ఆస్ట్రేలియాలో శిక్షణకు యువ బౌలర్లు! | Four bowlers for training stint in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో శిక్షణకు యువ బౌలర్లు!

Published Thu, Jun 23 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

Four bowlers for training stint in Australia

ముంబై: ముంబై, కర్ణాటకల నుంచి నలుగురు యువ బౌలర్లు ఆస్ట్రేలియాలోని సెంట్రాఫ్ క్రికెటింగ్ ఎక్సలెన్సీ శిక్షణకు ఎంపికయ్యారు. ముంబైకి చెందిన మినాద్ మంజ్రేకర్,  తుషార్ దేశ్ పాండేలతో పాటు బెంగళూరుకు చెందిన ప్రషిత్ కృష్ణా, డేవిడ్ మాథాయిస్లు ఈ శిక్షణకు ఎంపికయ్యారు. 

 

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) బౌలింగ్ ఫౌండేషన్ల నుంచి తలో ఇద్దర్ని సెంట్రాఫ్ క్రికెటింగ్ ఎక్సలెన్సీ  శిక్షణకు ఎంపిక చేశారు. గత కొన్నివారాల పాటు ఆయా క్యాంప్ ల్లో  నిర్వహించిన పోటీల్లో ఈ నలుగురు విజేతలుగా నిలవడంతో వారిని ఆస్ట్రేలియాలో శిక్షణకు ఎంపిక చేశారు.  తాజాగా ఎంపికైన ఈ యువ బౌలర్లు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జెఫ్ థాంప్సన్, కోచ్ విశాల్ మహదిక్ ల వద్ద నెలరోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ రెండు బౌలింగ్ ఫౌండేషన్లకు ఐడీబీఐ లైఫ్ ఇన్సూరెన్స్  స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement