'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు' | Warner praises bowlers, fielders for win over KKR | Sakshi
Sakshi News home page

'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు'

Published Thu, May 26 2016 12:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు'

'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు'

న్యూఢిల్లీ: ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించడంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలకపాత్ర పోషించారని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 22 పరుగులతో సన్ రైజర్స్ విజయం సాధించింది.

'బౌలర్లు అద్భుతంగా రాణించారు. గాయంతో సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడిలేని లోటు తెలియకుండా చేశారు. ముఖ్యంగా బరీందర్ శరణ్ చాలా బాగుంది. అతడికి భువనేశ్వర్ కుమార్ మంచి సహకారం అందించాడు. మంచి విషయాలు నేర్చుకోవాలన్న ఆకాంక్ష టీమ్ లో చాలా ముఖ్యమ'ని వార్నర్ పేర్కొన్నాడు.

ఫీల్డింగ్ లోనూ తమ ఆటగాళ్లు స్థాయిమేరకు రాణించారని అన్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ మంచి క్యాచ్ లు పట్టారని ప్రశంసించాడు. రెండో క్వాలిఫయిర్ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement