Bowlers
-
పేస్ బౌలర్ల ప్రదర్శన వల్లే...
రాంచీ: ఇంగ్లండ్‌తో గత రెండు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించడంలో పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారని జట్టు బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. పిచ్‌లు అనుకూలంగా లేకపోయినా కీలక సమయాల్లో వారు చెలరేగడం వల్లే మ్యాచ్‌లు మనవైపు మొగ్గు చూపాయని అతను అన్నాడు. ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు తీసిన 36 వికెట్లతో పోలిస్తే పేసర్లు 22 వికెట్లు తీశారు. ‘సాధారణంగా భారత్‌లో దాదాపు అన్ని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తూనే ఉంటాయి. అశ్విన్, జడేజాలు ఎలాగూ ఇక్కడ వికెట్లు తీయగలరు. కానీ మన ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనే సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా మారింది. పరిస్థితులకు తగినట్లుగా స్పందించి పేసర్లు జట్టును ముందంజలో నిలిపారు. నాలుగో టెస్టుకు బుమ్రాలాంటి స్టార్ బౌలర్ దూరం కావడం నిరాశ కలిగించేదే. అయినా ఇతర పేసర్లకూ మంచి అనుభవం ఉంది. సిరాజ్ తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శనను మరచిపోవద్దు’ అని గిల్ ప్రశంసించాడు. పలువురు కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్ల వచ్చిన అవకాశాలను కొత్త ఆటగాళ్లు సమర్థంగా వాడుకున్నారన్న గిల్... సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లను ఉదాహరణగా చూపించాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాల కారణంగానే కొన్నిసార్లు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వాటిని అధిగమించి భారీ స్కోర్లపై దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. తొలి టెస్టులో శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయినా భారత జట్టు...ఆ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి రెండు టెస్టుల్లో ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచినట్లు గిల్ గుర్తు చేసుకున్నాడు. -
ధోని కెప్టెన్సీ అంటే అలెర్ట్ గా ఉండాలి...లేదంటే ఇంతే
-
టీ20 వరల్డ్‌కప్-2022లో ప్రమాదకర బౌలర్లు వీరే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ప్రమాదకర బౌలర్ల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్ దశలో పాల్గొనే జట్లతో పాటు మొత్తం 16 జట్ల నుంచి ఇద్దరు చొప్పున బౌలర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. బౌలర్ల పూర్వ ప్రదర్శన, ఫామ్, ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. గణాంకాలు, ర్యాంకింగ్స్‌ను అక్టోబర్ 10 వరకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు వివరించింది. ఆయా జట్లలోని ఇద్దరు స్ట్రయిక్ బౌలర్ల వివరాలు.. 1. ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2. భారత్: భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్ 3. సౌతాఫ్రికా: లుంగి ఎంగిడి, తబ్రేజ్ షంషి 4. ఆస్ట్రేలియా: జోష్ హేజిల్‌వుడ్,ఆడమ్ జంపా 5. న్యూజిల్యాండ్: ట్రెంట్ బౌల్ట్, లచ్లాన్ ఫెర్గూసన్ 6. శ్రీలంక: వనిందు హసరంగ, మహీష్ తీక్షణ 7. ఇంగ్లండ్: మార్క్ వుడ్, రీస్ టాప్లే 8. పాకిస్తాన్: మహ్మద్ వసిమ్, హరీస్ రౌఫ్ 9. బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్,ముస్తాఫిజుర్ రెహ్మాన్ 10. వెస్టిండీస్: ఓబెద్ మెక్కాయ్, జేసన్ హోల్డర్ 11. ఐర్లాండ్: జోష్ లిటిల్, మార్క్ అదైర్ 12. జింబాబ్వే: ల్యూక్ జాంగ్వే, టెండాయ్ చతారా 13. నమీబియా: జాన్ ఫ్రైలింక్, జేజే స్మిట్ 14. స్కాట్లాండ్: మార్క్ వ్యాట్, సాఫ్యాన్ షరీఫ్ 15. నెదర్లాండ్స్: ఫ్రెడ్ క్లాసెన్, బ్రాండన్ గ్లోవర్ 16. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: జహూర్ ఖాన్, జునైద్ సిద్దిఖీ -
ఎటు నుంచి చూసినా బౌలర్లకే కష్టం
