెట్ పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. ఈ సెషన్లో పార్థీవ్ ఒక క్యాచ్ వదిలేశాడు. ఓవర్లు: 33; పరుగులు: 113; వికెట్లు: 1 సెషన్ 3: బ్యాటింగ్‌లో తడబాటు టీ విరామానంతరం జడేజా బౌలింగ్‌లో బట్లర్ (43) ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో కోహ్లి ఒడిసిపట్టడంతో ఆరోవికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను పార్థీవ్ వదిలేశాడు. అనంతరం మరో ఆరు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా బెరుుర్స్టోను... 89వ ఓవర్లో వోక్స్‌ను అవుట్ చేసి భారత బౌలర్లు రోజును ముగించారు. ఓవర్లు: 28; పరుగులు: 63; వికెట్లు 3 కోహ్లి, స్టోక్స్ వాగ్వాదం భారత కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రెండో సెషన్లో నిలకడగా ఆడుతోన్న స్టోక్స్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో కోహ్లిసేన సంబరాల్లో మునిగింది. వికెట్ కోల్పోరుున ఉక్రోశంలో ఉన్న స్టోక్స్... పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ కోహ్లిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లి కూడా స్టోక్స్‌ను ఉద్దేశించి జవాబు ఇచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. చివరికి కోహ్లి ఈ విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంలో స్టోక్స్‌ను ఐసీసీ మందలించింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పారుుంట్‌ను చేర్చింది. రాహుల్‌కు మళ్లీ గాయం భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ గాయపడ్డాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా తన ముంజేతికి గాయమైంది. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తను ఇబ్బందిపడ్డాడు. దీంతో రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. గావస్కర్ చేతుల మీదుగా కరుణ్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. ‘క్రికెట్లో ఫీల్డర్ల నుంచి క్యాచ్‌లు చేజారిపోవడం సాధారణమే. ఒక్కోసారి వారే అద్భుతమైన క్యాచ్‌లతో బౌలర్‌కి న్యాయం చేస్తారు. ఇదంతా ఆటలో భాగంగానే చూడాలి. రోజురోజుకీ నా ఆట పరిణతి చెందుతుంది. కుంబ్లే, సంజయ్ బంగర్ చెప్పిన విధంగా నా బౌలింగ్‌ను మార్చుకున్నాను. ఆఫ్ స్టంప్ ఆవల బంతుల్ని సంధించి మంచి ఫలితాలను సాధిస్తున్నాను.’ - ఉమేశ్ యాదవ్ -
'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు'
న్యూఢిల్లీ: ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించడంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలకపాత్ర పోషించారని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 22 పరుగులతో సన్ రైజర్స్ విజయం సాధించింది. 'బౌలర్లు అద్భుతంగా రాణించారు. గాయంతో సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడిలేని లోటు తెలియకుండా చేశారు. ముఖ్యంగా బరీందర్ శరణ్ చాలా బాగుంది. అతడికి భువనేశ్వర్ కుమార్ మంచి సహకారం అందించాడు. మంచి విషయాలు నేర్చుకోవాలన్న ఆకాంక్ష టీమ్ లో చాలా ముఖ్యమ'ని వార్నర్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్ లోనూ తమ ఆటగాళ్లు స్థాయిమేరకు రాణించారని అన్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ మంచి క్యాచ్ లు పట్టారని ప్రశంసించాడు. రెండో క్వాలిఫయిర్ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. -
అసలు కోహ్లితో ‘పోరు’ మొదలైతేగా...
వాగ్వాదాలపై లీమన్ వ్యాఖ్య మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తన ఆటతో పాటు నోటితో కూడా విరాట్ కోహ్లి దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా మూడో టెస్టులో అతనికి, ఆసీస్ ఆటగాళ్లకు మధ్య చాలా సార్లు వాగ్వాదం జరిగింది. కోహ్లి ఎదురుదాడి ఆస్ట్రేలియాపై ప్రభావం చూపిం చిందా అనే ప్రశ్నకు జట్టు కోచ్ లీమన్ భిన్నంగా స్పందించాడు. విరాట్ తీరును అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ‘అసలు మేం ఇంకా విరాట్ కోహ్లితో పోరు మొదలు పెట్టనే లేదు’ అని లీమన్ సమాధానమివ్వడం విశేషం. ‘ఇది ఆసక్తికర సిరీస్. ఇరు జట్లు కూడా ఈ తరహాలో దూకుడుగా ఉండటాన్ని మేం కూడా ఇష్టపడతాం. ఇలాంటివి మైదానంలో ఎన్ని జరిగినా పట్టించుకోనవసరం లేదు. ఆసీస్ కూడా ఇదే తరహాలో ఆడుతుంది. చాలా కఠినమైన పరిస్థితుల్లో, తీవ్ర పోటీ మధ్య సిరీస్ సాగుతోంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అని లీమన్ అన్నాడు. ఆసీస్ ఆలస్యంగా డిక్లేర్ చేయడాన్ని కోచ్ సమర్థించుకున్నాడు. భారత్ కూడా బౌండరీ వద్ద ఫీల్డర్లు పెట్టి, కొత్త బంతి తీసుకోకుండా ఆత్మరక్షణ ధోరణిలోనే ఆడిందని, చివరి రోజు సిరీస్ గెలవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. హ్యూస్ కుప్పకూలిన సిడ్నీ మైదానంలో ఆఖరి టెస్టు జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ఉందని, అయితే సిరీస్‌లో జోరును కొనసాగిస్తారని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.