మెల్బోర్న్ : లాక్డౌన్ తర్వాత క్రికెట్ టోర్నీ ఆరంభమైతే బౌలర్లు తిరిగి ఫామ్‌ను అందుకోవడం కొంచెం కష్టమేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్ నిర్వహించిన ఇంటర్య్వూలో పాల్గొన్న బ్రెట్ లీ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. లాక్డౌన్ తర్వాత లయను అందుకోవడంలో బ్యాట్స్‌మెన్ లేక బౌలర్లో ఎవరు ఎక్కువ ఇబ్బందికి గురవుతారని బ్రెట్ లీని ప్రశ్నించారు. దీనికి లీ స్పందిస్తూ..' కరోనా నేపథ్యంలో దాదాపు రెండు నెలలకు పైగా ఆటకు విరామం దొరికడంతో ప్రతీ ఆటగాడు ఇంటికే పరిమితమయ్యాడు. లాక్డౌన్ సమయంలో క్రికెటర్లు మొదలుకొని అథ్లెట్లు, ఇతర క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు ఇంట్లోనే ఉన్న గార్డెనింగ్ ఏరియాలు, ఇతర వనరులను వినియోగించుకొని తమ ప్రాక్టీస్‌ను మెరుగుపరుచుకుంటున్నారు. అదే క్రికెట్లో మాత్రం లాక్డౌన్ అనేది బ్యాట్స్మన్లు, బౌలర్లకు కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఒక బౌలర్ తన పూర్తిస్థాయి ఫామ్‌ను అందుకోవడానికి 6 నుంచి 8 వారాలు కచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. ఒక వన్డే మ్యాచ్ లేక టెస్టు మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ రిథమ్‌ను అందుకునేందుకు రెండు లేక మూడు మ్యాచ్‌లు చాలు.. కానీ బౌలర్‌కు అలా కాదు.. లయను అందుకోవాలంటే కచ్చితంగా 6 నుంచి 8 వారాల సమయం పడుతోంది. అందుకే నా దృష్టిలో ఒకవేళ ఆట ప్రారంభం తర్వాత బౌలర్‌కే కష్టం అని కచ్చితంగా చెప్తానంటూ' పేర్కొన్నాడు.('అందుకే నిన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు') బ్రెట్ లీ ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310, 221 వన్డేల్లో 380, 25 టెస్టుల్లో 28 వికెట్లు తీశాడు. కాగా సోమవారం విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ సహా కీమర్ రోచ్, షేన్ డౌరిచ్, షాయ్ హోప్‌లు కింగ్స్టన్ ఓవల్‌లోని బార్బడోస్ మైదానంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. అయితే ఇండియాలో కూడా ఆటగాళ్లు ఖాళీ మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తమ ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. -
‘ఐసీసీ ఆందోళన వారి గురించే’
దుబాయ్: కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ టోర్నీలు జరగలేదు. అయితే అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న వేళ క్రికెట్ పునరుద్దరించాలిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు వెంటనే మైదానంలోకి దిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేదానిపై ఐసీసీ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో బౌలర్ల గురించే ఐసీసీ ఆందోళన చెందుతోంది. ‘లాక్డౌన్ విరామంలో అనేక మంది ఆటగాళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో చిన్నపాటి వ్యాయామాలకే కొంత మంది ఆటగాళ్లు పరిమితమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి దిగితే గాయాలబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలర్ల గురించే మాకు ఎక్కువ ఆందోళనగా ఉంది. ఈ విరామం తర్వాత బౌలర్లకు సరైన శిక్షణ లేకుండా క్రికెట్ ఆడితే గాయాలబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వారు టెస్టు క్రికెట్‌కు సంసిద్దం కావాలంటే కనీసం రెండుమూడు నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలంటే మూడు నుంచి నాలుగు వారాల సన్నాహక శిబిరాల్లో పాల్గొనాలి’ అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటగాళ్లను 14 రోజుల క్వారంటైన్, మైదానంలో భౌతిక దూరం, ఒకరి వస్తువులు మరొకరు వాడొద్దనే నిబంధనలను ఐసీసీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’ నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్ -
పాక్ యువ సంచలనం షహీన్
దుబాయ్ : వసీం అక్రం, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది వంటి దిగ్గజాలు తమ ప్రదర్శనతో పాకిస్తాన్ క్రికెట్ బౌలింగ్‌కు పర్యాయ పదాలుగా నిలిచారు. ఇప్పుడు మరో ‘ఆఫ్రిది’ తెరపైకి వచ్చాడు. తన ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో లాహోర్ క్వాలాండర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే షహీన్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లను సంధించడంలోనూ దిట్ట. షహీన్‌కు ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆదర్శం. వసీం అక్రమ్ తరహాలో ఎడమ చేతి వాటం బౌలర్. ఇక్కడ వసీం లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైతే, షహీన్ది లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్. లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. ఇలా తన అద్భుత ప్రదర్శనతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును 114 పరుగులకే కట్టడి చేశాడు. ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. అనతికాలంలోనే పాకిస్తాన్ క్రికెట్లోకి దూసుకొచ్చిన 17 ఏళ్ల యువ సంచలనం షహీన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా బాగానే సంపాదించుకున్నాడు. అందులో పాక్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఉండటం విశేషం. ‘ ఒక కొత్త స్టార్ జన్మించాడు.. 17 ఏళ్ల షహీన్ ఆఫ్రిది పీఎస్ఎల్లో 5 వికెట్లు తీసిన యువ ఆటగాడు.. 22 బంతులు విసిరితే అందులో 18 డాట్ బాల్స్ ఉండటం అతని అద్భుత ప్రదర్శనకు నిదర్శనం.. ’అని అతని బౌలింగ్‌కు ఫిదా అయిన రమీజ్ రాజా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. A new star is born .. 17 year old Shaheen Afridi is youngest to 5 wickets in HBLPSL.. a triple wicket maiden over and 18 dots out of 22 bowled .. you kidding me.. — Ramiz Raja (@iramizraja) March 9, 2018 -
ఇది అత్యుత్తమ పేస్ దళం
కోల్‌కతా: ప్రస్తుతం దక్షిణాఫ్రికా వెళ్లనున్న అయిదుగురు పేస్ బౌలర్ల బృందం ఆ దేశంలో గతంలో పర్యటించిన భారత ఫాస్ట్ బౌలింగ్ బృందంతో పోలిస్తే అత్యుత్తమమైనదని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఇషాంత్, ఉమేశ్, షమీ, భుమీ, బుమ్రాలలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకత చూపగలిగినవారేనని వివరించాడు. ‘ప్రత్యర్థి బౌలింగ్ గురించి మాట్లాడను. మనవైపు మాత్రం విభిన్న వనరులున్నాయి. ఉమేశ్, షమీ 140 కి.మీ. వేగంతో బంతులేస్తూ స్వింగూ చేయగలరు. భువీ మంచి స్వింగ్ బౌలర్. బుమ్రా వైవిధ్యం చూపుతాడు. ఇషాంత్ ఎలాగూ ఉన్నాడు. వీరికి హార్దిక్ అదనపు బలమవుతాడు. స్వదేశంలో విజయాలు సాధించి వెళ్తుండటం ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దీనికితోడు మంచి జట్టు, అన్నిటికి మించి నంబర్ 1 టెస్టు జట్టు హోదాలో వెళ్తున్నాం. రహానే గురించి ఆందోళన లేదు. అతడు ప్రపంచవ్యాప్తంగా పరుగులు సాధించాడు’ అని ప్రసాద్ చెప్పారు. -
రాణించిన భారత ‘ఎ’ బౌలర్లు
ఆస్ట్రేలియా ‘ఎ’ 228 ఆలౌట్ బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో బ్యాటింగ్‌లో తడబడిన భారత ‘ఎ’ జట్టును బౌలర్లు ఆదుకున్నారు. వరుణ్ ఆరోన్ (3/41), జయంత్ యాదవ్ (3/44) రాణించడంతో రెండో రోజు శుక్రవారం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్సలో 228 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 2 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం దక్కింది. కెప్టెన్ హ్యాండ్‌సకోంబ్ (93 బంతుల్లో 87; 15 ఫోర్లు, 1 సిక్స్), బర్న్స్ (125 బంతుల్లో 78; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. హ్యాండ్‌సకోంబ్, బర్నస్ మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స ఆరంభించిన భారత జట్టు హేర్వాడ్కర్ (23), ఫజల్ (6) వికెట్లను కోల్పోరుు 44 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి పాండే (7), శ్రేయస్ (6) క్రీజులో ఉన్నారు. -
ఆస్ట్రేలియాలో శిక్షణకు యువ బౌలర్లు!
ముంబై: ముంబై, కర్ణాటకల నుంచి నలుగురు యువ బౌలర్లు ఆస్ట్రేలియాలోని సెంట్రాఫ్ క్రికెటింగ్ ఎక్సలెన్సీ శిక్షణకు ఎంపికయ్యారు. ముంబైకి చెందిన మినాద్ మంజ్రేకర్, తుషార్ దేశ్ పాండేలతో పాటు బెంగళూరుకు చెందిన ప్రషిత్ కృష్ణా, డేవిడ్ మాథాయిస్లు ఈ శిక్షణకు ఎంపికయ్యారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) బౌలింగ్ ఫౌండేషన్ల నుంచి తలో ఇద్దర్ని సెంట్రాఫ్ క్రికెటింగ్ ఎక్సలెన్సీ శిక్షణకు ఎంపిక చేశారు. గత కొన్నివారాల పాటు ఆయా క్యాంప్ ల్లో నిర్వహించిన పోటీల్లో ఈ నలుగురు విజేతలుగా నిలవడంతో వారిని ఆస్ట్రేలియాలో శిక్షణకు ఎంపిక చేశారు. తాజాగా ఎంపికైన ఈ యువ బౌలర్లు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జెఫ్ థాంప్సన్, కోచ్ విశాల్ మహదిక్ ల వద్ద నెలరోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ రెండు బౌలింగ్ ఫౌండేషన్లకు ఐడీబీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
నంబర్ వన్‌గా అండర్సన్
ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్ దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చెలరేగుతున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (884 పాయింట్లు) ఐసీసీ టెస్టు బౌలర్లలో నంబర్‌వన్‌గా నిలిచాడు. 1980లో ఇంగ్లండ్ నుంచి తొలిసారిగా ఇయాన్ బోథమ్ ఈ ఫీట్‌ను సాధించగా అండర్సన్ నాలుగోవాడు. భారత స్పిన్నర్ ఆర్.అశ్విన్ తనకన్నా 13 పాయింట్లు వెనకబడి రెండో ర్యాంకులోనే ఉండగా స్టువర్ట్ బ్రాడ్ మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో స్టీవ్ స్మిత్ (ఆసీస్) అగ్రస్థానంలో ఉండగా జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (కివీస్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్లలో అశ్విన్ టాప్‌లో ఉన్నాడు. -
'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు'
న్యూఢిల్లీ: ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించడంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలకపాత్ర పోషించారని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 22 పరుగులతో సన్ రైజర్స్ విజయం సాధించింది. 'బౌలర్లు అద్భుతంగా రాణించారు. గాయంతో సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడిలేని లోటు తెలియకుండా చేశారు. ముఖ్యంగా బరీందర్ శరణ్ చాలా బాగుంది. అతడికి భువనేశ్వర్ కుమార్ మంచి సహకారం అందించాడు. మంచి విషయాలు నేర్చుకోవాలన్న ఆకాంక్ష టీమ్ లో చాలా ముఖ్యమ'ని వార్నర్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్ లోనూ తమ ఆటగాళ్లు స్థాయిమేరకు రాణించారని అన్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ మంచి క్యాచ్ లు పట్టారని ప్రశంసించాడు. రెండో క్వాలిఫయిర్ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. -
కిం కర్తవ్యం!
♦ తలనొప్పిగా మారిన బౌలర్లు ♦ అయోమయంలో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ భారీస్కోర్లు చేసినా ఒక్కటి కూడా గెలవకపోవడం కచ్చితంగా ఏ జట్టునైనా నైరాశ్యంలోకి నెడుతుంది. భారత్ కూడా దీనికి అతీతం కాదు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలోనే ఇంతకంటే ప్లాట్ వికెట్లపై ఎదురైన ప్రతి జట్టునూ ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోతున్నారు. టి20 ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్ గురించి ఆలోచిస్తే... ఒక్క ధోనికే కాదు, భారత సెలక్టర్లకు కూడా ఈ సిరీస్‌లో బౌలర్ల ప్రదర్శన ఓ పెద్ద తలనొప్పి. సాక్షి క్రీడావిభాగం ‘మేం అదనంగా మరో 30 పరుగులు చేయడం... లేదా టాస్ గెలిచినా ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ ఇచ్చి ఛేజ్ చేయడం. ఈ రెండూ మినహా నా దగ్గర ప్రత్యామ్నాయం లేదు’... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 300 పైచిలుకు స్కోర్లు చేసి ఓడిపోయిన తర్వాత ధోని నిర్వేదం ఇది. భారత బలహీనతను గమనించిన ఆస్ట్రేలియా మూడో వన్డేలో టాస్ గెలిచినా భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చి మరోసారి లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. బౌలర్ల అనుభవలేమి తమ ఓటమికి ప్రధాన కారణంగా ధోని చెప్పుకొచ్చాడు. కానీ ఉమేశ్, ఇషాంత్ కలిసి 133 వన్డేలు ఆడారు. ఇషాంత్ ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది నాలుగోసారి. ఇక ఉమేశ్ యాదవ్ మూడు ప్రధాన సిరీస్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాలో పేసర్లకు ఎంతో కొంత సహకారం లభించే పిచ్‌లపై ఈ అనుభవం సరిపోదని అనుకోలేం. అశ్విన్ గత ఏడాది కాలంగా భారత జట్టు తరఫున అన్ని దేశాల్లోనూ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో మూడో వన్డే నాటికి అతను తుది జట్టులో స్థానమే కోల్పోయాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు ఏ పిచ్‌ల మీద అయినా రాణించాలి. గతంలో కుంబ్లే, హర్భజన్లు ఇవే పిచ్‌ల మీద వికెట్లు తీసిన విషయం మరువ కూడదు. అదే సమయంలో అశ్విన్ కూడా ఇదే ఆస్ట్రేలియాలో ఏడాది క్రితమే స్ట్రయిక్ బౌలర్‌గా వికెట్లు తీసిన సంగతీ మరువలేం. నిజానికి అనుభవలేమి కంటే... క్రమశిక్షణ లేకపోవడం భారత బౌలర్ల ప్రధాన సమస్య. షమీ లేకపోవడం లోటు ఈ సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు షాక్ తగిలింది. గత ఏడాది ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన షమీ... అప్పటి నుంచి గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేడు. తాజాగా ఈ సిరీస్‌కు ముందు కోలుకుని జట్టులోకి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు తొలి మ్యాచ్‌కు ముందే ప్రాక్టీస్‌లోనే గాయపడ్డాడు. ధోని చెప్పిన మాటలనే తీసుకుంటే షమీకి కూడా పెద్దగా అనుభవం లేదు. కానీ మంచి వేగంతో బంతుల్లో వైవిధ్యం చూపగల సత్తా ఉంది. ఉమేశ్ కూడా తన వేగంతో ప్రత్యర్థిని భయపెట్టాలి. కానీ లైన్ సరిగా లేక దెబ్బతిన్నాడు. కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాగానే కాళ్ల మీదకు రెండు బంతులు వేసి రెండు బౌండరీలు ఇస్తే ఏ కెప్టెన్ కూడా ఏం చేయలేడు. ఫీల్డింగ్ సెట్ చేసిన విధానానికి అనుగుణంగా బంతులు వేయాలనే ప్రాథమిక అంశాన్ని భారత బౌలర్లు ఈ వన్డే సిరీస్‌లో మరచిపోయారు. టి20 ప్రపంచకప్‌లో పరిస్థితి? మరో రెండు నెలల్లో భారత్ స్వదేశంలో టి20 ప్రపంచకప్ ఆడబోతోంది. నిజానికి దీనిని దృష్టిలో ఉంచుకునే జట్టులో పలు మార్పులు చేశారు. యువ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఇంకా ఆస్ట్రేలియాలో టి20లు ఆడకపోయినా... అందులో కూడా ఇంతకంటే భిన్నమైన ప్రదర్శనను ఆశించలేం. అయితే స్వదేశంలో భారత బౌలర్లు బాగా రాణిస్తారనేది ఒక అంచనా. అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు సొంతగడ్డపై కచ్చితంగా ప్రభావం చూపగలరు. కానీ స్వదేశంలో అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20ల ఫలితం తలచుకుంటే ఆందోళన పెరగడం ఖాయం. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ చిత్తుగా ఓడిపోయింది. ధర్మశాలలో 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా ఓడిపోయారు. భువనేశ్వర్, మోహిత్ శర్మ, అక్షర్, అశ్విన్... ఇలా భారత ప్రధాన బౌలర్లు, ఐపీఎల్లో చెలరేగిపోయే స్టార్స్ అంతా ఆ మ్యాచ్ ఆడారు. కానీ సఫారీలను నిలువరించలేకపోయారు. ప్రస్తుతం టి20 ఫార్మాట్లో అన్ని జట్లలోనూ భయంకరమైన హిట్టర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లు ఆ మెగా టోర్నీకి జట్టు ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు సహకరించే వికెట్లపై ప్రభావం చూపలేకపోయిన సీమర్లందరి విషయంలోనూ పునరాలోచన చేయాలేమో..! భవిష్యత్ గురించి ఆలోచన స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓడిపోవడం, తాజాగా ఆస్ట్రేలియాలో ప్రదర్శన తర్వాత కచ్చితంగా భవిష్యత్‌కు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. బరిందర్ శరణ్ లాంటి యువ బౌలర్‌కు కెరీర్లో ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లు రావడం ద్వారా మంచి ఆరంభం లభించింది. కానీ ఆ ఆత్మవిశ్వాసం తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అతను చూపించలేదు. అయినా వేగంగా బంతులు వేయగల ఇలాంటి క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్‌కు ఉపయోగపడేలా తయారు చేసుకోవాలి. ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్లో ఫ్లాట్ పిచ్‌లపై కూడా రాణిస్తున్న సీమర్లకు మెరుగైన అవకాశాలు ఇవ్వాలి. అంటే భారత్ ‘ఎ’ జట్టుకు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి, రాహుల్ ద్రవిడ్ లాంటి అనుభవజ్ఞుడికి వీరిని సాన బెట్టేందుకు అప్పగించాలి. ఇప్పుడే కోలుకుని భవిష్యత్ గురించి ప్రణాళికలు రచించకపోతే... మనోళ్లు కేవలం ఐపీఎల్ స్టార్స్‌గా మాత్రమే మిగిలిపోతారు. -
ప్లాన్ AB
స్పిన్ ఉచ్చులో పడ్డ డివిలియర్స్ ఏ జట్టుకైనా, ఏ విషయంలో అయినా రెండు ప్రణాళికలు ఉంటాయి. ప్లాన్ ఎ విఫలమైతే వెంటనే ప్లాన్ బి అమల్లోకి తెస్తారు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ముందు ఇలాంటి ప్లాన్లు పనికిరావు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి షాట్ ఆడతాడో తెలియకుండా బౌలర్లపై విరుచుకుపడతాడు. వన్డే సిరీస్‌లో డివిలియర్స్ ప్రతాపం చూసిన తర్వాత... టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై గెలవాలంటే డివిలియర్స్‌ను పూర్తిగా కట్టడి చేయాలని భారత్‌కు అర్థమైంది. ఎలాగూ స్పిన్ పిచ్లే సిద్ధంగా ఉన్నాయి. అయినా డివిలియర్స్‌ను ఆపాలంటే స్పిన్నర్లకూ ఓ వ్యూహం ఉండాలి. లేకపోతే కష్టం. అందుకే భారత స్పిన్ త్రయం డివిలియర్స్‌కు ‘ప్లాన్ ఏబీ’ సిద్ధం చేసింది. దానిని విజయవంతంగా అమలు చేసి సఫారీల వెన్నెముకను కట్టడిచేసింది. సాక్షి క్రీడా విభాగం: నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు డకౌట్ అయిన తర్వాత ‘చాలా కఠినమైన రోజు ఇది. అయితే ఇక్కడ ఎలా ఆడాలనే దానికి పరిష్కారం దొరికింది’ అని ఏబీ డివిలియర్స్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో అతను భిన్నంగా ఆడబోతున్నాడనేది మాత్రం అర్థమైంది. నిజంగానే స్టాన్స్ మార్చి ఏబీ భిన్నంగా ఆడేందుకు ప్రయత్నించాడు. అశ్విన్ బౌలింగ్‌లో 13 బంతులు ఎదుర్కొన్న అతను... ఎక్కువ భాగం ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు. ఎల్బీడబ్ల్యూల నుంచి తప్పించుకునేందుకు... స్వీప్ ఆడినా వికెట్లు వదిలేశాడు. ఒకసారి చాలా ముందుకొచ్చి భారీ షాట్‌కు కూడా ప్రయత్నించినా విఫలమయ్యాడు. సాధ్యమైనంత వరకు దూకుడుగా ఆడి అశ్విన్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తే తర్వాత చెలరేగవచ్చని భావించినట్లున్నాడు. అయితే ఈ జోరులో అతను అశ్విన్ చేతి నుంచి సిరీస్‌లో తొలిసారి వచ్చిన ‘క్యారమ్ బాల్’ విషయంలో అంచనా తప్పాడు. ఫలితంగా అంతసేపూ క్రీజ్‌లో వెనక్కి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడిన ఏబీ ‘ఇంజినీర్’ తెలివితేటలకు వికెట్ల ముందు దొరికిపోయాడు. ‘ఈ పర్యటన మొత్తంలో నేను అతనికి ఒక్క క్యారమ్ బాల్ కూడా వేయలేదు. ఇలాంటి పిచ్‌పై క్రీజ్ నుంచి దూరంగా విసురుతూ లోపలికి వచ్చేలా ప్రయత్నించాను. అదో అద్భుతమైన బంతి. నిజాయితీగా చెప్పాలంటే మేం పన్నిన ఉచ్చులో అతను చిక్కాడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. టి20ల నుంచే... దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఆమ్లా, డు ప్లెసిస్, డుమినిలాంటి ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఈ సిరీస్‌లో డివిలియర్స్ కీలకం అవుతాడని అందరూ అంచనా వేశారు. స్పిన్‌ను బాగా ఆడటంతో పాటు ఇక్కడ అందరికంటే ఎక్కువ క్రికెట్ అనుభవం కూడా అతని ఖాతాలో ఉంది. పైగా భారత్‌లో సిరీస్‌కు అడుగు పెట్టక ముందు అతను అటు టెస్టులు, ఇటు వన్డేల్లో కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో టీమిండియా ప్రధాన లక్ష్యం అతనే అయ్యాడు. రెండు టి20 మ్యాచ్‌లలోనూ అశ్విన్ బౌలింగ్‌లోనే డివిలియర్స్ బౌల్డ్ అయ్యాడు. రెండు సార్లూ ఫ్రంట్ ఫుట్‌పై ఆడే ప్రయత్నంలోనే వెనుదిరిగాడు. అప్పటి వరకు అతని కదలికలను గుర్తిస్తూ కెప్టెన్ ధోని చేసిన సూచనలను అశ్విన్ సమర్థంగా అమలు చేయగలిగాడు. అనంతరం కాన్పూర్‌లో జరిగిన తొలి వన్డేలో అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన డివిలియర్స్ 14 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఆ తర్వాత అశ్విన్ గాయంతో వెనుదిరగడంతో తర్వాతి నాలుగు వన్డేల్లో అతనికి భారత ఆఫ్ స్పిన్నర్ నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. ముగ్గురూ కలిసి... టెస్టు సిరీస్‌లో అశ్విన్‌కు అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా తోడయ్యారు. మొహాలీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిశ్రా సాధారణంగా వేసే బంతికంటే నెమ్మదిగా వేయడంతో అంచనా తప్పిన అతను... రెండో ఇన్నింగ్స్‌లో బంతి టర్న్ కాకపోవడంతో భంగ పడ్డాడు. బెంగళూరు టెస్టులోనైతే ఏబీ పూర్తిగా దూకుడు మంత్రం పాటించాడు. తొలి టెస్టు అనుభవంతో అతి జాగ్రత్తకు పోకుండా ఎదురుదాడికి ప్రయత్నించాడు. జడేజా బౌలింగ్‌లోనే నాలుగు ఫోర్లు బాదిన అతను అదే జోరులో వికెట్ ఇచ్చాడు. ఈసారి భిన్నంగా ప్రయత్నించిన జడేజా, మరోసారి షాట్‌కు ప్రయత్నించేలా కవ్వించాడు. ముందుకొచ్చి ఆడబోయిన అతను అక్కడే లెగ్‌సైడ్ బంతి గాల్లోకి లేపాడు. మూడో టెస్టులోనూ జడేజా దాదాపు అదే మంత్రం ప్రయోగించాడు. దాంతో ఆఫ్‌సైడ్ బంతిని లెగ్ మీదుగా ఆడి నేరుగా బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనైతే అశ్విన్ అద్భుతం అతడిని పెవిలియన్ చేర్చింది. టి20ల అనంతరం ‘రెండు మ్యాచ్‌లలోనూ అశ్విన్ నన్ను అవుట్ చేయడంకంటే నేను అవుట్ అయ్యానని చెప్పడమే సరైంది. నాలో సాంకేతిక లోపాలు లేవు. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నంలోనే వెనుదిరిగాను’ అని గట్టిగా చెప్పిన ఏబీ... టెస్టుల్లో మాత్రం ఆ పని చేయలేకపోయాడు. ఇక సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందైనా డివిలియర్స్ ప్రత్యేక సన్నాహకంతో సిద్ధమై వస్తాడా లేక మరోసారి అలాగే అవుటవుతాడా చూడాలి. -
మా బౌలర్లు భేష్
ఫలితం నిరాశపర్చింది విరాట్ కోహ్లి వ్యాఖ్య బెంగళూరు: వర్షం కారణంగా రెండో టెస్టులో నాలుగు రోజుల పాటు ఆట జరగకపోవడం తమను పూర్తిగా నిరాశకు గురి చేసిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. శుభారంభం కొనసాగించాలని పట్టుదలగా ఉన్నా సాధ్యం కాలేదని అన్నాడు. ‘మేం పటిష్టమైన స్థితిలో నిలిచాం. అక్కడినుంచి మ్యాచ్‌ను శాసించే ప్రయత్నంలో ఉండగా వాతావరణం ప్రభావం చూపించింది. తర్వాతి నాలుగు రోజులు ఏమి చేయలేకపోయాం’ అని కోహ్లి నిరాశగా చెప్పాడు. చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమని, ఇలాంటి చోట మూడు సెషన్ల లోపే నంబర్‌వన్ జట్టును ఆలౌట్ చేయడం తమ బౌలర్ల ఘనతగా పేర్కొన్న కెప్టెన్, వారిపై ప్రశంసలు కురిపించాడు. నాలుగు రోజుల ఆట పోయాక రిజర్వ్ డే ఉన్నా ప్రయోజనం ఉండదని, ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలే కొనసాగడం మంచిదని అతను అభిప్రాయ పడ్డాడు. తొలి టెస్టులో విఫలమైన శిఖర్ ధావన్, ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న కీపర్ సాహాలకు కోహ్లి మద్దతుగా నిలిచాడు. వారిద్దరు బాగా ఆడుతున్నారని, అనవసరపు ఒత్తిడి పెంచవద్దని అతను కోరాడు. మరో వైపు ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ తమ బ్యాటింగ్ విఫలమైందని, అయితే ఇంకా సిరీస్‌లో కోలుకునేందుకు అవకాశం ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా విశ్వాసం వ్యక్తం చేశాడు. -
నమన్ ఓజా డబుల్ సెంచరీ
భారత్ ‘ఎ' 475/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా ‘ఎ' 126/6 బ్రిస్బేన్: నమన్ ఓజా (250 బంతుల్లో 219 నాటౌట్; 29 ఫోర్లు, 8 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో పాటు బౌలర్లు నిలకడగా రాణించడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ' పట్టు బిగించింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం భారత్ ‘ఎ' తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఫిల్ హ్యూస్ (34)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ మరో 349 పరుగులు వెనుకబడి ఉంది. ఓజా దూకుడు... ఓవర్‌నైట్ స్కోరు 304/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్‌ను ఓజా నడిపించాడు. సోమవారం భారత్ స్కోరుకు మరో 171 పరుగులు చేరితే... అందులో ఓజా ఒక్కడే 137 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ ఆసాంతం భారీ షాట్లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ సెంచరీ, డబుల్ సెంచరీలను సిక్సర్లతోనే పూర్తి చేసుకోవడం విశేషం.